23, సెప్టెంబర్ 2017, శనివారం

Sivoham sivoham

[23/09, 8:04 PM] Syamala Rao SSSS: 🙏  *రామాయణం*  🙏
యుద్ధకాండ సర్గ102- శ్లో13

శ్రీరాముని శ్లోకం యుద్ధమున
లక్ష్మణుడు పడిపోయినపుడు

   *దేశే   దేశే   కళత్రాణి*
  *దేశే దేశే  చ   బాంధవాః*
  *తం తు దేశం న పశ్యామి*
 *యత్ర  భ్రాతా సహోదరః*

  భావ గానం
*దేశ దేశా లందోయి*
*అక్కడ బంధువు లుంటారోయి*
*దేశ దేశా లందోయి*
*ఎక్కడ సహోదరు లుంటారోయి*
 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[23/09, 8:04 PM] Syamala Rao SSSS: 🙏 *శివోహం శివోహం*🙏

రచన:ఆది శంకరాచార్యులు
భావ గానం: శ్యామలరావు

*న మే ద్వేష రాగౌ*
*న మే లోభ మోహౌ*
*మదో నైవ మే నైవ*
 *మాత్సర్యభావః*
*న ధర్మో న చార్థో*
*న కామో న మోక్షః*
*చిదానందరూపః*
*శివోహం శివోహం*
🙏🙏🙏🙏🙏🙏🙏

*లేవు నాలో రాగ ద్వేషాలు*
*లేవు నాలో లోభ మోహాలు*
*లేవు నాలో కామమోక్షాలు*
*లేవు నాలో మదమత్సాలు*
*లేవు నాలో ధర్మ అర్దాలు*

*నేనే చిదానందరూపం*
*నేనే శివం నేనే శివం*

🙏🙏🙏🙏🙏🙏🙏
[23/09, 8:04 PM] Syamala Rao SSSS: |
🙏 *శివోహం శివోహం*🙏
     (నిర్వాణషట్కమ్ -5)
రచన:ఆది శంకరాచార్యులు
భావ గానం: శ్యామలరావు

 *మృత్యుశంకా న*
 *మే జాతిభేదః*
*పితా నైవ మే నైవ*
 *మాతా న జన్మ*
*న బంధుర్న మిత్రం*
 *గురుర్నైవ శిష్యః*
*చిదానందరూపః*
*శివోహం శివోహమ్*
🙏🙏🙏🙏🙏🙏

భావగానం:
*నాకు చావు శంకా లేదు*
*నాకు జాతి తేడా లేదు*
*నాకు జననము  లేదు*
*నాకు అమ్మనాన్నలేరు*
*నాకు బంధుమిత్రులు లేరు*
*నాకు గురు శిష్యులు లేరు*
*నేనే చిదానందరూపం*
*నేనే శివం నేనే శివం*
🙏🙏🙏🙏🙏🙏🙏

5, సెప్టెంబర్ 2017, మంగళవారం

శ్రీరుద్రం భావగానం అనువాకం 7,8

[05/09, 5:20 PM] Syamala Rao SSSS: 🙏 *శ్రీ రుద్రం* 🙏
తెలుగు భావ గానం
మూలం: యజుర్వేదం
అనువాకము 7

*యుద్ధభేరి నాధ రూపునకు*
*శత్రు భయంకరరూపునకు*
*శత్రుఅంచనా సమర్థునకు*
*రాయబారి  రూపునకు*
 *రాజహిత  రూపునకు*
*బాణాల పొది కత్తికల*
*రుద్రునకు వందనం*

*పదునైన ఆయుద రూపునకు*
*మేలుచేయు విలుకానికి*
*రుద్రునకు వందనం*

*కాలిబాట నడిచే రుద్రునకు*
*రాజమార్గాన రుద్రునకు*
*నీరు సెలయేళ్ళరూపునకు*
*రుద్రునకు వందనం*

*నీటికొలను , బురద రూపునకు*
*నీటిబావులు రసాల రూపునకు*
*తెల్లమేఘాల వానమేఘాల రూపునకు*
*మెరుపుల మేఘాల రూపునకు*
*రుద్రునకు వందనం*

*నల్ల మేఘాల ఎండ మేఘాల రూపునకు*
*గాలివానల మేఘాల రూపునకు*
*ప్రళయకాల జల రూపునకు*
*గోవులు గృహాలు కాపాడు*
*రుద్రునకు వందనం*


అనువాకము 7 సమాప్తము

  భక్తి భావగానాలు కోసం   లింక్ ను టచ్ చేయండి
Syamalaraossss.blogspot.in
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[05/09, 9:38 PM] Syamala Rao SSSS: 🙏 *శ్రీరుద్రం*🙏
మూలం : యజుర్వేదం
నమకం అనువాకము 8.
తెలుగు భావ గానము
1)
*సోమునకువందనం*
 *రుద్రునకు వందనం*
2)
*రాగి రంగు రక్త రంగు*
*రుద్రునకు వందనం*
3)
*పుణ్యపతికి పశుపతికి*
*రుద్రునకు వందనం*
4)
*ఉగ్రరూపునకు*
 *భీమరూపునకు*
*రుద్రునకు వందనం*
5)
*ఎదురుగా ఉన్న*
*దూరాన ఉన్న*
*వారిని వధించు*
*రుద్రునకు వందనం*
6)
*దగ్గరగా వున్న*
*దూరాన వున్న*
*వారిని వధించు*
*రుద్రునకు వందనం*
7)
*వృక్షాల రూపునకు*
*ఆకుల రూపునకు*
*రుద్రునకు వందనం*
8)
*ఓం కార రూపునకు*
*రుద్రునకు వందనం*
9)
 *సుఖ కారకరూపుడు*
*లోకసుఖ భావకుడు*
*రుద్రునకు వందనం*
10)
 *లోకిక సుఖ రూపునకు*
*మోక్ష సుఖ రూపునకు*
*రుద్రునకు వందనం*

11)
 *కల్యాణ స్వ రూపునకు*
*కల్మషరహిత రూపునకు*
*రుద్రునకు వందనం*
12)
*పుణ్య తీర్ధాల రూపునకు*
*నదీతీర లింగ రూపునకు*
 *రుద్రునకు వందనం*

13)
*సంసార మోక్ష రూపునకు*
*సంసార సాగర మీదించు*
 *రుద్రునకు వందనం*

14)
*తత్వా జ్ఞాన రూపునకు*
*మంత్ర జప రూపునకు*
 *రుద్రునకు వందనం*

15)
*జీవన గమన రూపునకు*
*జీవ కర్మఫల రూపునకు*
*రుద్రునకు వందనం*
16)
*నదీతీర గరిక రూపునకు*
*నదీతీర నురగరూపునకు*
*రుద్రునకు వందనం*
17)
*ఇసుక రూపునకు*
*ప్రవాహ రూపునకు*
*రుద్రునకు వందనం*

 అనువాకము 8. సంపూర్ణం
సర్వం శివార్పణం స్వాహా