26, ఆగస్టు 2023, శనివారం

 ఆదిత్య హృదయం+బావ గానం

పార్ట్ 2 ( శ్లోకాలు 11 - 20)

మూలం రచన: వాల్మీకి ఋషి

 సందర్భం:

రామాయణం యుద్ధకాండ

భావ గానం రచన:

శ్యామల రావుssss

 


పచ్చని గుర్రాలు వేల కిరణాలు 

ఏడు గుర్రాలు    కీర్తి కిరణాలు

చీకటి తొలగించు సుఖం కలిగించు

సర్వం లయించు పుట్టించు సూర్యం

విశ్వం అంతా వ్యాపించు భానుం

*హరిదశ్వః సహస్రార్చిః*

 *సప్తసప్తి-ర్మరీచిమాన్ |*

*తిమిరోన్మథనః శంభుః త్వష్టా*

 *మార్తాండకోంఽశుమాన్ ‖ 11 ‖*


బంగారు గర్భం చలి నాశకం

శ్రీ సూర్యం భాస్కరం  రవిం

అగ్ని గర్భం అదితి పుత్రం

ఆనందకరం  చలి నాశకం

*హిరణ్యగర్భః శిశిరః*

*తపనో భాస్కరో రవిః |*

*అగ్నిగర్భోఽదితేః పుత్రః*

*శంఖః శిశిరనాశనః ‖ 12 ‖*


ఆకాశ నాథం చీకటి నాశకం

రుగ్వేద సామవేద పండితం

మహా వర్షం వానల మిత్రం

వింధ్యా గిరి వైపు విహారీం

*వ్యోమనాథ స్తమోభేదీ*

 *ఋగ్యజుఃసామ-పారగః |*

*ఘనవృష్టి రపాం మిత్రో*

 *వింధ్యవీథీ ప్లవంగమః ‖ 13 ‖*


ఎండ రూపం గుండ్రని రూపం

మృత్యు రూపం ఎర్రని రూపం

సకల వేడిరూపం మహా తేజం

సకల జీవ జనన కారణ రవిం

*ఆతపీ మండలీ మృత్యుః*

 *పింగళః సర్వతాపనః |*

*కవిర్విశ్వో మహాతేజా*

 *రక్తః సర్వభవోద్భవః ‖ 14 ‖*


నక్షత్ర గ్రహ తారల నాయకం

విశ్వ కారకం తేజో నాయకం

తేజస్సులలో  తేజ ఆదిత్యం

వందే 12 ఆదిత్యుల ఆత్మాం 

*నక్షత్ర గ్రహ తారాణాం*

*అధిపో విశ్వభావనః |*

*తేజసామపి తేజస్వీ*

 *ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ‖ 15 ‖*


తూర్పు కొండ సూర్య వందనం

పశ్చమ కొండ సూర్య వందనం

గ్రహాల తారల నాథా  వందనం

రోజుల రాజు  సూర్య వందనం

*నమః పూర్వాయ గిరయే*

 *పశ్చిమాయాద్రయే నమః |*

*జ్యోతిర్గణానాం పతయే*

 *దినాధిపతయే నమః ‖ 16 ‖*


విజయ వీరాయ  వందనం

పచ్చ    అశ్వాయ వందనం

వేలాది కిరణాయ వందనం

ఆదితి  పుత్రాయ వందనం

*జయాయ జయభద్రాయ*

 *హర్యశ్వాయ నమో నమః |*

*నమో నమః సహస్రాంశో*

 *ఆదిత్యాయ నమో నమః ‖ 17 ‖*


ఉగ్రాయ వీరాయ వందనం

వేగ  యాత్రికాయ వందనం

కమల వికాసాయ వందనం

లోకాల జనకాయ వందనం

*నమ ఉగ్రాయ వీరాయ*

 *సారంగాయ నమో నమః |*

*నమః పద్మప్రబోధాయ*

 *మార్తాండాయ నమో నమః ‖ 18 ‖*


బ్రహ్మ విష్ణుల ఈశ్వరాయ

సూర్య తేజ  ఆదిత్యాయ

ప్రకాశాయ  సర్వభక్షాయ

రౌద్ర  రూపాయ వందనం

*బ్రహ్మేశానాచ్యుతేశాయ*

 *సూర్యాయాదిత్య-వర్చసే |*

*భాస్వతే సర్వభక్షాయ*

 *రౌద్రాయ వపుషే నమః ‖ 19 ‖*


చీకటి మంచు నాశాయ

శత్రు నాశాయ తేజాయ

దుష్ట నాశాయ దేవాయ

వందే గ్రహతారల దేవాయ

*తమోఘ్నాయ హిమఘ్నాయ*

 *శత్రుఘ్నాయా మితాత్మనే |*

*కృతఘ్నఘ్నాయ దేవాయ*

 *జ్యోతిషాం పతయే నమః ‖ 20 ‖*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.15*


*కృష్ణుడు పాంచజన్యం*

*అర్జునుడు దేవదత్తం*

*భీమసేనుడు పౌండ్రం* 

*శంఖాలు పూరించిరి*



*పాంచజన్యం హృషీకేశో*

*దేవదత్తం   దనంజయః*

*పౌండ్రం దధ్మౌ మహాశంఖం*

*భీమకర్మా    వృకోదరః*


http://syamalaraossss.blogspot.com