8, నవంబర్ 2021, సోమవారం

16, జులై 2021, శుక్రవారం

సాంఖ్యయోగం శ్లో.62

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

సాంఖ్యయోగం శ్లో.62


విషయాలు ఆలోచించు వానికి 

ఆ విషయాలపై ఆసక్తి కలుగును

ఆసక్తి వలన కోరికలు కలుగును

కోరికలు వలన కోపం కలుగును


*ధ్యాయతో విషయాన్ పుంసః*

*సంగస్తేషూపజాయతే*

*సంగాత్ సంజాయతే కామః*

*కామాత్ క్రోధోఽభిజాయతే*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

 భక్తి స్తోత్రం భావ గానం fb page

2, జులై 2021, శుక్రవారం

గీత. అ.2. శ్లో.51

 సరళంగా సులభంగా

*సాంఖ్యయోగం*

సంఖ్య= నంబర్

(సాంఖ్యా= 1,2,3 etc  )

 numbers for  counting


యోగం= chapter 

భావం:  accounts  


*గీత. అ.2. శ్లో.51*


తమ కర్మలఫలాలు ఆశించరు

అలా సమబుద్ధి గల జ్ఞానులు

మరుజన్మ బంధాలు వీడెదరు 

అలా పరమపదం పొందెదరు


*కర్మజం బుద్ధియుక్తా హి*

*ఫలం త్యక్త్వా మనీషిణః*

*జన్మబంధవినిర్ముక్తాః*

*పదం గచ్ఛంత్యనామయం*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావగానం fb

27, జూన్ 2021, ఆదివారం

గీత. అ.2. శ్లో.47

 సరళంగా సులభంగా

గీత. అ.2. శ్లో.47

సాంఖ్యయోగము


కర్మలు చేయు అధికారం కలదు

కర్మ ఫలం కోరు అధికారం లేదు

కర్మ ఫలాలకు కారణం కారాదు

కర్మలు చేయకుండ మానరాదు


*కర్మణ్యేవాధికారస్తే*

*మా ఫలేషు కదాచన*

*మా కర్మఫలహేతుర్భూః*

*మా తే సంగోఽస్త్వకర్మణి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss. blogspot

12, జూన్ 2021, శనివారం

సాంఖ్యయోగము *గీత. అ.2. శ్లో.32*

 సరళంగా సులభంగా

సాంఖ్యయోగము

*గీత. అ.2. శ్లో.32*


అనుకోకుండా వచ్చిన అవకాశం

స్వర్గ ద్వారం తెరిచిన అవకాశం

క్షత్రియులు సుఖించు అవకాశం  

పార్థా పోరాడి  పొందే అవకాశం


*యదృచ్ఛయా చోపపన్నం*

*స్వర్గద్వారమపావృతమ్*

*సుఖినః క్షత్రియాః   పార్థ*

*లభంతే యుద్ధమీదృశమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

భక్తి స్తోత్రం భావగానం ఫేస్బుక్

7, జూన్ 2021, సోమవారం

సాంఖ్యం అర్దం భావం ఉద్దేశం

 *సాంఖ్యం*  

అర్దం భావం ఉద్దేశం

మూలం : వికి పీడియా

భావగానం:శ్యామలరావు

 

*అర్దం*:  

సాంఖ్య:  ఒక అంకె

సాంఖ్యం: లెక్కించే అంకెలు


*భావం*: 

దాటిన నిజ తత్వాల సంఖ్య


*ఉద్దేశం*:

మొత్తం 25 తత్వాలు దాటాలి

నీ గమ్యం మోక్షం ముక్తి చేరాలి


*వివరణ*

ఇది వేద ఉపనిషత్తుల పదం

ఇది ఋషి జ్ఞాన   అనుభవం

ఇది వారి అవగాహన సారం

ఇది జ్ఞాన  విచారణ వివరం 

 

*తత్వాల లక్ష్యం*

జంతు భావాల నుంచి  విముక్తి  

రాక్షస  భావాల నుంచి  విముక్తి

నిజమైన భావాలను తెలపటం

పురుషులలోని ఆత్మ తెలపటం

ఆత్మ పరమాత్మలను తెలపటం

పరమ పురుష లోకం తెలపటం

పరమాత్మ  లోకం చేరాలనటం

ముక్తి వైపు ప్రభావితం చేయటం

6, జూన్ 2021, ఆదివారం

గీత. అ.2. శ్లో.27

 *గీత. అ.2. శ్లో.27*


పుట్టిన  వారు మరణించక తప్పదు

మరణించిన వారు పుట్టుక తప్పదు

కనుక పరిహారం లేని వాటి కోసము

ఆ విషయాలకై నీవు శోకింపతగదు


*జాతస్య హి ధ్రువో మృత్యుః*

*ధ్రువం జన్మ మృతస్యచ*

*తస్మాదపరిహార్యేఽర్థే*

*న త్వం శోచితుమర్హసి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం ఫేస్బుక్

2, జూన్ 2021, బుధవారం

గీత. అ.2. శ్లో.23

 సరళంగా  సులభంగా 

భగవద్గీత భావ గానం

సాంఖ్యయోగము

*గీత. అ.2. శ్లో.23*


ఆత్మను అస్రం చంప లేదు

ఆత్మను అగ్ని  కాల్చ లేదు

ఆత్మను నీరు తడప లేదు 

ఆత్మను గాలి  ఆర్ప  లేదు


*నైనం ఛిందంతి శస్త్రాణి*

*నైనం   దహతి   పావకః*

*న చైనం   క్లేదయంత్యాపో*

*న   శోషయతి  మారుతః*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

 భక్తి స్తోత్రం భావ గానం ఫేస్బుక్ పేజ్

అ.2. శ్లో.22

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

అ.2. శ్లో.22


జనులు పాత బట్టలు వీడి

కొత్త  బట్టలు  ధరించినట్లు

జీవాత్మ  పాత దేహం వీడి

వేరే కొత్త దేహం ధరించును


*వాసాంసి జీర్ణాని యథా విహాయ*

*నవాని గృహ్ణాతి నరోఽపరాణి*

*తథా శరీరాణి విహాయ జీర్ణా*

*న్యన్యాని సంయాతి నవాని దేహీ*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం ఫేస్ బుక్

29, మే 2021, శనివారం

సాంఖ్య యోగం *గీత.అ.2. శ్లో.18*

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

*సాంఖ్య యోగం*

*గీత.అ.2. శ్లో.18*


దేహాలకే అంతం ఉంది   

దేహాత్మ అంతం  లేనిది

అది   అనంతం నిత్యం

కనుక పోరాడు అర్జునా


*అంతవంత ఇమే  దేహా*

*నిత్యస్యోక్తాః శరీరిణః*

*అనాశినోఽప్రమేయస్య*

*తస్మాద్యుధ్యస్వ భారత*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

భక్తి స్తోత్రం  భావ గానం fb page

27, మే 2021, గురువారం

గీత. అ.2. శ్లో.17


 సరళంగా సులభంగా

 భగవద్గీత భావ గానం

*సాంఖ్యయోగము*

*గీత. అ.2. శ్లో.17*


మన లోనిది  నాశనం లేనిది

తెలుసుకో అంతటా వున్నది    

అది శాశ్వతము నశించనిది 

ఎవరూ నాశనం చేయలేనిది


*అవినాశి తు తద్విద్ధి*

*యేన సర్వమిదం తతమ్*

*వినాశమవ్యయస్యాస్య*

*న   కశ్చిత్   కర్తుమర్హతి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం Fb page

26, మే 2021, బుధవారం

గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.14

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

*గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.14*


సుఖ దుఃఖాలె ఇంద్రియ విషయాలు

చలి వేసవి కాలం వంటి విషయాలు

అవి నిత్యం వచ్చి పోవు విషయాలు

అర్జునా ఓపికపట్ట తగు విషయాలు


*మాత్రాస్పర్శాస్తు కౌంతేయ*

*శీతోష్ణసుఖదుఃఖదాః*

*ఆగమాపాయినోఽనిత్యాః*

*తాంస్తితిక్షస్వ   భారత*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

భక్తి స్తోత్రం భావ గానం FB page

25, మే 2021, మంగళవారం

 సరళంగా సులభంగా

 భగవద్గీత భావ గానం

గీత. అ.2. శ్లో.12


అర్జునా నేను లేని కాలము ఉండదు 

నీవు రాజులు లేని కాలము ఉండదు

మనంలేని భవిష్య కాలము ఉండదు

అందరం ఆ కాలంలో కూడ  ఉంటాం


*నత్వేవాహం జాతు నాసం*

*న త్వం   నేమే   జనాధిపాః*

*న చైవ న    భవిష్యామః*

*సర్వే వయమతః  పరమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం fb page

24, మే 2021, సోమవారం

గీత.సాంఖ్యయోగం అ.2.. శ్లో.13

 సరళంగా సులభంగా

భగవద్గీత+ భావ గానం

గీత.సాంఖ్యయోగం అ.2.. శ్లో.13


ఎలా దేహము  బాల్యం పొందునో

యవ్వనం ముసలితనం పొందునో 

అలా దేహి మరో దేహం పొందును

ధీరుడు దీనికి  మోహం  పొందడు


*దేహినోఽఅస్మిన్ యథా దేహే*

*కౌమారం యౌనవం  జరా*

*తథా   దేహాంతరప్రాప్తిః*

*ధీరస్తత్ర  న   ముహ్యతి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

18, మే 2021, మంగళవారం

సాంఖ్య యోగం గీత.అ.2. శ్లో.5

 సరళంగా  సులభంగా

భగవద్గీత భావ గానం

సాంఖ్య యోగం

గీత.అ.2. శ్లో.5


గురువులు మహనీయులను చంపి

రక్తము చిందిన భోగం తినుట కంటే

గురువులు మహనీయులను చంపక

బిక్షం అడుక్కుని తినుట మేలు కదా


*గురూనహత్వా హి మహానుభావాన్*

*శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే*

*హత్వార్థకామాంస్తు గురూనిహైవ*

*భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం fb page

16, మే 2021, ఆదివారం

అ.1.శ్లో.37

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.37


*మన బంధువులను మాధవా*

*మన వారిని చంపుట తగదు* 

*మన వారిని  మనం చంపుట*

*మనకు ఎలాసుఖం మాధవా*


*తస్మాన్నార్హా  వయం హంతుం*

*ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్*

*స్వజనం హి కథం హత్వా*

*సుఖినః స్యామ మాధవ*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

అ.1.శ్లో.41

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.41



కృష్ణా  అధర్మం పెరిగినపుడు   

కులస్త్రీలు తిట్లు పడుదురు

కులస్త్రీలు తిట్లు పడినపుడు  

కుల సంకరమవును కృష్ణా


*అధర్మాభిభవాత్  కృష్ణ*

*ప్రదుష్యంతి  కులస్త్రియః*

*స్త్రీషు  దుష్టాసు వార్ష్ణేయ*

*జాయతే      వర్ణసంకరః*


 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

అ.1.శ్లో.46

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.46


ప్రతీకార బాణాలు వేయను

అస్త్రాలు శస్త్రాలు వేయను

కౌరవులు పోరులో చంపినా

అది నాకు  క్షేమమే అవును


*యది మామప్రతీకారమ్*

*అశాస్త్రం శస్త్రపాణయః*

*ధార్తరాష్ట్రా రణే  హన్యుః*

*తన్మే క్షేమతరం   భవేత్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

గీత.అ.2.సాంఖ్యయోగము. శ్లో.3

 💐 *గీత.అ.2.సాంఖ్యయోగము. శ్లో.3*


*క్లైబ్యం మా స్మ గమః పార్థ*

*నైతత్త్వయ్యుపపద్యతే*

*క్షుద్రం హృదయదౌర్బల్యం*

*త్యక్త్వోత్తిష్ఠ     పరంతప*



పిరికితనం వీడాలి పార్థా

ఇది  నీకు తగినది కాదు

గుండెదౌర్బల్యం తగనిది

లేచి నిలబడు పరంతపా

2.సాంఖ్యయోగము.శ్లో.1.

 2.సాంఖ్యయోగము.శ్లో.1.

*సంజయ ఉవాచ*


*తం తథా కృపయావిష్టమ్*

*అశ్రుపూర్ణాకులేక్షణమ్*

*విషీదంతమిదం వాక్యమ్*

*ఉవాచ మధుసూదనః*


సంజయుడు పలికెను

అలా అపుడు అర్జునుని

కనులలో కన్నీరు నిండెను

ఆతని దుఃఖము చూసెను

శ్రీకృష్ణుడు ఇలా పలికెను

గీత.అ.2. శ్లో.2

 సరళంగా  సులభంగా

భగవద్గీత భావ గానం

సాంఖ్య యోగం

గీత.అ.2. శ్లో.2


శ్రీకృష్ణ భగవానుడు పలికెను


పార్ధా ఈ కల్మషం ఎక్కడిది

ఇక్కడి విషయానికి తగదు

ఇలా ఆర్యులు చేయరాదు

స్వర్గము కీర్తి  చేరనీయదు



*శ్రీ భగవాన్ ఉవాచ*


*కుతస్త్వాకశ్మలమిదం*

*విషమేసముపస్థితమ్*

*అనార్యజుష్టమస్వర్గ్యమ్*

*అకీర్తికరమర్జున*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం

syamalaraossss.blogspot.com

*గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.4*

 *గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.4*


*అర్జునుడు పలికెను.*

 

*భీష్ముడు మా  తాతగారు*

*ద్రోణుడు నా గురువుగారు* 

*వారితో ఎలా పోరాడెదను*

*వారిద్దరు పూజ్యులు కృష్ణా*


*అర్జున ఉవాచ*

*కథం   భీష్మమహం సంఖ్యే*

*ద్రోణం చ    మధుసూదన*

*ఇషుభిః   ప్రతియోత్స్యామి*

*పూజార్హావరిసూదన*

 సరళంగా  సులభంగా

భగవద్గీత భావ గానం

సాంఖ్య యోగం

గీత.అ.2. శ్లో.3


పార్థా పిరికితనం వలదు    

అది వృథ్ధి కి నిలబడదు 

గుండె దౌర్బల్యం వలదు

శత్రునాశకా లే నిలబడు 


*క్లైబ్యం మా స్మ గమః పార్థ*

*నైతత్త్వయ్యుపపద్యతే*

*క్షుద్రం హృదయదౌర్బల్యం*

*త్యక్త్వోత్తిష్ఠ     పరంతప*



సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం

syamalaraossss.blogspot.com

12, మే 2021, బుధవారం

అర్జున విషాదయోగం అ.1.శ్లో.47

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.47


సంజయుడు పలికెను


అలా అనిన అర్జునుడు

రథం లో  కూచుండెను

విల్లు  బాణాలు వీడెను

చాల దుఃఖం పొందెను


*సంజయ ఉవాచ*

*ఏవముక్త్వార్జునః సంఖ్యే*

*రథోపస్థ  ఉపావిశాత్*

*విసృజ్య సశరం చాపం*

*శోకసంవిగ్నమానసః*



సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

4, మే 2021, మంగళవారం

అర్జున విషాదయోగం అ.1.శ్లో.39

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.39


అంతా  తెలిసిన మనమే

పాపం ఎందుకు చేయాలి       

కుల క్షయం చేయు దోషం 

మనమేల ఆపరాదు కృష్ణా


*కథం న జ్ఞేయమస్మాభిః*

*పాపాదస్మాన్నివర్తితుమ్*

*కులక్షయకృతం  దోషం*

*ప్రపశ్యద్భిర్జనార్దన*


 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

2, మే 2021, ఆదివారం

అర్జున విషాదయోగం అ.1.శ్లో.38

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.38


*వీరు దోషం చూడ లేకున్నారు* 

*వీరు లోభం   వీడ లేకున్నారు* 

*వీరు మిత్రద్రోహం కుల క్షయం*

*ఇంకా పాపం  చేయనున్నారు*


*యద్యప్యేతే న  పశ్యంతి*

*లోభోపహతచేతసః*

*కులక్షయకృతం దోషం*

*మిత్రద్రోహే చ పాతకమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

30, ఏప్రిల్ 2021, శుక్రవారం

భగవద్గీత + భావ గానం అ.1.శ్లో.36

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.36



*కౌరవులను చంపినందున*

*మనవారిని చంపినందున*

*మనకు మేలేమి కలుగును*

*కృష్ణా  పాపమే  కలుగును*


*నిహత్య ధార్తరాష్ట్రాన్నః*

*కా ప్రీతిః    స్యాజ్జనార్దన*

*పాపమేవాశ్రయేదస్మాన్*

*హత్వైతానాతతాయినః*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

28, ఏప్రిల్ 2021, బుధవారం

గీత. అ.1.శ్లో.34+ భావ గానం

 సరళంగా సులభంగా

గీత. అ.1.శ్లో.34+ భావ గానం

అర్జున విషాదయోగం


*ఎవరి కోసం రాజ్యం  కోరెదమో* 

*ఎవరి కోసం సుఖం   కోరెదమో*

*యుద్ధాన వారందరు నిలిచారు*

*యుద్ధాన ప్రాణంవీడ నిలిచారు*


*యాషామర్థే కాంక్షితం నో*

*రాజ్యం భోగాః సుఖాని  చ*

*త ఇమేఽవస్థితా  యుద్ధే*

*ప్రాణాంస్త్యక్త్వా   ధనాని చ*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

22, ఏప్రిల్ 2021, గురువారం

 సరళంగా సులభంగా

*భగవద్గీత+ భావగానం*

*అర్జునవిషాదయోగం*

*అ1.శ్లో.29*



*నా గొంతు తడి ఆరుతున్నది*

*నా ముఖము  వాడుతున్నది*

*నా శరీరము వణుకుతున్నది*

*నా  జుట్టు  నిలబడుతున్నది*


*సీదంతి మమ గాత్రాణి*

*ముఖం చ  పరిశుష్యతి*

*వేపథుశ్చ   శరీరే   మే*

*రోమహర్షశ్చ   జాయతే*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

For more  please visit  

syamalaraossss.blogspot.com

21, ఏప్రిల్ 2021, బుధవారం

*గీత అ.1.శ్లోకం: 28*

 సరళంగా సులభంగా 

*భగవద్గీత + భావ గానం*

 *అర్జున విషాద యోగం*

 *గీత అ.1.శ్లోకం: 28*


*అచట చేరిన  యుద్ద వీరులను*

*అచటి బంధువులను చూసెను*

*అతనికి వారిపై కరుణ కలిగెను*

*బాధగా కృష్టునితో పలికెను*



*కృపయా  పరయావిష్టో*

*విషీదన్నిదమబ్రవీత్*

*అర్జున ఉవాచ*

*దృష్ట్వేమం స్వజనం కృష్ణ*

*యుయుత్సుం  సముపస్థితమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

18, ఏప్రిల్ 2021, ఆదివారం

 సరళంగా సులభంగా 

*భగవద్గీత + భావ గానం*

 *అర్జున విషాద యోగం*

 *గీత అ.1.శ్లోకం: 25*



*భీష్మద్రోణాది ప్రముఖులను*

*సకలరాజుల చూడమనెను*

*సమావేశమైన  కౌరవులను*

*శ్రీకృష్ణుడు     చూడమనెను*


*భీష్మద్రోణప్రముఖతః*

*సర్వేషాం చ మహీక్షితామ్*

*ఉవాచ పార్థ  పశ్యైతాన్*

*సమవేతాన్   కురూనితి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

  

http://syamalaraossss.blogspot.com

17, ఏప్రిల్ 2021, శనివారం

*గీత.అ.1.శ్లో.24

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.24*



*సంజయుడు పలికెను*


*అర్జునుని మాట వినెను* 

*శ్రీకృష్టుడు భారతీయుల*

*ఉభయ సేనల మధ్యను*

*ఉత్తమ రథము నిలిపెను*



*సంజయ ఉవాచ*


*ఏవముక్తో హృషీకేశో*

*గుడాకేశేన     భారత*

*సేనయోరుభయోర్మధ్యే*

*స్థాపయిత్వా రథోత్తమమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

http://syamalaraossss.blogspot.com

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

అర్జున విషాద యోగం* *గీత.అ.1.శ్లో.23*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.23*


యోధులందరిని నేను చూడాలి

అచ్చట  చేరిన వారిని చూడాలి

దుష్ట దుర్యోధనుని ప్రియం కోసం

యుద్ధం చేయు వారిని చూడాలి



*యోత్స్యమానానవేక్షేఽహం*

*య ఏతే ఽత్ర సమాగతాః*

*ధార్తరాష్ట్రస్య  దుర్బుద్ధేః*

*యుద్ధే   ప్రియచికీర్షవః*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

http://syamalaraossss.blogspot.com

15, ఏప్రిల్ 2021, గురువారం

*గీత.అ.1.శ్లో.20*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.20*



*ఆపై అచటి కురుసేనల చూచెను*

*ఆంజనేయజెండా రథాన వీరుడు*

*అర్జునుడు విల్లుబాణాల వీరుడు*   

*అర్జునుడు విల్లు నిలిపి నిలిచెను*       




*అథ వ్యవస్థితాన్ దృష్ట్వా*

*ధార్తరాఓంష్ట్రాన్   కపిధ్వజః*

*ప్రవృత్తే శస్త్రసంపాతే*

*ధనురుద్యమ్య  పాండవః*



సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

http://syamalaraossss.blogspot.com

*గీత.అ.1.శ్లో.21*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.21*


*ఓ ధృతరాష్ట్ర మహారాజా*

 *కపిధ్వజుడైన అర్జునుడు*

*విల్లును పైకెత్తి  నిలిచెను*

 *కృష్టునితో  ఇలా అనెను*

  

*ఓ అచ్యుతా నా రథము*

*ఇరు సేనల మధ్యనిలుపు*




*హృషీకేశం తదా వాక్యమ్*

*ఇదమాహ   మహీపతే*


*అర్జున ఉవాచ*


*సేనయోరుభయోర్మధ్యే*

*రథం స్థాపయ మేఽచ్యుత*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

http://syamalaraossss.blogspot.com

13, ఏప్రిల్ 2021, మంగళవారం

గీత.అ.1.శ్లో.19*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.19*



*అలా శంఖాల నాదాలకు* 

*కౌరవుల గుండె అదిరెను*

*అలా శంఖాల నాదాలకు* 

*భూమి ఆకాశం అదిరెను*



*స ఘోషో ధార్తరాష్ట్రాణాం* 

*హృదయాని వ్యదారయత్*

*నభశ్చ      పృథివీం     చైవ*

*తుములో వ్యనునాదయన్*


http://syamalaraossss.blogspot.com

11, ఏప్రిల్ 2021, ఆదివారం

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.18*


*దృపదరాజు ద్రౌపది తనయులు*

*ఓ రాజా  సకల దేశాల  రాజులు*

*సుభద్రపుత్రుడు బాహుబలశాలి*

*తమ తమ శంఖాలు పూరించిరి*



*ద్రుపదో   ద్రౌపదేయాశ్చ*

*సర్వశః    పృథివీపతే*

*సౌభద్రశ్చ  మహాబాహుః*

*శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్*




http://syamalaraossss.blogspot.com

 దసరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.17*


*కాశ్యశ్చ  పరమేష్వాసః*

*శిఖండీ  చ   మహారథః*

*ధృష్టద్యుమ్నో  విరాటశ్చ*

*సాత్యకిశ్చాపరాజితః*


*కాశీరాజు మహావిలుకాడు*

*శిఖండి మరి  మహారథులు*

*ధృష్టద్యుమ్నుడు విరటరాజు*

*మరి అజేయుడు   సాత్యకి*

*(తమ శంఖాలు పూరించిరి)*

9, ఏప్రిల్ 2021, శుక్రవారం

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.16*



*ధర్మరాజు అనంతవిజయం*

*నకులుడు  సుఘోష శంఖం*

*సహదేవుడు మణిపుష్పకం*

*తమ శంఖాలు  పూరించిరి*


*అనంతవిజయం  రాజా*

*కుంతీపుత్రో  యుధిష్ఠరః*

*నకులః   సహదేవశ్చ*

*సుఘోషమణిపుష్పకౌ*


http://syamalaraossss.blogspot.com

8, ఏప్రిల్ 2021, గురువారం

*గీత.అ.1.శ్లో.15*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.15*


*కృష్ణుడు పాంచజన్యం*

*అర్జునుడు దేవదత్తం*

*భీమసేనుడు పౌండ్రం* 

*శంఖాలు పూరించిరి*



*పాంచజన్యం హృషీకేశో*

*దేవదత్తం   దనంజయః*

*పౌండ్రం దధ్మౌ మహాశంఖం*

*భీమకర్మా    వృకోదరః*


పిల్లల పాటలో ఆరోగ్య రహస్యం

 పిల్లల పాటలో ఆరోగ్య రహస్యం

 

*కాళ్ళ గజ్జ కంకాలమ్మా*

*వేగుల చుక్క వెలగా మొగ్గ*

*మొగ్గా కాదు మోదుగ ఆకు* 

*ఆకూ కాదు నిమ్మలవారి* 

*వారీ కాదు వావింటాకు* 

*ఆకు కాదు గుమ్మడి పండు*

*కాళ్ళు తీసి కడగాపెట్టు*


ఈ పాటలో ఆరోగ్య రహస్యం


కాళ్ళకు గజ్జి పోతుందమ్మ

కాళ్ళకు కంకోళం ఆకమ్మ

వేకువవేళ వెలగ పిందెమ్మ

తగ్గకపోతే మోదుగ ఆకమ్మ 

ఆకూకాదు నిమ్మరసమమ్మ

నిమ్మకాదు వావింటి ఆకమ్మ

ఆకుకాదు గుమ్మడిగుజ్జుమ్మ

నీ కాళ్ళ గజ్జి  పోయిందమ్మ 

నీ కాళ్ళ మడిచి పెట్టవమ్మ


🍬👏👏👏👏🍬

Rachana:

 syamalaraossss

7, ఏప్రిల్ 2021, బుధవారం

*గీత.అ.1.శ్లో.13*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.13*



*తదుపరి శంఖాలు పెద్ద భేరీలు*

*తప్పెట్లు డప్పులు గోముఖాలు*

*తోడుగా మ్రోగె పలు వాద్యాలు*

*భయం పుట్టించె వాద్యనాదాలు*



*తతః శంఖాశ్చ భేర్యశ్చ*

*పణవానకగోముఖా*

*సహసైవాభ్యహన్యంత*

*స శబ్దస్తుములోఽభవత్*




 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.13*



*తదుపరి శంఖాలు పెద్ద భేరీలు*

*తప్పెట్లు డప్పులు గోముఖాలు*

*తోడుగా మ్రోగె పలు వాద్యాలు*

*భయం పుట్టించె వాద్యనాదాలు*



*తతః శంఖాశ్చ భేర్యశ్చ*

*పణవానకగోముఖా*

*సహసైవాభ్యహన్యంత*

*స శబ్దస్తుములోఽభవత్*



http://syamalaraossss.blogspot.com

6, ఏప్రిల్ 2021, మంగళవారం

గీత.అ.1.శ్లో.12

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.12*


*దుర్యోధనుని సంతోషం కోసం*

*కౌరవ వృద్ధుడు తాత భీష్ముడు*

*గట్టిగా  సింహనాదం చేసెను*

*శూరంగా శంఖనాదం చేసెను*



*తస్య సంజనయన్ హర్షం*

*కురువృద్ధః  పితామహః*

*సింహనాదం వినద్యోచ్చైః*

*శంఖం దధ్మౌ  ప్రతాపవాన్*



30, మార్చి 2021, మంగళవారం

భగవద్గీత + భావగానం* *అర్జున విషాద యోగం* *గీత.అ.1.శ్లో.5*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.5*



*ధృష్టకేతుడు చేకితానుడు*

 *కాశీరాజు  మహా వీరులు*

 *పురుజిత్ కుంతిభోజుడు*

*శైబ్యుడు ఉత్తమ వీరులు*


*ధృష్టకేతుశ్చే కితానః*

*కాశిరాజశ్చ   వీర్యవాన్*

*పురుజిత్  కుంతిభోజశ్చ*

*శైబ్యశ్చ   నరపుంగవః*




26, మార్చి 2021, శుక్రవారం

గీతాప్రార్థన

 సరళంగా సులభంగా గా 

💐   *గీతాప్రార్థన*💐

💐 + *భావ గానం*💐


*ఓం దైవం  శ్రీమన్నారాయణం*

*స్వయంగా పార్థునికి బోధనం*

*పురాణముని వ్యాస  రచనం*

*మహాభారతం మధ్య రచనం*

*కురిపించు దైవ జ్ఞానామృతం*

*18 అధ్యాయాల గీతామృతం*

*కలిగించుము  దైవానుబంధం*

*తొలగించుము సంసారబంధం*


*సంస్కృతం*

*ఓం పార్థాయ ప్రతి బోధితాం*

*భగవతా నారాయణేన స్వయం*

*వ్యాసేన గ్రథితాం పురాణమునినా*

 *మధ్యే మహాభారతం*

*అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం*

*అంబ త్వామనుసందధామి*

 *భగవద్గీతే భవద్వేషిణీం*

syamalaraossss.blogspot.com

గీతాప్రాశస్త్యము 4

 💐 *గీతాప్రాశస్త్యము 4*💐


*ఇది గీతాశాస్త్రము పుణ్యము*

*ఎవరు ప్రయత్నించి పఠింతురో*

*వారు విష్టు లోకం  పొందెదరు*

*వారు భయం శోకం   వీడెదరు*


*గీతాశాస్త్ర మిదం  పుణ్యం*

*యః పఠేత్ ప్రయతః పుమాన్*

*విష్టో   పదమవాప్నోతి*

*భయశోకాదివర్జితః*

భగవద్గీత.1.1+ భావగానం

 .


సరళంగా సులభంగా

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*భగవద్గీత.1.1+ భావగానం*


*ధృతరాష్ట్రుడు పలికెను.*

*ధర్మక్షేత్రం కురుక్షేత్రం చేరినవారు*

*యుద్ధ  ఉత్సాహం కూడినవారు*

*పాండుపుత్రులు ఇంకా నా వారు*  

*సంజయా ఏం చేస్తున్నారు వారు*

 

*దృతరాష్ట్ర ఉవాచ.*

*ధర్మక్షేత్రే కురుక్షేత్రే*

*సమవేతా యుయుత్సవః*

*మామకాః పాండవాశ్చైవ*

*కిమకుర్వత  సంజయ*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

syamalaraossss.blogspot.com

 .


సరళంగా సులభంగా

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*భగవద్గీత.1.1+ భావగానం*


*ధృతరాష్ట్రుడు పలికెను.*

*ధర్మక్షేత్రం కురుక్షేత్రం చేరినవారు*

*యుద్ధ  ఉత్సాహం కూడినవారు*

*పాండుపుత్రులు ఇంకా నా వారు*  

*సంజయా ఏం చేస్తున్నారు వారు*

 

*దృతరాష్ట్ర ఉవాచ.*

*ధర్మక్షేత్రే కురుక్షేత్రే*

*సమవేతా యుయుత్సవః*

*మామకాః పాండవాశ్చైవ*

*కిమకుర్వత  సంజయ*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

syamalaraossss.blogspot.com

20, మార్చి 2021, శనివారం

గీతామహాత్యం-3

 💐 *గీతామహాత్యం* 💐

  💐 *+ భావ గానం* 💐


*గీతయే నా ఆసనం సింహాసనం* 

*గీతయే నా ఉత్తమం నా గృహం*

*జ్ఞానమే నా తోడు  నా ఆశ్రయం*

*నేనే మూడు లోకాలకు పాలకం*


*సంస్కృతం*

*గీతాశ్రయోఽహం తిష్ఠామి*

*గీతామే చోత్తమం గృహం*

*గీతా జ్ఞానం ఉపాశ్రిత్య*

*త్రిలోక పాలయామ్యహం*


🙏 *భక్తి స్తోత్రం భావగానం* 🙏

syamalaraossss.blogspot.com

14, మార్చి 2021, ఆదివారం

గీతా మహత్యం

 💐 *గీతామహాత్మ్యము*💐


*గీతయాః పుస్తకం యత్ర*

*యత్ర పాఠః   ప్రవర్తతే*

*తత్రసర్వాణి   తీర్థాని*

*ప్రయాగాదీని    తత్రవై*


ఎచట భగవద్గీత పుస్తకం ఉండునో 

ఎచట గీతా పారాయణం ఉండునో 

అచట ప్రయాగ తీర్థాలు  ఉండును

అచట సమస్త   తీర్థాలు  ఉండును


10, మార్చి 2021, బుధవారం

శివ పంచాక్షర స్తోత్రం + భావగానం

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*శివ పంచాక్షర స్తోత్రం*

  + *భావగానం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 సంస్కృత మూలం:

 శ్రీ ఆది శంకరాచార్యులు 

భావగానం రచన:

శ్యామలరావు ssss


*నాగేంద్ర హారాయ త్రిలోచనాయ*

*భస్మాంగరాగాయ  మహేశ్వరాయ* 

*నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ*

*తస్మై నకారాయ నమ శివాయ*

  || 1 ||

 నాగేంద్రుడు నీ కంఠహారమయ

 బూడిద శరీర అలంకారమయ

మూడు కనుల మహా దేవాయ

నిత్యమైన స్వచ్ఛమైన దేవాయ

దిక్కులే బట్టలు స్వతంత్రాయ

పంచాక్షరీ మంత్రనాధ దేవాయ

*న* కారాయ నమస్తే శివాయ

 

*మందాకినీ సలిల చందనచర్చితాయ*

*నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ*

*మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ*

*తస్మై మ కారాయ నమ శివాయ*

 || 2 ||


పవిత్ర గంగా చందన లేపితాయ 

నందీశ్వరాయ  మహేశ్వరాయ 

సకల భూత గణాల  పూజితాయ

మందార జిల్లేడుపూల అర్చితాయ

పలు రకాల పూలతో పూజితాయ  

*మ* కారాయ  నమస్తే   శివాయ


*శివాయ గౌరీ వదనాబ్జ బ్రుంగ*

*సూర్యాయ దక్షాధ్వర నాశకాయ*

*శ్రీనీలకంఠాయ వ్రుషభ ధ్వజయ*

*తస్మై శి కారాయ నమశివాయ*

|| 3 ||


గౌరీ ముఖకమల వికా‌స సూర్యాయ

శుభాయ  దక్షయజ్ఞ నాశనాయ 

శ్రీ నీల కంఠాయ నంది ద్వజాయ

*శి* కారాయ  నమస్తే   శివాయ 

 

 *వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది* 

*మునీంద్ర దేవార్చిత శేఖరాయ |*

*చంద్రార్క వైశ్వనర లోచనాయ*

*తస్మై వ_కారాయ నమశివయ*

 || 4 ||


వశిష్ఠ అగస్త్య గౌతమ మునులు

దేవతా పూజితా విశ్వ కిరీటాయ

అగ్ని సూర్య చంద్రుల కనులాయ

 *వ* కారాయ నమస్తే  శివాయ

 

 *యక్ష స్వరూపాయ  జఠాధరాయ*

 *పినాక హస్తాయ సనాతనాయ*

 *దివ్యాయ దేవాయ దిగంబరాయ*

*తస్మై య కారాయ నమ శివాయ*

 || 5 ||


 యక్ష రూపాయ జడల శిరోజాయ

 చేతి త్రిశూలాయ సనాతనాయ 

 దివ్యప్రకాశాయ దిశలె బట్టలయ

 *య* కారాయ నమస్తే శివాయ  


*పంచాక్షర మిదం పుణ్యం* 

*యః పఠేత్ శివ సన్నిధౌ*

 *శివ లోకమవాప్నోతి*

*శివేన సహమోదతే* || 6 ||


ఇది శివ పంచాక్షరీ మంత్రం

శివుని దగ్గర చదివిన పుణ్యం

వారు శివ లోకం  పొందెదరు 

 శివుని తో ఆనందించెదరు

1, మార్చి 2021, సోమవారం

*కఠోపనిషత్తు* భావగానం

 సరళంగా  సులభంగా 

*కఠోపనిషత్తు* భావగానం


*ఆదిశంకరాచార్య రచనం*   

*కఠినమైన సాధన సారం* 

*ఇది  ఆత్మ విద్యా సారం*  


*యముడు   తెలిపిన విద్య* 

*నచికేతునికి తెలిపిన విద్య* 


ఆత్మయే మెలుకువలో నిద్రలో

విశ్వంతో  సంబంధాల అంశం 

అదే ప్రాణం పరమాత్మ అంశం

వేరే దేహంలోకి మారు అంశం


*అతిధిలా దేహంలో వుంది*

*ప్రాణంలా దేహంలో వుంది*

*జీవంలా  జీవులలో వుంది*


గ్రహాలు తారలు తారలరాశులు 

పద్దతి చక్రం లో అవి తిరుగును

వాటిని తిప్పేశక్తే  పరమాత్మ శక్తి

విశ్వం అంతటా  పరమాత్మ శక్తి 


*అంతా జననమరణ చక్రం*

*వీడాలి జననమరణ చక్రం*


*మనసుతో తెలుసుకోవాలి*

*ఆత్మ ఉనికి తెలుసుకోవాలి* 

*నీలో దైవాంశం అతిసూక్ష్మం*


*నది యేరు మేఘం తటాకం*

*రూపాలు అనేకం నీరు ఏకం*

*జీవాలు అనేకం ఆత్మ ఏకం*

  

*పురం  నివాస ప్రాంతం* 

*పురం పురుష నివాసం* 

*దేహం ఆత్మ   నివాసం*

*ఆత్మ నిత్యం  సత్యం*  

*జీవులలోని దైవాంశం*


*దేహం వీడిన తరువాత*

*అది చేసిన మంచి ధర్మం*

*తెలిసిన విజ్ఞాన సారం*

*అవే దేహం అవకాశం*

*అలా దేహం పొందును*

*గుణం భావం పొందును*


*ఆత్మ  అలా వుంటుంది*

*ఆత్మ  ఇలా వుంటుంది*

*అని  తెలుపుట కష్టము*

*ఆత్మ  అంతాటా వుంది*

*ఆత్మను సాక్షిగా చూడాలి*

*ఆత్మ అనుభవం కలగాలి*

*ఆ బ్రహ్మానందం పొందాలి* 

*కఠినంగా సాధన చేయాలి*

*నీవుగా ఆత్మను చుాడాలి* 

*ఆ సాక్షాత్కారం పొందాలి*


*నీకు విజయము కలుగును* 

*అని నచికేతుని దీవించెను*


*యముని బోధన  వినెను*

*నచికేతుడు ఆచరించెను*

*జ్ఞానంతో సాధన చేసెను* 

*తనలోఆత్మను చూసెను*

*బ్రహ్మానందం  పొందెను*

  నా బ్లాగ్ స్పాట్ చూడండి

syamalaraossss.blogspot.com

*సర్వం శ్రీకృష్ణార్పణం*

🙏🙏🙏🙏🙏🙏🙏

26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఆదిత్య హృదయం+భావ గానం పార్ట్ 3 ( శ్లోకాలు 21- end )

 ఆదిత్య హృదయం+భావ గానం

పార్ట్ 3 ( శ్లోకాలు 21- end )


బంగారు   ప్రకాశాయ 

అగ్నిం విశ్వకారణాయ

నమస్తే  చలి నాశాయ

లోకాలసాక్షి సత్యాయ  

*తప్త చామీకరాభాయ*

*వహ్నయే విశ్వకర్మణే |*

*నమస్తమోఽభి నిఘ్నాయ*

*రుచయే లోకసాక్షిణే ‖ 21 ‖*


జీవుల జనన కారణం

జీవుల నాశన కారణం

ఎండా వానల  దైవం

వేడి  చలనాల దైవం

*నాశయత్యేష వై భూతం*

*తదేవ సృజతి ప్రభుః |*

*పాయత్యేష తపత్యేష*

*వర్షత్యేష గభస్తిభిః ‖ 22 ‖*


నిదురలో జాగర్త దైవం

అన్ని  జీవులలో  దైవం

అతడే యాగాగ్ని దైవం

అతడే యాగఫల దైవం

*ఏష సుప్తేషు జాగర్తి*

*భూతేషు పరినిష్ఠితః |*

*ఏష ఏవాగ్నిహోత్రం చ*

*ఫలం చైవాగ్ని హోత్రిణాం‖ 23 ‖*


వేదాలకు  యాగాలకు 

మరి యాగ  ఫలాలకు 

సర్వ లోకాల పనులకు

సర్వ లోకాల  ప్రభువు

*వేదాశ్చ క్రతవశ్చైవ*

*క్రతూనాం ఫలమేవ చ |*

*యాని కృత్యాని లోకేషు*

*సర్వ ఏష రవిః ప్రభుః ‖ 24 ‖*


పారాయణ ఫలం:

ఆపదలో అడవిలో  కష్ఠంలో 

ఆదిత్య హృదయం చదివిన

ఆపదలు భయం తొలగును

రాఘవా  సుఖం  కలుగును

*ఫలశ్రుతిః*

*ఏన మాపత్సు కృచ్ఛ్రేషు*

*కాంతారేషు భయేషు చ |*

*కీర్తయన్ పురుషః కశ్చిన్*

*నావశీదతి రాఘవ ‖ 25 ‖*


ఇలా శ్రధ్ధగా పూజించుము

దేవ దేవుని  లోకాలపతిని

ఇది 3 సార్లు  చదువుము

పోరులో జయం కలుగును

*పూజయస్వైన మేకాగ్రో*

 *దేవదేవం జగత్పతిం|*

*ఏతత్ త్రిగుణితం జప్త్వా*

 *యుద్ధేషు విజయిష్యసి ‖ 26 ‖*


ఇక ఇప్పుడే మహావీరా

రావణుని వధించెదవు

అని పలికి అగష్యుడు

అచట నుండి వెడలెను

*అస్మిన్ క్షణే మహాబాహో*

*రావణం త్వం వధిష్యసి |*

*ఏవముక్త్వా తదాగస్త్యో*

*జగామ చ యథాగతం‖ 27 ‖*


రాముడు అంతా వినెను 

మనసులో భాద వీడెను

సూర్యుని   ధ్యానించెను

రవిని ఇష్టంగా తలచెను

*ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః*

*నష్టశోకోఽభవత్ - తదా |*

*ధారయామాస సుప్రీతో*

*రాఘవః ప్రయతాత్మవాన్‖28‖*


శుచిగా 3ఆచమనాలు చేసెను

ఆదిత్యుని చూసి జపించెను

అమిత ఆనందం  పొందెను

విల్లు బాణాలు చేత పట్టెను

*ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు*

 *పరం హర్షమవాప్తవాన్ |*

*త్రిరాచమ్య శుచిర్భూత్వా*

*ధనురాదాయ వీర్యవాన్ ‖ 29 ‖*


రాముడు రావణుని చూసెను  

యుద్ధ  ఉత్సాహం   చూపెను  

అన్నివిధాల రావణ మరణం

అదే రాముని దృఢ నిశ్చయం

*రావణం ప్రేక్ష్య హృష్టాత్మా*

*యుద్ధాయ సముపాగమత్ |*

*సర్వయత్నేన మహతా వధే*

*తస్య ధృతోఽభవత్ ‖ 30 ‖*


 రాముడు  రవిని తలచెను  

 ఆదిత్యుడు ఆనందించెను

 రావణుడు మరణించును

 అని దేవతలతో పలికెను 

 

*అధ రవిరవదన్*

*నిరీక్ష్య రామం*

*ముదితమనాః పరమం*

 *ప్రహృష్యమాణః |*

*నిశిచరపతి సంక్షయం విదిత్వా*

*సురగణ మధ్యగతో వచస్త్వరేతి* ‖31‖


ఇది శ్రీరామాయణ కావ్యం

వాల్మీకి రాసిన ఆదికావ్యం

యుద్ధకాండ 107వ బాగం

*ఇత్యార్షే శ్రీమద్రామాయణే*

*వాల్మికీయే ఆదికావ్యే*

*యుద్దకాండే సప్తోత్తర*

*శతతమః సర్గః ‖*

భావ గానం రచన:

శ్యామలరావు ssss

అంతా దేవునికి సమర్పణం

🙏🙏🙏🙏🙏🙏

14, ఫిబ్రవరి 2021, ఆదివారం


 సరళంగా సులభంగా

భక్తి స్తోత్రం +  భావ గానం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*శ్రీ భవానీ అష్టకం*+ భావ గానం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 అష్టకం మూల రచన :

*శ్రీఆదిశంకరాచార్యులు*

సరళ భావ గానం రచన:

శ్యామలరావు s.s.s.s.


*1.* 

*న తాతో న మాతా న బంధు ర్నదాతా*

లేరు తాతా మాతా బంధువు దాతా    

*న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా !*

లేరు పుత్రులు కూతుర్లు  సేవకులు భర్తా  

*న జాయా న విద్యా న వృత్తిర్మమైవ*

 నాకు విద్యా  వృత్తీ ఏదీ  తెలియదు  

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని !!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*2.* 

*భవాబ్ధావపారే మహాదుఃఖభీరు*

 లోకాల లభించు మహా బాధలు భయాలు

*పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః !*

 కామం లోభం మత్తులు పొందేను

*కుసంసారపాశ ప్రబద్ధః సదాహం*

నేను సదా సంసార పాశాల బంధీని

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని !!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*3.*

*న జానామి దానం న చ ధ్యాన యోగం*

 తెలియదు  దానం ధ్యానం యోగం 

*న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్ !*

తెలియదు తంత్రం స్తోత్రం మంత్రం

*న జానామి పూజాం నచ న్యాసయోగం*

తెలియదు పూజా యాగం యోగం

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*4.*

*న జానామి పుణ్యం న జానామి తీర్థం* 

తెలియదు పుణ్యం తెలియదు తీర్థం

 *న జానామి ముక్తిం లయం వా కదాచిత్!*

తెలియదు ముక్తి లయం  మోక్ష భావం 

*న జానామి భక్తిం వ్రతం వాపి మాతః*

 తెలియదు భక్తి నోము వ్రతం మాతా

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*5.*

*కుకర్మీ కుసఙ్గీ కుబుద్ధిః కుదాసః*

చెడుపనుల సంగాలు చెడుబుద్ధుల  సేవలు

*కులాచారహీనః కదాచారలీనః!*

 కులాచార హీనం దురాచారలీనం 

*కుదృష్టిః కువాక్య ప్రబంధః సదాహం*

చెడుచూపులు  మాటలె నా గుణాలు

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*6.*

*ప్రజేశం రమేశం మహేశం సురేశం*

బ్రహ్మ విష్ణుం మహేశ్వరం ఇంద్రం 

*దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ !*

సూర్యం  చంద్రం ఎందరో దేవతాం

*న జానామి చాన్యత్ సదాహం శరణ్యే* 

 ఎరుగను నాకు తెలియరు నీవే శరణం

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*7.*

*వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే*

వివాద విషాద ప్రమాద  ప్రవాసాలు

*జలే చా నలే పర్వతే శత్రుమధ్యే !*

నీరు నిప్పు కొండలు శత్రువులమధ్య  

*అరణ్యే  సదా మాం ప్రపాహి*

 అడవులలో నీవే శరణం పాహిమాం

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*8.*

*అనాథో దరిద్రో జరారోగయుక్తో*

అనాధ బీదను పోయేకాలం రోగిని  

*మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః !*

క్షీణించాను రోగాలువీడని  దీనను 

*విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం*

విపత్తులు కష్టాలు నష్టాలు పడ్డాను

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


( అమ్మ వారి నామాలు స్తోత్రం)

*అంబా శాంభవీ చంద్రమౌళిరబలా  అపర్ణా ఉమా పార్వతీ*

*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ*

*సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ!!*


*॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం*

 *భవాన్యష్టకం సంపూర్ణమ్ ॥*

ఇది శ్రీ శంకరాచార్య రచనం

భవాని అష్టకం సంపూర్ణం

*ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి పాహిమాం*

*ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి రక్షమాం*


సర్వం భగవదర్పణం