9, అక్టోబర్ 2018, మంగళవారం

రుద్ర రక్షా కవచం భావగానం

*రుద్ర  రక్షా కవచం*
 శివుడే మనకు రక్ష గా నిలిచేందుకు  ఋషి దుర్వాసుడు తెలిపింది.

భావం :
దుర్వాస ముని పలికెను
1.
 శిరసా వందనం దైవం
స్వయం పరమేశ్వరం
ఒకరే  పురాతన దైవం
సకల  దేవతల   దైవం

వేదం:
*దుర్వాస ఉవాచ:-*
1.
*ప్రణమ్యామి శిరసా దేవం*
*స్వయంభుం పరమేశ్వరం.*
*ఏకం సర్వ గతం దేవం*
*సర్వ దేవ మయం విభుం.*

2. భావం:
పలికేను  రుద్ర   కవచం
అంగప్రాణ రక్షా  కవచం
పగలురాత్రి దైవ కవచం
రోజంతా దేవుని కవచం
అతిపూర్వ రక్షా కవచం
2.
*రుద్ర వర్మ ప్రవక్షామి*
*అంగ ప్రాణస్య రక్షయే.*
*అహో రాత్ర మయం దేవం*
 *రక్షార్థం నిర్మితం పురా.*

3.భావం:
ముందుండి  రుద్రుడు     రక్షించు గాక
ముఖము    మహేశుడు రక్షించు గాక
నా తలను ఈశ్వరుడు   రక్షించు గాక
నుదురు నీలలోహితుడు రక్షించు గాక

3.
*రుద్రో మే చాగ్రతఃపాతు*
*ముఖంపాతుమహేశ్వరః*
*శిరోమే యీశ్వరఃపాతు*
 *లలాటం నీలలోహితః*

4.భావం:
కనులను ముక్కంటి  రక్షించు గాక
ముఖం  మహేశుడు  రక్షించు గాక
చెవులు శంకరుడు    రక్షించు గాక
ముక్కు సదాశివుడు రక్షించు గాక

4.
*నేత్రయోస్త్రయంబకః పాతు*
*ముఖంపాతు  మహేశ్వరః*
*కర్ణయోః పాతుమే*
*శంభుర్నాసికాయాం సదాశివః.*

5.భావం:
నా నాలుకను వాగీశుడు రక్షించు గాక
నా పెదాలు అంబికాపతి రక్షించు గాక
నా కంఠం   నీలకంఠుడు  రక్షించు గాక
నా భుజాలు పినాకపాణి రక్షించు గాక
5.
*వాగీశః పాతు మే జిహ్వా*
 *మోష్ఠా పాతంబికాపతిః*
*శ్రీ కంఠః పాతు మే గ్రీవాం*
*బాహూంశ్చైవ పినాక ధృత్.*

రుద్ర రక్షా కవచం సంపూర్ణం

భావగానం:
Syamalaraossss.blogspot.com

*రుద్ర రక్షా కవచం

*రుద్ర  రక్షా కవచం*
 శివుడే మనకు రక్ష గా నిలిచేందుకు  ఋషి దుర్వాసుడు తెలిపింది.

భావం :
దుర్వాస ముని పలికెను
1.
 శిరసా వందనం దైవం
స్వయం పరమేశ్వరం
ఒకరే  పురాతన దైవం
సకల  దేవతల   దైవం

వేదం:
*దుర్వాస ఉవాచ:-*
1.
*ప్రణమ్యామి శిరసా దేవం*
*స్వయంభుం పరమేశ్వరం.*
*ఏకం సర్వ గతం దేవం*
*సర్వ దేవ మయం విభుం.*

2. భావం:
పలికేను  రుద్ర   కవచం
అంగప్రాణ రక్షా  కవచం
పగలురాత్రి దైవ కవచం
రోజంతా దేవుని కవచం
అతిపూర్వ రక్షా కవచం
2.
*రుద్ర వర్మ ప్రవక్షామి*
*అంగ ప్రాణస్య రక్షయే.*
*అహో రాత్ర మయం దేవం*
 *రక్షార్థం నిర్మితం పురా.*

3.భావం:
ముందుండి  రుద్రుడు     రక్షించు గాక
ముఖము    మహేశుడు రక్షించు గాక
నా తలను ఈశ్వరుడు   రక్షించు గాక
నుదురు నీలలోహితుడు రక్షించు గాక

3.
*రుద్రో మే చాగ్రతఃపాతు*
*ముఖంపాతుమహేశ్వరః*
*శిరోమే యీశ్వరఃపాతు*
 *లలాటం నీలలోహితః*

4.భావం:
కనులను ముక్కంటి  రక్షించు గాక
ముఖం  మహేశుడు  రక్షించు గాక
చెవులు శంకరుడు    రక్షించు గాక
ముక్కు సదాశివుడు రక్షించు గాక

4.
*నేత్రయోస్త్రయంబకః పాతు*
*ముఖంపాతు  మహేశ్వరః*
*కర్ణయోః పాతుమే*
*శంభుర్నాసికాయాం సదాశివః.*

5.భావం:
నా నాలుకను వాగీశుడు రక్షించు గాక
నా పెదాలు అంబికాపతి రక్షించు గాక
నా కంఠం   నీలకంఠుడు  రక్షించు గాక
నా భుజాలు పినాకపాణి రక్షించు గాక
5.
*వాగీశః పాతు మే జిహ్వా*
 *మోష్ఠా పాతంబికాపతిః*
*శ్రీ కంఠః పాతు మే గ్రీవాం*
*బాహూంశ్చైవ పినాక ధృత్.*

రుద్ర రక్షా కవచం సంపూర్ణం

భావగానం:
Syamalaraossss.blogspot.com

6, అక్టోబర్ 2018, శనివారం

శ్రీమహాలక్ష్మి స్త్రోత్రమ్ భావ గానం

🙏🙏🙏🙏🙏🙏🙏
*శ్రీమహాలక్ష్మి స్త్రోత్రమ్*
🙏🙏🙏🙏🙏🙏🙏

*సందర్భం*:
లక్ష్మీ దేవి పాల సముద్రం నుండి ఉద్భవించినపుడు
దేవేంద్రుడు  స్తుతించినది

*వారం తిది*
శుక్రవారం పంచమి

*మూలం*
దేవీభాగవతం-9 స్కందము

1)
*నమః కమల వాసిన్యై*
నమస్తే కమల వాసిని
*నారాయణ్యై నమోనమః*
నారాయణి నమస్తే నమస్తే
*కృష్ణ ప్రియాయై సతత౦*
ఎల్లవేళలా కృష్ణ ప్రియవు
 *మహాలక్ష్మ్యై నమోనమః!!*
మహాలక్ష్మి నమస్తే నమస్తే

2)
 *పద్మ పత్రేక్షణాయై చ*
పద్మ పత్రాల కనుల దేవి *పద్మాస్యాయైనమోనమః*
పద్మ రూపా నమస్తే నమస్తే
*పద్మాసనాయై పద్మిన్యై*
పద్మ ఆసనము  పద్మిని
*వైష్ణవ్యై చ నమోనమః!!*
వైష్ణవి దేవి నమస్తే నమస్తే

3)
 *సర్వస౦పత్స్వరూపిణ్యై*
సకల సంపదల రూపుణి
*సర్వారాధ్యాయై నమోనమః*
అందరు ఆరాదించుదేవి
నమస్తే నమస్తే
*హరిభక్తి ప్రదాత్ర్యై చ*
హరి భక్తి  కలిగించు దేవి
 *హర్షదాత్ర్యై చనమోనమః*
ఆనందం కలిగించుదేవి
నమస్తే నమస్తే
*కృష్ణ వక్షఃస్థితాయై చ*
కృష్ణ హృదయ వాసిని
 *కృష్ణేశాయై నమోనమః*
కృష్ణ హృదయేశ దేవి నమస్తే నమస్తే
*చ౦ద్రశోభా స్వరూపాయై*
చంద్ర శోభల స్వరూపిణి
 *రత్నపద్మే చ శోభనే!!*
రత్న పద్మాల శోభిని

4)
*స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై*
సంపదల అధికారిణి దేవి
 *మహాదేవ్యై నమోనమః*
మహాలక్ష్మి నమస్తే నమస్తే
*నమో బుద్ధిస్వరూపాయై*
బుద్ధి రూప దేవి
*బుద్ధిదాయ్యై నమోనమః!!*
బుద్ధినీయు దేవి నమస్తే నమస్తే
*యథామాతా స్తనా౦ధానా౦*
అమ్మలా పాలిచ్చి పెంచేవు
*శిశూనా౦ శైశవే సదా*
పసిబిడ్డలా సదా పోషించేవు
*తథా త్వ౦ సర్వదా మాతా*
అలా నీవే అన్ని వేళలా అమ్మా
*సర్వేషా౦ సర్వరూపతః!!*
అన్ని విధాల అన్ని రూపాల మాతవు
శ్రీమహాలక్ష్మి నమస్తే  నమస్తే

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ మహాలక్ష్మికి సమర్పణం
భావగాన రచన
శ్యామలరావుssss
🙏🙏🙏🙏🙏🙏🙏

సృష్టి సూక్తం

[19/07, 21:50] Syamala Rao SSSS: Rough draft pl don't post
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
       *సృష్టి సూక్తం*
 *(నాసదీయ సూక్తం)*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
(ఋగ్వేదం 10 వ మండలం 129 వ సూక్తం)
         
*నాసదాసీన్నోసదాసీత్తదానీం*
 *నాసీద్రజో నో వ్యోమాపరో యత్ ।*
*కిమావరీవః కుహకస్య శర్మన్నంభః*
 *కిమాసీద్గహనం గభీరం* 1

అపుడు ఏమిలేదు అసలేదీలేదు
గాలి,లోకం, పైలోకాలేవి లేవు
అంతరిక్ష నీరేది  ఎక్కడుందది
ఏది కప్పింది ఎంత లోతునుంది

*న మృత్యురా॑సీద॒మృతం॒ న తర్హి॒ న రాత్ర్యా॒।*
*ఆహ్న॑ఆఅసీత్ప్రకే॒తః ఆనీదవాతం స్వధయా*
*తదేకం తస్మాద్ధాన్యన్నపరః కిఞ్చనాస 2*

చావులేదు అమృతం లేదు
కాంతి లేదు పగలు లేదు
అంతా చీకటే  నిండివుంది
అంతా గాలిలేని ఊపిరి అది
అంతా చీకటి మరేదీ లేదు

*తమ॑।ఆఅసీ॒త్తమ॑సాగూ॒హ్ళమగ్రే॑*
*ప్రకే॒తం స॑లి॒లం సర్వ॑మాఽఇ॒దం ।*
*తుచ్ఛ్యేనాభ్వపిహితం*
*యదాసీత్తపసస్తన్మహినా జాయతైకం ౩*

అందులోనుండి వచ్చింది
వేడి వెచ్చదనం వచ్చింది
ఆది కోరిక వచ్చి చేరింది
ఆది విత్తనమది అయింది

*కామ॒స్తదగ్రే॒ సమ॑వర్త॒తాధి*
*మన॑సో॒ రేతః॑ ప్రథ॒మం యదాసీ॑త్ ।*
*సతోబన్ధుమసతి నిరవిన్దన్హృది౬*
*ప్రతీష్యా కవయో మనీషా 4*

 కోరిక పైకి లేచి చుట్టిముట్టింది
మొదటి మనసు వచ్చి చేరింది
ఋషులు మది నిలిపి వెతికిరి
బొడ్డు బంధమేది ఏది కాదని
తెలివి జ్ఞానము వాడి చూసిరి

*తి॒ర॒శ్చీనో॒ విత॑తో ర॒శ్మిరే॑షామ॒ధః*
*స్వి॑దా॒సీ౩ దు॒పరి॑స్విదాసీ ౩త్।*
*రేతోధా।ఆఅసన్మహిమాన।ఆఅసన్త్స్వధా।*
*ఆవస్తాత్ ప్రయతిః పరస్తాత్ 5*

ఖాళీల నుండి బొడ్డుతాడు పట్టిరి
చిన్న శక్తిరూప దేవతలను తెలిసిరి
ఏది పైది ఏది కింద లోకం తెలిసిరి
పైశక్తిపాతం చేసెను లోకాలు సారం

*కో।ఆ॒ద్ధా వే॑ద॒ కఽఇ॒హ ప్రవో॑చ॒త్ కుత॒।*
*ఆఅజా॑తా॒ కుత॑ఽఇ॒యం విసృ॑ష్టిః ।*
*అర్వాగ్దేవా।ఆస్య విసర్జనేనాథాకో*
*వేద యత।ఆఅబభూవ 6*

ఎవరికి తెలుసు ఎవరు చెప్పగలరు
ఇదంతా ఎప్పుడు  వచ్చిందో
ఈ సృష్టంతా ఎలా జరిగిందో
దేవతలే సృష్టి తరువాత వారు
అందుచే నిజం వారికి తెలుసా
 సృష్టి కి మొదలు ఎప్పుడో

*ఇ॒యం విసృ॑ష్టి॒ర్యత॑।ఆఅబ॒భూవ॑*
*యది॑ వా ద॒ధే యది॑ వా॒ న ।*
*యో।ఆస్యాధ్యక్షః పరమే వ్యోమన్త్సో।*
*ఆంగ వేద యది వా న వేద 7*

ఎప్పుడు సృష్టి  ఆరంభమైనదో
తన సృష్టి తీరు ఇదే నని ఆ
దేవునకు తెలుసో తెలియదో
ఎంతో ఎత్తునుంది దేవలోకము
అచట నుండి చూసేను దైవము
దేవునకు తెలుసో తెలియదో

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భావగానం రచన:
S S S S  Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[30/07, 06:03] Syamala Rao SSSS: భగవద్గీత భావగానం
 సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *గుణత్రయ విభాగ యోగం*
 భగవద్గీత 14- 9 to 13

శ్లో9.
సత్వగుణము సుఖము నందు
రజో  గుణము  కర్మల    నందు
తమోగుణము  అజ్ఞానమందు
మురిపించి ఆపదల నుంచును

10శ్లో.
రజో , తమోలు తగ్గిన
సత్వగుణము పెరుగును
సత్వ , తమోలు తగ్గిన
రజోగుణము పెరుగును
సత్వ , రజోలు   తగ్గిన
తమోగుణము పెరుగును

11,12&13 శ్లో.
సత్వాన దేహం ప్రకాశించును
జ్ఞాన ప్రకాశము కనిపించును
రజో గుణాన లోభముండును
పని తపన అశాంతి ఉండును
తమోగుణాన బద్ధకముండును
అజ్ఞానము మోహముండును

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 రచన:
S S S S  Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అన్నపూర్ణాస్తు తీ

[28/09, 17:54] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *తిః*
  *భావ గానం* 1/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*నిత్యానందకరీ*
 *వరాభయకరీ*
 *సౌన్దర్యరత్నాకరీ*
*నిర్ధూతాఖిల*
*ఘొరపాపనికరీ*
*ప్రత్యక్షమాహేశ్వరీ|*

*ప్రాలేయాచల*
*వంశపావనకరీ*
*కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
*కృపావలమ్బనకరీ*
 *మాతాన్నపూర్ణేశ్వరీ* 1

నిత్య ఆనంద దాయిని
వర అభయ ప్రసాదిని
సౌందర్య   రూపిని
సకల పాప నాశిని
హిమాచల  పుత్రికా
హిమవంశ  పావని
కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
[28/09, 17:54] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 2/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*నానారత్నవిచిత్ర*
*భూషణకరీ*
*హేమామ్బరాడమ్బరీ*
*ముక్తాహారవిడమ్బమాన*
*విలసద్వక్షొజకుమ్భాన్తరీ*
*కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా*
*కాశీ పురాధీశ్వరి*
*భిక్షాం దేహి*
 *కృపావలమ్బనకరీ*
*మాతాన్నపూర్ణేశ్వరీ* 2


వివిధ రత్నాల నగల దేవి
బంగారుచీరలు కట్టిన దేవి 
ముత్యాల హారాల దేవి 
కుంకుమ బొట్టు మోము
అగురు వాసన శరీరము
కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా అన్నపూర్ణేశ్వరి
🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 17:54] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 3/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog


*యొగానన్దకరీ*
*రిపుక్షయకరీ*
 *ధర్మైకనిష్ఠాకరీ*
*చన్ద్రార్కానలభాసమాన*
*లహరీ త్రైలొక్య రక్షాకరీ*
*సర్వైశ్వర్యకరీ*
 *తపఃఫలకరీ*
*కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
*కృపావలమ్బనకరీ*
*మాతాన్నపూర్ణేశ్వరీ* ౩

యోగానందదాయిని
శత్రు వినాశన దేవి
ధర్మమార్గ రూపిణీ
చంద్ర సూర్య అగ్ని
సమాన ప్రకాశిని
మూడులోకాల రక్షిని
సకల సంపదల దాయిని
తపోఫల ఫలదాయిని
కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా  అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 18:01] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 4/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog
*కైలాసాచల*
*కన్దరాలయకరీ*
*గౌరీ ఉమా శాంకరీ*
*కౌమారీ నిగమార్థ*
*గోచకరి*
*హ్యొంకారబీజాక్షరీ*
*మొక్షద్వారకవాట*
*పాటనకరీ*
*కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
*కృపావలమ్బనకరీ*
*మాతాన్నపూర్ణేశ్వరీ* 4

కైలాసగిరి గుహ నివాసిని
ప్రకాశ శరీరకాంతుల దేవి
శంకరసతీ ఉమాకుమారి
వేదఅర్థాలు భోదించుదేవి 
ఓంకార బీజాక్షర రూపిణీ 
ముక్తి తలుపుతీయు దేవి

కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా  అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 18:01] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 5/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*దృశ్యాదృశ్య*
*విభూతివాహనకరీ*
*బ్రహ్మాణ్డభాణ్డొదరీ*
*లీలానాటక*
 *సూత్రఖేలనకరీ*
 *విజ్ఞాన దేపాంకరి*
*శ్రీవిశ్వేశమనః*
 *ప్రసాదనకరీ*
 *కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
 *కృపావలమ్బనకరీ*
 *మాతాన్నపూర్ణేశ్వరీ* 5

కనిపించు కనిపించని
మహిమలుచూపు దేవి
కడుపులో బ్రహ్మాండాలు
మోయుచున్న మాతా
లీలానాటక సూత్రధారి
విజ్ఞాన దీప దాయిని
పరమశివ ఆనందిని

కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా  అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 18:07] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 6/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*ఆదిక్షాన్తసమస్త*
*వర్ణనికరీ*
*శంభుప్రియా శాంకరీ*
*కాశ్మీరత్రిపురేశ్వరీ*
 *త్రినయనీ*
 *విశ్వేశ్వరీ శర్వరీ*
*స్వర్గద్వారకవాట*
*పాటనకరీ*
*కాశీపురాదీశ్వరీ*
*భిక్షాం దేహి*
 *కృపావలమ్బనకరీ*
 *మాతాన్నపూర్ణేశ్వరీ* 6

’అ’ నుండి ’క్ష’  వరకు
అన్ని అక్షరాలరూపిణి 
పరమేశ్వర  ప్రియదేవి
శంకరసతి కాశ్మీరదేవి
స్వర్గం తలుపుల తీసే
 త్రిపురేశ్వరి త్రిలోచని

కాశీ నగరానికి రాణి
 దయామయి మాతా
 అన్నపూర్ణేశ్వరి  మాకు
నీవు భిక్షం వేయుము

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 18:08] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 7/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*ఉర్వీసర్వజనేశ్వరీ*
*జయకరీ*
 *మాతాకృపాసాగరీ*
*నారీనీలసమాన*
*కున్తలధరీ*
 *నిత్యాన్నదానేశ్వరీ*
*సాక్షాన్మొక్షకరీ సదా*
*శుభకరీ*
 *కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
 *కృపావలమ్బనకరీ*
*మాతాన్నపూర్ణేశ్వరీ* 7

భూలోక జన నాయకి
 విజయమీయు తల్లి
దయా సాగర  దేవి
నీలాల కురుల దేవి
నిత్య అన్నదానదేవి
 నీవే మోక్ష దాయిని
 సకల శుభ దాయిని

కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా  అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 18:14] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 8 /11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*దేవీసర్వవిచిత్రరత్న*
 *రుచిరా దాక్షాయణీ*
*సుందరీ వామా*
*స్వాదుపయొధరా*
*ప్రియకరీ*
*సౌభాగ్యమాహేశ్వరీ*
*భక్తాభీష్టకరీ*
*సదా శుభకరీ*
*కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
*కృపావలమ్బనకరీ*
 *మాతాన్నపూర్ణేశ్వరీ* 8

సర్వ రత్నాల శోభితా
శాంకరీ దక్ష పుత్రికా
సుందరి యువదేవి
సౌభాగ్య పరమేశ్వరి
 భక్త ప్రియ దాయిని
సదా శుభం చేసే దేవి

కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా  అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 19:29] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 9/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog
*చన్ద్రార్కానల*
*కోటికోటిసదృశీ*
 *చన్ద్రాంశు బింబాధరీ*
*చన్ద్రార్కాగ్ని*
*సమానకుణ్డలధరీ*
 *చన్ద్రార్కవర్ణేశ్వరీ*
*మాలాపుస్తక*
*పాశసాఙ్కుశకరీ*
*కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
*కృపావలమ్బనకరీ*
 *మాతాన్నపూర్ణేశ్వరీ* 9

కోటి కోట్ల చంద్రులు
సూర్యులు అగ్నుల
ప్రకాశముల మాతా
చంద్ర అంశ ధారిని
చంద్రుని వెలుగుల
ఎర్రని పెదాల దేవి
సూర్యచంద్ర ప్రకాశాలు
నీ చెవి  కుండలాలు
మాల పుస్తకం పాశం
 అంకుశం గల చేతులు
సూర్యచంద్రుల రంగులో
నీ శరీరం ప్రకాశీంచేను

కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా  అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 19:44] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 10/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*క్షత్రత్రాణకరీ*
*మహాభయహరీ*
*మాతా కృపాసాగరీ*
*సర్వానన్దకరీ*
 *సదా శివకరీ*
 *విశ్వేశ్వరీ శ్రీధరీ*
*దక్షాక్రందకరీ*
 *నిరామయకరీ*
*కాశీపురాధీశ్వరీ*
*భిక్షాం దేహి*
*కృపావలమ్బనకరీ*
*మాతాన్నపూర్ణేశ్వరీ* 10

వీరులను రక్షించు దేవి
మహా భయనాశ  దేవి
 దయా సముద్ర  దేవి 
 విశ్వమునకు రాణిి
సంతోషముల దేవి
దక్షునికి దుఃఖమైతివి 
అందరికీ సుఖదాయిని
ఆనంద శుభదాయిని

కాశీ నగర ఈశ్వరి 
మాతా దయామయి
మాకు భిక్షం వేయమ్మ
మాతా  అన్నపూర్ణేశ్వరి

🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం
[28/09, 19:47] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
  *అన్నపూర్ణాస్తుతిః*
  *భావ గానం* 11/11
🙏🙏🙏🙏🙏🙏🙏
సంస్కృతమూలం:
 శ్రీ ఆది శంకరాచర్యులు
తెలుగు భావగానం:
Syamalaraossss.blog

*అన్నపూర్ణే సదాపూర్ణే*
 *శంకరప్రాణవల్లభే*
*జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం*
*భిక్షాం దేహి చ పార్వతి*
11

ఓ అన్నపూర్ణ మాతా
నిండుగావుండు మాతా
శంకర  ప్రాణ వల్లభా
జ్ఞాన వైరాగ్యా లను
భిక్ష మేయమ్మ పార్వతి

*మాతా చ పార్వతీ దేవి*
*పితా దేవొ మహేశ్వరః*
*బాన్ధవాః శివభక్తాశ్చ*
 *స్వదేశొ భువనత్రయమ్*

అమ్మ పార్వతీ దేవి
నాన్న పరమశివుడు
 బంధువులు శివభక్తులు
 త్రిలోకాలు మాదేశము
🙏🙏🙏🙏🙏🙏🙏
అంతా అన్నపూర్ణార్పణం

భజ గోవిందం భావ గానం revised

[06/10, 04:37] Syamala Rao SSSS: *భజగోవిందం భావ గానం.*  శ్లో.1-15

1
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుకృణ్ కరణే

భావం: 
భజగోవిందం గోవిందభజన
గోవిందభజన చేయిమూడా
తుదికాలం దరి వ్యాకరణం 
 నిను  రక్షించదు రక్షించదు

2
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం  తేన వినోదయ చిత్తం

భావం:
బుద్ధిహీనా ధనాశ పనులేల
మంచిబుద్ధితో మేలు చేయి
ఆ నిజపనుల  ఫలితాలను
మనసుతో  వినోదించుము

3
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా  మాగామోహావేశం
ఏతన్మామ్సావసాది వికారం
మనసి విచంతయ వారం వారం

భావం:
పాలిండ్ల నాభి ప్రాంతం
చూసి పొందేవు మోహం
కామమే వికారమోయి
అవి రక్త మాంసాలోయి
గుర్తుంచుకో రోజు రోజు

4.
నళినీ దలగత జలమతి తరలం
తద్వాజ్జీవితమతిశయచపలం 
విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం

భావం:
తామరాకుపై నీటి చుక్కలు
అందములన్నీ క్షణికములు
కామమే రోగ బాధలిచ్చును
నీ లోకమంతా శోకమవును

5.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే

భావం:
అందరికీ ధనార్జన పై ఆసక్తి
రక్తబందువులకి అదే ఆసక్తి
నీ ధనార్జన  పోయినపుడు
నీపైన వారి ఆసక్తి పోవును

6.
యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే

భావం:
ఊపిరాడు నాడు చూసి
 అందరు కుశలం అడిగేరు
ఊపిరాడని నాడు చూసి
అందరు భార్యా భయపడేరు

7.
బాలాస్తావతీ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః

భావం:
బాల్యమంతా ఆటల ఆసక్తి
వయసంతా కాంతల ఆసక్తి
ముదిమంతా  చింతలోయి
దేవునిపై ఆసక్తి ఎపుడోయి

8.
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః

భావం:
 ఏది భార్య ఎవరు సంతానం
ఈ సంసారం చాల విచిత్రం
ఏది నీవు ఎక్కడ నీ లోకం
నిన్ను నీవు  తెలియవోయి

9.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి:

భావం:

 సత్సంగం పెంచును దైవ బంధము
మోహం పెంచును లోక బంధము
 మోహం పోయిన చంచలం పోవును
చంచలం పోయిన ముక్తి కలుగును

10.
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః

భావం:
ముసలి తనాన కామం వుండదు
నీరు ఎండిన చెరువు వుండదు
ధనం తరిగిన జనం
వుండరు
జ్ఞానం తెలిసిన బంధం
వుండదు

11.
మా కురు ధన జన యవ్వన గర్వం 
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా 

భావం:
 ధన జన వయసు గర్వాలు
వలదు పోవునవి క్షణికాలు
ఇది అంతా మాయాలోకం
నీవు  బ్రహ్మలోకం  చేరాలి

12.
దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతవ్ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః 
తదపి న ముంచత్యాశావాయుః

భావం:
ఎండా వానల కాల చక్రమిది
కాలములన్ని వచ్చి పోవునవి
కాలంతో వయసు పెరుగును
కాలంతో ఆయువు తరుగును

13.
కాతే కాంతా ధనగతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగాతిరేకా
భవతి భవార్ణవతరణే 

భావం:
కాంతా కనకాల కై ఆశలేల
బాధలు కష్టాలు నీకు ఏల
మూడు లోకాలు దాటాలి
సత్సంగమే దాటించును

14.
జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః

భావం:
గడ్డాలు మీసాలు వుండినా
సన్యాసి బట్టలు ధరించినా
తెలిసీ పట్టించు కోని వారే
వట్టి పగటి వేషాల వారు

15.
అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం

భావం:
ముసలై శరీరం కుంగును
పళ్ళు జుట్టూ   వూడును
కర్రే నడవ సాయమవును
జీవుడా నీకు ఏల ఆశలు
[06/10, 04:37] Syamala Rao SSSS: *భజగోవిందం*
 *భావ గానం 16-33*
మూలం: ఆదిశంకరులు
తెలుగు:శ్యామలరావుssss

శ్లో:16
అగ్రే వహ్నిః పృష్ఠేభానుః
రాత్రౌ చుబుకసమర్పితజానుః
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాసః

భావం:
ముసలై చలిమంట కోరేవు
చలికి ముడుచుకు పోయేవు
దోసిలి పట్టి తిండి తినేవు
ఎప్పుడు నీవు ఆశలు వీడేవు

శ్లో :17
కురుతే గంగాసాగారగమనం
వ్రత పరిపాలన మథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన

భావం:
కాశీ యాత్రలు వ్రతాలు చేసేరు
పూజలు దాన ధర్మాలు చేసేరు
ఎవరైనా ఆత్మ జ్ఞానం లేనివారు
వంద జన్మలైన ముక్తిని పొందరు

శ్లో:18
సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః

భావం:
దేవాలయాల చెట్లచెంత
నేలపైన పడుకొనే విరాగి
 భోగాలు వీడిన  యోగి
ఇహ పర సుఖాల భోగి

శ్లో:19
యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ

భావం:
 భోగి వైనా యోగి వైనా 
 కలసి వున్నా ఒంటరైనా
దైవంలో జీవించే వానిదే
ఆనందం పరమానందం

శ్లో:20
భగవద్గీతా కించిదధీత
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేవ న చర్చ

భావం:
కొంచెమైనా భగవద్గీతా గానం
కొంచెమైనా గంగాజల పానం
కొంచెమైనా శ్రీకృష్ణ పూజనం
కొంచెమైనా ఉంచదు నరకం

శ్లో:21
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే

భావం:
మళ్ళీపుట్టాలి మళ్ళీ చావాలి
మళ్ళీ అమ్మబొజ్జలో ఉండాలి
సంసారం లో బాధలు పడాలి
కృష్ణా! నీవే మము కాపాడాలి 

శ్లో:22
రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగి యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ

భావం:
 యోగి  పెట్టినదే  తినును
 దానితో సంతృప్తి పడును
పుణ్య పాపాలు అంటవు
బాలునిలా అనందించును

శ్లో:23
కస్త్వం కోహం కుత ఆయాతః
కా మే జనని కో మే తాతః |
ఇతి పరభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం

భావం:
నీవు ఎవరు ఎక్కడి వాడవు
ఎవరు మాత ఎవరు తాత
పరలోక సారం తెలియుము
విశ్వంపై నీభ్రమలు వీడుము


శ్లో:24
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్తః  సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం

భావం:
నేను నీవు అంతా దైవం
సహనం లేక కోపగించేవు
కోరిన మోక్షం నీ దవును
అంతటా చూడు దైవం

శ్లో:25
శత్రౌ మిత్రే పుత్రే బంధవ్
మా కురు యత్నం విగ్రహ సంధవ్ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం

భావం:
వారు శత్రువులు వీరు నావారు
అనుచు  దగ్గర దూరం చేయకు
అందరి లో  దేవుని  చూడుము
అంతా సమానం అదే జ్ఞానము

శ్లో:26
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా త్మానం భావయ కోహం |
ఆత్మజ్ఞాన విహీనా మూడాః
తే పచ్యంతే నరకనిగూడః

భావం:
కామం కోపం వదులుము
లోభం మోహం  వీడుము
ఆత్మ జ్ఞానం తెలియుము
నీలో దైవము  చూడుము
నీవైపు నరకము చూడదు

శ్లో:27
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం

భావం:
గీతా విష్ణుసహస్ర  గానం
నారాయణ రూప ధ్యానం
మనసా మంచితో స్నేహం
దీనజనులకు ధనసాయం

శ్లో:28
సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం

భావం:
కామమే సుఖమందురు
రోగాలే తెచ్చు కుందురు
మరణమే శరణమందురు
పాపాల జోలికి పోదురు

శ్లో:29
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి:

భావం:
ధనమే దుఃఖం మరువకు నిత్యం
అది సుఖమీయదు ఇది సత్యం
ధనికులకు పుత్రు లంటే భయం
అంతటా ధనం తీరు ఇదే నిత్యం

శ్లో:30
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం
కుర్వవధానం మహదవధానం

భావం:
ప్రాణాయామం ఆహార నియమం
యోగ ధ్యానం సమాధి విధానం
ఆత్మను ఎరుగుం అదే ఉత్తమం
చేయాలి దైవజపం అదే వివేకం

శ్లో:31
గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరార్భవ ముక్తః
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం

భావం:
గురుపాద పద్మాలు వీడకుము
అదే సంసార విముక్తి మార్గము
ఇంద్రియాలు అదుపు చేయుము
నీగుండెలో నిజదైవం చూడుము

శ్లో:32
మూఢః కశ్చన వైయాకరణో
డుకృన్కరణాధ్యయన ధురిణః .
శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణః

భావం:
 వ్యాకరణ సూత్రాల
 మూఢమతి మారెను
 శంకరుల  బోధనలు
జ్ఞానము కలిగించెను

శ్లో:33
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే 

భావం:
భజగోవిందం భజగోవిందం
గోవిందభజనం మూఢబుద్ది
గోవింద జపము చేయుము
సంసార సాగరం  దాటెదవు 

|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||