6, అక్టోబర్ 2018, శనివారం

భజ గోవిందం భావ గానం revised

[06/10, 04:37] Syamala Rao SSSS: *భజగోవిందం భావ గానం.*  శ్లో.1-15

1
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుకృణ్ కరణే

భావం: 
భజగోవిందం గోవిందభజన
గోవిందభజన చేయిమూడా
తుదికాలం దరి వ్యాకరణం 
 నిను  రక్షించదు రక్షించదు

2
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం  తేన వినోదయ చిత్తం

భావం:
బుద్ధిహీనా ధనాశ పనులేల
మంచిబుద్ధితో మేలు చేయి
ఆ నిజపనుల  ఫలితాలను
మనసుతో  వినోదించుము

3
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా  మాగామోహావేశం
ఏతన్మామ్సావసాది వికారం
మనసి విచంతయ వారం వారం

భావం:
పాలిండ్ల నాభి ప్రాంతం
చూసి పొందేవు మోహం
కామమే వికారమోయి
అవి రక్త మాంసాలోయి
గుర్తుంచుకో రోజు రోజు

4.
నళినీ దలగత జలమతి తరలం
తద్వాజ్జీవితమతిశయచపలం 
విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం

భావం:
తామరాకుపై నీటి చుక్కలు
అందములన్నీ క్షణికములు
కామమే రోగ బాధలిచ్చును
నీ లోకమంతా శోకమవును

5.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే

భావం:
అందరికీ ధనార్జన పై ఆసక్తి
రక్తబందువులకి అదే ఆసక్తి
నీ ధనార్జన  పోయినపుడు
నీపైన వారి ఆసక్తి పోవును

6.
యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే

భావం:
ఊపిరాడు నాడు చూసి
 అందరు కుశలం అడిగేరు
ఊపిరాడని నాడు చూసి
అందరు భార్యా భయపడేరు

7.
బాలాస్తావతీ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః

భావం:
బాల్యమంతా ఆటల ఆసక్తి
వయసంతా కాంతల ఆసక్తి
ముదిమంతా  చింతలోయి
దేవునిపై ఆసక్తి ఎపుడోయి

8.
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః

భావం:
 ఏది భార్య ఎవరు సంతానం
ఈ సంసారం చాల విచిత్రం
ఏది నీవు ఎక్కడ నీ లోకం
నిన్ను నీవు  తెలియవోయి

9.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి:

భావం:

 సత్సంగం పెంచును దైవ బంధము
మోహం పెంచును లోక బంధము
 మోహం పోయిన చంచలం పోవును
చంచలం పోయిన ముక్తి కలుగును

10.
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః

భావం:
ముసలి తనాన కామం వుండదు
నీరు ఎండిన చెరువు వుండదు
ధనం తరిగిన జనం
వుండరు
జ్ఞానం తెలిసిన బంధం
వుండదు

11.
మా కురు ధన జన యవ్వన గర్వం 
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా 

భావం:
 ధన జన వయసు గర్వాలు
వలదు పోవునవి క్షణికాలు
ఇది అంతా మాయాలోకం
నీవు  బ్రహ్మలోకం  చేరాలి

12.
దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతవ్ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః 
తదపి న ముంచత్యాశావాయుః

భావం:
ఎండా వానల కాల చక్రమిది
కాలములన్ని వచ్చి పోవునవి
కాలంతో వయసు పెరుగును
కాలంతో ఆయువు తరుగును

13.
కాతే కాంతా ధనగతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగాతిరేకా
భవతి భవార్ణవతరణే 

భావం:
కాంతా కనకాల కై ఆశలేల
బాధలు కష్టాలు నీకు ఏల
మూడు లోకాలు దాటాలి
సత్సంగమే దాటించును

14.
జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః

భావం:
గడ్డాలు మీసాలు వుండినా
సన్యాసి బట్టలు ధరించినా
తెలిసీ పట్టించు కోని వారే
వట్టి పగటి వేషాల వారు

15.
అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం

భావం:
ముసలై శరీరం కుంగును
పళ్ళు జుట్టూ   వూడును
కర్రే నడవ సాయమవును
జీవుడా నీకు ఏల ఆశలు
[06/10, 04:37] Syamala Rao SSSS: *భజగోవిందం*
 *భావ గానం 16-33*
మూలం: ఆదిశంకరులు
తెలుగు:శ్యామలరావుssss

శ్లో:16
అగ్రే వహ్నిః పృష్ఠేభానుః
రాత్రౌ చుబుకసమర్పితజానుః
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాసః

భావం:
ముసలై చలిమంట కోరేవు
చలికి ముడుచుకు పోయేవు
దోసిలి పట్టి తిండి తినేవు
ఎప్పుడు నీవు ఆశలు వీడేవు

శ్లో :17
కురుతే గంగాసాగారగమనం
వ్రత పరిపాలన మథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన

భావం:
కాశీ యాత్రలు వ్రతాలు చేసేరు
పూజలు దాన ధర్మాలు చేసేరు
ఎవరైనా ఆత్మ జ్ఞానం లేనివారు
వంద జన్మలైన ముక్తిని పొందరు

శ్లో:18
సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః

భావం:
దేవాలయాల చెట్లచెంత
నేలపైన పడుకొనే విరాగి
 భోగాలు వీడిన  యోగి
ఇహ పర సుఖాల భోగి

శ్లో:19
యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ

భావం:
 భోగి వైనా యోగి వైనా 
 కలసి వున్నా ఒంటరైనా
దైవంలో జీవించే వానిదే
ఆనందం పరమానందం

శ్లో:20
భగవద్గీతా కించిదధీత
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేవ న చర్చ

భావం:
కొంచెమైనా భగవద్గీతా గానం
కొంచెమైనా గంగాజల పానం
కొంచెమైనా శ్రీకృష్ణ పూజనం
కొంచెమైనా ఉంచదు నరకం

శ్లో:21
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే

భావం:
మళ్ళీపుట్టాలి మళ్ళీ చావాలి
మళ్ళీ అమ్మబొజ్జలో ఉండాలి
సంసారం లో బాధలు పడాలి
కృష్ణా! నీవే మము కాపాడాలి 

శ్లో:22
రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగి యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ

భావం:
 యోగి  పెట్టినదే  తినును
 దానితో సంతృప్తి పడును
పుణ్య పాపాలు అంటవు
బాలునిలా అనందించును

శ్లో:23
కస్త్వం కోహం కుత ఆయాతః
కా మే జనని కో మే తాతః |
ఇతి పరభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం

భావం:
నీవు ఎవరు ఎక్కడి వాడవు
ఎవరు మాత ఎవరు తాత
పరలోక సారం తెలియుము
విశ్వంపై నీభ్రమలు వీడుము


శ్లో:24
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్తః  సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం

భావం:
నేను నీవు అంతా దైవం
సహనం లేక కోపగించేవు
కోరిన మోక్షం నీ దవును
అంతటా చూడు దైవం

శ్లో:25
శత్రౌ మిత్రే పుత్రే బంధవ్
మా కురు యత్నం విగ్రహ సంధవ్ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం

భావం:
వారు శత్రువులు వీరు నావారు
అనుచు  దగ్గర దూరం చేయకు
అందరి లో  దేవుని  చూడుము
అంతా సమానం అదే జ్ఞానము

శ్లో:26
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా త్మానం భావయ కోహం |
ఆత్మజ్ఞాన విహీనా మూడాః
తే పచ్యంతే నరకనిగూడః

భావం:
కామం కోపం వదులుము
లోభం మోహం  వీడుము
ఆత్మ జ్ఞానం తెలియుము
నీలో దైవము  చూడుము
నీవైపు నరకము చూడదు

శ్లో:27
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం

భావం:
గీతా విష్ణుసహస్ర  గానం
నారాయణ రూప ధ్యానం
మనసా మంచితో స్నేహం
దీనజనులకు ధనసాయం

శ్లో:28
సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం

భావం:
కామమే సుఖమందురు
రోగాలే తెచ్చు కుందురు
మరణమే శరణమందురు
పాపాల జోలికి పోదురు

శ్లో:29
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి:

భావం:
ధనమే దుఃఖం మరువకు నిత్యం
అది సుఖమీయదు ఇది సత్యం
ధనికులకు పుత్రు లంటే భయం
అంతటా ధనం తీరు ఇదే నిత్యం

శ్లో:30
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం
కుర్వవధానం మహదవధానం

భావం:
ప్రాణాయామం ఆహార నియమం
యోగ ధ్యానం సమాధి విధానం
ఆత్మను ఎరుగుం అదే ఉత్తమం
చేయాలి దైవజపం అదే వివేకం

శ్లో:31
గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరార్భవ ముక్తః
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం

భావం:
గురుపాద పద్మాలు వీడకుము
అదే సంసార విముక్తి మార్గము
ఇంద్రియాలు అదుపు చేయుము
నీగుండెలో నిజదైవం చూడుము

శ్లో:32
మూఢః కశ్చన వైయాకరణో
డుకృన్కరణాధ్యయన ధురిణః .
శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణః

భావం:
 వ్యాకరణ సూత్రాల
 మూఢమతి మారెను
 శంకరుల  బోధనలు
జ్ఞానము కలిగించెను

శ్లో:33
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే 

భావం:
భజగోవిందం భజగోవిందం
గోవిందభజనం మూఢబుద్ది
గోవింద జపము చేయుము
సంసార సాగరం  దాటెదవు 

|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి