9, అక్టోబర్ 2018, మంగళవారం

రుద్ర రక్షా కవచం భావగానం

*రుద్ర  రక్షా కవచం*
 శివుడే మనకు రక్ష గా నిలిచేందుకు  ఋషి దుర్వాసుడు తెలిపింది.

భావం :
దుర్వాస ముని పలికెను
1.
 శిరసా వందనం దైవం
స్వయం పరమేశ్వరం
ఒకరే  పురాతన దైవం
సకల  దేవతల   దైవం

వేదం:
*దుర్వాస ఉవాచ:-*
1.
*ప్రణమ్యామి శిరసా దేవం*
*స్వయంభుం పరమేశ్వరం.*
*ఏకం సర్వ గతం దేవం*
*సర్వ దేవ మయం విభుం.*

2. భావం:
పలికేను  రుద్ర   కవచం
అంగప్రాణ రక్షా  కవచం
పగలురాత్రి దైవ కవచం
రోజంతా దేవుని కవచం
అతిపూర్వ రక్షా కవచం
2.
*రుద్ర వర్మ ప్రవక్షామి*
*అంగ ప్రాణస్య రక్షయే.*
*అహో రాత్ర మయం దేవం*
 *రక్షార్థం నిర్మితం పురా.*

3.భావం:
ముందుండి  రుద్రుడు     రక్షించు గాక
ముఖము    మహేశుడు రక్షించు గాక
నా తలను ఈశ్వరుడు   రక్షించు గాక
నుదురు నీలలోహితుడు రక్షించు గాక

3.
*రుద్రో మే చాగ్రతఃపాతు*
*ముఖంపాతుమహేశ్వరః*
*శిరోమే యీశ్వరఃపాతు*
 *లలాటం నీలలోహితః*

4.భావం:
కనులను ముక్కంటి  రక్షించు గాక
ముఖం  మహేశుడు  రక్షించు గాక
చెవులు శంకరుడు    రక్షించు గాక
ముక్కు సదాశివుడు రక్షించు గాక

4.
*నేత్రయోస్త్రయంబకః పాతు*
*ముఖంపాతు  మహేశ్వరః*
*కర్ణయోః పాతుమే*
*శంభుర్నాసికాయాం సదాశివః.*

5.భావం:
నా నాలుకను వాగీశుడు రక్షించు గాక
నా పెదాలు అంబికాపతి రక్షించు గాక
నా కంఠం   నీలకంఠుడు  రక్షించు గాక
నా భుజాలు పినాకపాణి రక్షించు గాక
5.
*వాగీశః పాతు మే జిహ్వా*
 *మోష్ఠా పాతంబికాపతిః*
*శ్రీ కంఠః పాతు మే గ్రీవాం*
*బాహూంశ్చైవ పినాక ధృత్.*

రుద్ర రక్షా కవచం సంపూర్ణం

భావగానం:
Syamalaraossss.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి