23, జనవరి 2018, మంగళవారం

పురుష సూక్తం తెలుగు భావగానం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *పురుషసూక్తం-భావ గానం*
Ref.:Srirama krishna math book.
 *సస్వర వేదమంత్రాలు*
మూలం:ఋగ్వేదం 10.8.90

  తెలుగు భావ గాన రచన
:శ్యామలరావుssss
 +91 9989125191
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

1.
వేలాది తలల పురుషుడోయి
వేలాది కనులు పాదాలోయి
భూమీ విశ్వమూ చుట్టేనోయి
పదంగుళాల పైననిలిచెనోయి
2.
కనిపించేదంతా దైవమోయి
గతమూ రేపు దైవమేనోయి
అమృతత్వానికి నాధుడోయి
అంతటా నిండినదైవమోయి
3.
అతడే ఆది దైవమోయి
అంతా దైవమహిమోయి
అగుపించేది కొంతే నోయి
ఆపైది అమరత్వమోయి
4.
ఇదంతా పావు భాగమేనోయి
మూడు పావులు పైనుందోయి
కదిలే కదలని వాటిలో నోయి
దైవమే అన్నిటా ఉన్నాడోయి
5.
దైవమే గుడ్డు లా పుట్టెనోయి
తానే బ్రహ్మను పుట్టించెనోయి
అంతా తానే  వ్యాపించెనోయి
భూమి జీవులును పుట్టించెనోయి
6.
సృష్టియాగము జరిగెనోయి
దైవమే యాగ వస్తువయనోయి
దేవతలే యాగము చేసిరోయి
వసంత కాలమే నెయ్యోయి
వేసవి కాలమే పుల్లలోయి
వానా కాలమే ప్రసాదమోయి
7.
నింగీనేలానీరు నిప్పు గాలులోయి
పగలు రాత్రీ హద్దులాయనోయి
పంచప్రాణాలు అంగాలు ఇంద్రియాలోయి
మనసు బుద్ధిచిత్త అహంకారాలోయి
ధర్మ అధర్మా గుణాలతోడోయి
సృష్టి యాగమే కొనసాగెనోయి
దైవమే యాగ గోవాయెనోయి
8.
యాగాన పుట్టిన దైవమునోయి
నీరుచల్లి శుద్ధి చేసి రోయి
సాద్యులు ఋషులు చేసిరోయి
దైవయాగము కొన సాగెనోయి
9.
ఆ యాగము లో నుండోయి
పెరిగు నేయలు వచ్చేనోయి
జీవులు పక్షులు వచ్చేనోయి
జీవరాశులు పుట్టసాగెనోయి
10.

దైవయాగము కొన సాగెనోయి
ఋగ్వేద యజుర్వేదాలోయి
వేద వేదాంగాలు వచ్చేనోయి
వ్యాకరణ ఛందాలొచ్చెనోయి
11.
దైవయాగము కొన సాగెనోయి
ఏకదంత బహుదంతాలవోయి
రెండు దవడల జీవులోయి
గొర్రెలు గుర్రాలు పశువులోయి
పలు రకాల జీవులొచ్చెనోయి
12&13
దేవుని ఏ అంగాలనుండోయి
ఏ ఏ గుణశీలురు పుట్టారోయి
జనులందరు దైవఅంగాలోయి
ముఖం జ్ఞానగుణ శీలులోయి
చేతులు రాజబల శీలులోయి
తొడలు వ్యాపార శీలులోయి
పాదాలు ఉద్యోగ శీలులోయి
అందరూ దైవాంస శీలులోయి
14
 మనసు చంద్రుని నుండోయి
కనులు సూర్యుని నుండోయి
మోము ఇంద్రఅగ్నినుండోయి
ప్రాణం వాయువు నుండోయి
అన్ని దైవ బందాలున్నవోయి
దేవుని నుండి వచ్చినవోయి
15.
నాభి నుండి అంతరిక్షమోయి
తల  నుండి దేవ లోకమొయి
కాళ్ళ నుండి భూ లోకమొయి
చెవి నుండి దిక్కులొచ్చెనోయి
16.
దైవమహిమను తెలిసితినోయి
నేను  ఆదేవుని తెలిసితినోయి
అజ్ఞాన చీకటి తొలగించునోయి
సూర్యకాంతి ప్రకాశమతుడోయి
17.
బ్రహ్మ ముందుగా తెలిపెనోయి
ఇంద్రుడు దిశలన్ని చూసేనోయి
మరి అతనూ నిర్ధారించెనోయి
మోక్షానికి వేరే దారేది లేదోయి
18.
ఇది తెలిసిన ముక్తిపొందేరోయి
దైవధ్యాన పూజాయోగాలోయి
అవే మొదటి ధర్మాలైనవోయి
ఆచరించిన సాధ్యులందరోయి
*ఉన్నత లోకాలంది రోయి*
19.
నీరు ,భూమిరసాలనుండోయి
ప్రపంచము సంభవించెనోయి
దైవం విశ్వాన్ని సృష్టించెనోయి
దైవం బ్రహ్మను సృష్టించెనోయి
ఆయన అంతటా ఉన్నాడోయి
ఆయనలోకాలు సృష్టించెనోయి
20.
నేను దైవమును తెలిసితినోయి
దైవము మహిమ కలవాడోయి
సూర్య ప్రకాశము కలవాడోయి
చీకటికి చాలాదూరమతడోయి
ఇలా దైవమునెఱిఁగిన వారోయి
మరి ఇక ముక్తిని పొందెదరోయి
మరి ముక్తి ఇంకోదారి లేదోయి

21.
ప్రజాపతి గర్భాన చలించెనోయి
లోనుండు జనించని వాడోయి
పలురూపాలు పొందువాడోయి
నిజమైన బ్రాహ్మయోని నోయి
 మహనీయులుఎరుగుదురోయి
మరీచివంటి మహర్షులోయి
ఆ పదవిని ఆశించువారోయి
22.
ఎవరు దేవతల ప్రకాశమోయి
ఎవరు దేవతల గురువోయి
ఎవరు దేవతల పూర్వుడోయి
ఎవరు నిజమైన బ్రహ్మమొయి
ఆ ప్రకాశునకు ప్రణామమోయి
23.
సృష్టించిన దైవము గురించోయి
సత్యము దేవతలు తెలిపిరోయి
దైవమును  వెతుకు వారికోయి
ఇలా దైవమెరుగు వారికోయి
దేవతలు వశము అవుదురోయి
24.
సిగ్గుపడేదేవి శ్రీదేవి నీదేవిలోయి
పగలు రాత్రులు నీ భుజాలోయి
నక్షత్రాలు నీదివ్యరూపమోయి
ఆశ్వినీ దేవతలు నీమోమోయి
25.
మాఇష్టాలను ప్రసాదించవోయి
ఆనందాలను  ప్రసాదించవోయి
మాకు అన్నీ   ప్రసాదించవోయి

-పురుష సూక్తం సంపూర్ణం-
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం భగవధర్పణం స్వాహా