10, మార్చి 2021, బుధవారం

శివ పంచాక్షర స్తోత్రం + భావగానం

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*శివ పంచాక్షర స్తోత్రం*

  + *భావగానం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 సంస్కృత మూలం:

 శ్రీ ఆది శంకరాచార్యులు 

భావగానం రచన:

శ్యామలరావు ssss


*నాగేంద్ర హారాయ త్రిలోచనాయ*

*భస్మాంగరాగాయ  మహేశ్వరాయ* 

*నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ*

*తస్మై నకారాయ నమ శివాయ*

  || 1 ||

 నాగేంద్రుడు నీ కంఠహారమయ

 బూడిద శరీర అలంకారమయ

మూడు కనుల మహా దేవాయ

నిత్యమైన స్వచ్ఛమైన దేవాయ

దిక్కులే బట్టలు స్వతంత్రాయ

పంచాక్షరీ మంత్రనాధ దేవాయ

*న* కారాయ నమస్తే శివాయ

 

*మందాకినీ సలిల చందనచర్చితాయ*

*నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ*

*మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ*

*తస్మై మ కారాయ నమ శివాయ*

 || 2 ||


పవిత్ర గంగా చందన లేపితాయ 

నందీశ్వరాయ  మహేశ్వరాయ 

సకల భూత గణాల  పూజితాయ

మందార జిల్లేడుపూల అర్చితాయ

పలు రకాల పూలతో పూజితాయ  

*మ* కారాయ  నమస్తే   శివాయ


*శివాయ గౌరీ వదనాబ్జ బ్రుంగ*

*సూర్యాయ దక్షాధ్వర నాశకాయ*

*శ్రీనీలకంఠాయ వ్రుషభ ధ్వజయ*

*తస్మై శి కారాయ నమశివాయ*

|| 3 ||


గౌరీ ముఖకమల వికా‌స సూర్యాయ

శుభాయ  దక్షయజ్ఞ నాశనాయ 

శ్రీ నీల కంఠాయ నంది ద్వజాయ

*శి* కారాయ  నమస్తే   శివాయ 

 

 *వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది* 

*మునీంద్ర దేవార్చిత శేఖరాయ |*

*చంద్రార్క వైశ్వనర లోచనాయ*

*తస్మై వ_కారాయ నమశివయ*

 || 4 ||


వశిష్ఠ అగస్త్య గౌతమ మునులు

దేవతా పూజితా విశ్వ కిరీటాయ

అగ్ని సూర్య చంద్రుల కనులాయ

 *వ* కారాయ నమస్తే  శివాయ

 

 *యక్ష స్వరూపాయ  జఠాధరాయ*

 *పినాక హస్తాయ సనాతనాయ*

 *దివ్యాయ దేవాయ దిగంబరాయ*

*తస్మై య కారాయ నమ శివాయ*

 || 5 ||


 యక్ష రూపాయ జడల శిరోజాయ

 చేతి త్రిశూలాయ సనాతనాయ 

 దివ్యప్రకాశాయ దిశలె బట్టలయ

 *య* కారాయ నమస్తే శివాయ  


*పంచాక్షర మిదం పుణ్యం* 

*యః పఠేత్ శివ సన్నిధౌ*

 *శివ లోకమవాప్నోతి*

*శివేన సహమోదతే* || 6 ||


ఇది శివ పంచాక్షరీ మంత్రం

శివుని దగ్గర చదివిన పుణ్యం

వారు శివ లోకం  పొందెదరు 

 శివుని తో ఆనందించెదరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి