సరళంగా సులభంగా
*కఠోపనిషత్తు* భావగానం
*ఆదిశంకరాచార్య రచనం*
*కఠినమైన సాధన సారం*
*ఇది ఆత్మ విద్యా సారం*
*యముడు తెలిపిన విద్య*
*నచికేతునికి తెలిపిన విద్య*
ఆత్మయే మెలుకువలో నిద్రలో
విశ్వంతో సంబంధాల అంశం
అదే ప్రాణం పరమాత్మ అంశం
వేరే దేహంలోకి మారు అంశం
*అతిధిలా దేహంలో వుంది*
*ప్రాణంలా దేహంలో వుంది*
*జీవంలా జీవులలో వుంది*
గ్రహాలు తారలు తారలరాశులు
పద్దతి చక్రం లో అవి తిరుగును
వాటిని తిప్పేశక్తే పరమాత్మ శక్తి
విశ్వం అంతటా పరమాత్మ శక్తి
*అంతా జననమరణ చక్రం*
*వీడాలి జననమరణ చక్రం*
*మనసుతో తెలుసుకోవాలి*
*ఆత్మ ఉనికి తెలుసుకోవాలి*
*నీలో దైవాంశం అతిసూక్ష్మం*
*నది యేరు మేఘం తటాకం*
*రూపాలు అనేకం నీరు ఏకం*
*జీవాలు అనేకం ఆత్మ ఏకం*
*పురం నివాస ప్రాంతం*
*పురం పురుష నివాసం*
*దేహం ఆత్మ నివాసం*
*ఆత్మ నిత్యం సత్యం*
*జీవులలోని దైవాంశం*
*దేహం వీడిన తరువాత*
*అది చేసిన మంచి ధర్మం*
*తెలిసిన విజ్ఞాన సారం*
*అవే దేహం అవకాశం*
*అలా దేహం పొందును*
*గుణం భావం పొందును*
*ఆత్మ అలా వుంటుంది*
*ఆత్మ ఇలా వుంటుంది*
*అని తెలుపుట కష్టము*
*ఆత్మ అంతాటా వుంది*
*ఆత్మను సాక్షిగా చూడాలి*
*ఆత్మ అనుభవం కలగాలి*
*ఆ బ్రహ్మానందం పొందాలి*
*కఠినంగా సాధన చేయాలి*
*నీవుగా ఆత్మను చుాడాలి*
*ఆ సాక్షాత్కారం పొందాలి*
*నీకు విజయము కలుగును*
*అని నచికేతుని దీవించెను*
*యముని బోధన వినెను*
*నచికేతుడు ఆచరించెను*
*జ్ఞానంతో సాధన చేసెను*
*తనలోఆత్మను చూసెను*
*బ్రహ్మానందం పొందెను*
నా బ్లాగ్ స్పాట్ చూడండి
syamalaraossss.blogspot.com
*సర్వం శ్రీకృష్ణార్పణం*
🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి