ఆదిత్య హృదయం+భావ గానం
పార్ట్ 3 ( శ్లోకాలు 21- end )
బంగారు ప్రకాశాయ
అగ్నిం విశ్వకారణాయ
నమస్తే చలి నాశాయ
లోకాలసాక్షి సత్యాయ
*తప్త చామీకరాభాయ*
*వహ్నయే విశ్వకర్మణే |*
*నమస్తమోఽభి నిఘ్నాయ*
*రుచయే లోకసాక్షిణే ‖ 21 ‖*
జీవుల జనన కారణం
జీవుల నాశన కారణం
ఎండా వానల దైవం
వేడి చలనాల దైవం
*నాశయత్యేష వై భూతం*
*తదేవ సృజతి ప్రభుః |*
*పాయత్యేష తపత్యేష*
*వర్షత్యేష గభస్తిభిః ‖ 22 ‖*
నిదురలో జాగర్త దైవం
అన్ని జీవులలో దైవం
అతడే యాగాగ్ని దైవం
అతడే యాగఫల దైవం
*ఏష సుప్తేషు జాగర్తి*
*భూతేషు పరినిష్ఠితః |*
*ఏష ఏవాగ్నిహోత్రం చ*
*ఫలం చైవాగ్ని హోత్రిణాం‖ 23 ‖*
వేదాలకు యాగాలకు
మరి యాగ ఫలాలకు
సర్వ లోకాల పనులకు
సర్వ లోకాల ప్రభువు
*వేదాశ్చ క్రతవశ్చైవ*
*క్రతూనాం ఫలమేవ చ |*
*యాని కృత్యాని లోకేషు*
*సర్వ ఏష రవిః ప్రభుః ‖ 24 ‖*
పారాయణ ఫలం:
ఆపదలో అడవిలో కష్ఠంలో
ఆదిత్య హృదయం చదివిన
ఆపదలు భయం తొలగును
రాఘవా సుఖం కలుగును
*ఫలశ్రుతిః*
*ఏన మాపత్సు కృచ్ఛ్రేషు*
*కాంతారేషు భయేషు చ |*
*కీర్తయన్ పురుషః కశ్చిన్*
*నావశీదతి రాఘవ ‖ 25 ‖*
ఇలా శ్రధ్ధగా పూజించుము
దేవ దేవుని లోకాలపతిని
ఇది 3 సార్లు చదువుము
పోరులో జయం కలుగును
*పూజయస్వైన మేకాగ్రో*
*దేవదేవం జగత్పతిం|*
*ఏతత్ త్రిగుణితం జప్త్వా*
*యుద్ధేషు విజయిష్యసి ‖ 26 ‖*
ఇక ఇప్పుడే మహావీరా
రావణుని వధించెదవు
అని పలికి అగష్యుడు
అచట నుండి వెడలెను
*అస్మిన్ క్షణే మహాబాహో*
*రావణం త్వం వధిష్యసి |*
*ఏవముక్త్వా తదాగస్త్యో*
*జగామ చ యథాగతం‖ 27 ‖*
రాముడు అంతా వినెను
మనసులో భాద వీడెను
సూర్యుని ధ్యానించెను
రవిని ఇష్టంగా తలచెను
*ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః*
*నష్టశోకోఽభవత్ - తదా |*
*ధారయామాస సుప్రీతో*
*రాఘవః ప్రయతాత్మవాన్‖28‖*
శుచిగా 3ఆచమనాలు చేసెను
ఆదిత్యుని చూసి జపించెను
అమిత ఆనందం పొందెను
విల్లు బాణాలు చేత పట్టెను
*ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు*
*పరం హర్షమవాప్తవాన్ |*
*త్రిరాచమ్య శుచిర్భూత్వా*
*ధనురాదాయ వీర్యవాన్ ‖ 29 ‖*
రాముడు రావణుని చూసెను
యుద్ధ ఉత్సాహం చూపెను
అన్నివిధాల రావణ మరణం
అదే రాముని దృఢ నిశ్చయం
*రావణం ప్రేక్ష్య హృష్టాత్మా*
*యుద్ధాయ సముపాగమత్ |*
*సర్వయత్నేన మహతా వధే*
*తస్య ధృతోఽభవత్ ‖ 30 ‖*
రాముడు రవిని తలచెను
ఆదిత్యుడు ఆనందించెను
రావణుడు మరణించును
అని దేవతలతో పలికెను
*అధ రవిరవదన్*
*నిరీక్ష్య రామం*
*ముదితమనాః పరమం*
*ప్రహృష్యమాణః |*
*నిశిచరపతి సంక్షయం విదిత్వా*
*సురగణ మధ్యగతో వచస్త్వరేతి* ‖31‖
ఇది శ్రీరామాయణ కావ్యం
వాల్మీకి రాసిన ఆదికావ్యం
యుద్ధకాండ 107వ బాగం
*ఇత్యార్షే శ్రీమద్రామాయణే*
*వాల్మికీయే ఆదికావ్యే*
*యుద్దకాండే సప్తోత్తర*
*శతతమః సర్గః ‖*
భావ గానం రచన:
శ్యామలరావు ssss
అంతా దేవునికి సమర్పణం
🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి