14, ఫిబ్రవరి 2021, ఆదివారం


 సరళంగా సులభంగా

భక్తి స్తోత్రం +  భావ గానం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*శ్రీ భవానీ అష్టకం*+ భావ గానం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 అష్టకం మూల రచన :

*శ్రీఆదిశంకరాచార్యులు*

సరళ భావ గానం రచన:

శ్యామలరావు s.s.s.s.


*1.* 

*న తాతో న మాతా న బంధు ర్నదాతా*

లేరు తాతా మాతా బంధువు దాతా    

*న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా !*

లేరు పుత్రులు కూతుర్లు  సేవకులు భర్తా  

*న జాయా న విద్యా న వృత్తిర్మమైవ*

 నాకు విద్యా  వృత్తీ ఏదీ  తెలియదు  

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని !!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*2.* 

*భవాబ్ధావపారే మహాదుఃఖభీరు*

 లోకాల లభించు మహా బాధలు భయాలు

*పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః !*

 కామం లోభం మత్తులు పొందేను

*కుసంసారపాశ ప్రబద్ధః సదాహం*

నేను సదా సంసార పాశాల బంధీని

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని !!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*3.*

*న జానామి దానం న చ ధ్యాన యోగం*

 తెలియదు  దానం ధ్యానం యోగం 

*న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్ !*

తెలియదు తంత్రం స్తోత్రం మంత్రం

*న జానామి పూజాం నచ న్యాసయోగం*

తెలియదు పూజా యాగం యోగం

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*4.*

*న జానామి పుణ్యం న జానామి తీర్థం* 

తెలియదు పుణ్యం తెలియదు తీర్థం

 *న జానామి ముక్తిం లయం వా కదాచిత్!*

తెలియదు ముక్తి లయం  మోక్ష భావం 

*న జానామి భక్తిం వ్రతం వాపి మాతః*

 తెలియదు భక్తి నోము వ్రతం మాతా

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*5.*

*కుకర్మీ కుసఙ్గీ కుబుద్ధిః కుదాసః*

చెడుపనుల సంగాలు చెడుబుద్ధుల  సేవలు

*కులాచారహీనః కదాచారలీనః!*

 కులాచార హీనం దురాచారలీనం 

*కుదృష్టిః కువాక్య ప్రబంధః సదాహం*

చెడుచూపులు  మాటలె నా గుణాలు

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*6.*

*ప్రజేశం రమేశం మహేశం సురేశం*

బ్రహ్మ విష్ణుం మహేశ్వరం ఇంద్రం 

*దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ !*

సూర్యం  చంద్రం ఎందరో దేవతాం

*న జానామి చాన్యత్ సదాహం శరణ్యే* 

 ఎరుగను నాకు తెలియరు నీవే శరణం

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*7.*

*వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే*

వివాద విషాద ప్రమాద  ప్రవాసాలు

*జలే చా నలే పర్వతే శత్రుమధ్యే !*

నీరు నిప్పు కొండలు శత్రువులమధ్య  

*అరణ్యే  సదా మాం ప్రపాహి*

 అడవులలో నీవే శరణం పాహిమాం

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


*8.*

*అనాథో దరిద్రో జరారోగయుక్తో*

అనాధ బీదను పోయేకాలం రోగిని  

*మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః !*

క్షీణించాను రోగాలువీడని  దీనను 

*విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం*

విపత్తులు కష్టాలు నష్టాలు పడ్డాను

*గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!*

నీవే దిక్కు నీవే దిక్కు నాకు భవాని


( అమ్మ వారి నామాలు స్తోత్రం)

*అంబా శాంభవీ చంద్రమౌళిరబలా  అపర్ణా ఉమా పార్వతీ*

*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ*

*సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ!!*


*॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం*

 *భవాన్యష్టకం సంపూర్ణమ్ ॥*

ఇది శ్రీ శంకరాచార్య రచనం

భవాని అష్టకం సంపూర్ణం

*ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి పాహిమాం*

*ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి రక్షమాం*


సర్వం భగవదర్పణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి