5, నవంబర్ 2020, గురువారం

ఆదిత్య హృదయం తెలుగు భావం

 సరళం గా సులభంగా

*ఆదిత్య హృదయం సోత్రం*

+ *భావ గానం*


సంస్కృత మూలం :

*వాల్మీకి రామాయణం*

తెలుగు భావ గానం రచన:

Syamalaraossss.blogspot.com




1

*అది రామ రావణ యుద్ధ సమయం*

*రాముడు పోరున అలసిన సమయం*

*రాముడు పోరుకై ఆలోచించు సమయం*

*రావణుడు పొరుకై  వచ్చు సమయం*

1

తతోయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్


2.

*దేవతలు యుద్ధం చూడ వచ్చిరి*

*దేవతలతో అగస్త్యముని వచ్చిరి*

*దేవతలతో కలిసి  చూడ వచ్చిరి*

*అలసిన రాముని చూసి పలికిరి*

2

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్

ఉపాగమ్యబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి:


3

*అగస్త్య ఋషి పలికెను:*


*ఓ రామ రామ మహాబాహూ*

*వినుము  పురాతన రహస్యం*

*యుధ్ధాన కలుగును విజయం*

*ఇది సకల జనులకు శుభకరం*

3

అగస్త్య ఉవాచ:

రామరామ మహాబాహొ శృణు గుహ్యం సనాతనమ్

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి  


 4

*ఇది ఆదిత్యహృదయం*

*పుణ్యం శత్రు  నాశనం* 

*నిత్యం చదివిన శుభం* 

*అక్షయం కలుగును జయం*

4

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్

జయావహం జపేనిత్యం 

అక్షయం పరమం శివం


5

*సర్వ మంగళం మాంగల్యం* *శుభం సర్వ బాధల నాశనం* 

*సర్వ పాపాలు నాశనం*

*ఆయువు పెంచే ఉత్తమం*

5

సర్వ మంగళ మాంగల్యం సర్వపాపా ప్రణాశనమ్

చింతాశోకప్రశమనం మాయుర్వర్ధనముత్తమమ్


6

*సకల దేవతల ఆత్మ రూపం*

*సకల దేవతల తేజో రూపం*

*సకల లోకాల రక్షక రూపం*

*సకల దేవాసుర పూజితం*

6

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్

పూజయాస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్


7

*సకల దేవతా స్వరూపం*

*సకల దేవాసుర లోక రక్షకం*

*ఆదిత్య కిరణం లోక రక్షకం*

*శక్తి దాయకం స్ఫూర్తిదాయకం*

7

సర్వదేవాత్మకో హ్యేష తీజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి:


8

*అతడే బ్రహ్మ విష్ణు శివం*

*ప్రజాపతి  ఇంద్ర చంద్రం*

*అగ్ని వరుణ కార్తికేయం*

*సూర్యం సర్వ దేవరూపం*

8

ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతి:

మహేంద్రో ధనదః కాలో యమ స్సోమో హ్యపాంపతి:


9

*పితృదేవం సాధ్యం వసుం*

*మరుతులు ఋతు కారకం*

*మనుం ప్రాణ స్వరూపం*

*అశ్వినులు అగ్ని రూపం* 

9

పితరో వాసవ: స్సాధ్యా హ్యస్వినౌ మరుతో మను:

వాయ్తుర్వహ్ని: ప్రజాప్రాణ: ఋతుకర్తా ప్రభాకరః


10

*ఆదిత్యుడే పుట్టించు దైవం*

*బంగారు భానుం లోక విహారం*

*చీకటి నాశకం లోక ఉపకారం*

*వానల కారకం లోక పోషకం*

10

ఆదిత్య: స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తీమాన్

సువర్ణసదృశో భాను హిరణ్యరేతా దివాకరః


11

*వేల కిరణ ప్రకాశం సూర్యం*

*ఏడు గుర్రాల రథం సూర్యం* 

*జీవ లయ కారకం సూర్యం*

*జీవ జనన కారకం సూర్యం*

11

హిరిదశ్వః సహస్రార్చి: సప్తసప్తిర్మ్మరీచిమన్

తిమిరోన్మథన: స్శంభు: స్త్వష్టా మార్తాండ అంశుమాన్


12

*సకల తాప త్రయ నాశకం* 

*సకల చలి మంచు నాశకం*

*అగ్ని గర్భం అధితి పుత్రం*

12

హిరణ్యగర్భ స్సిశిర తపనో భాస్కరో రవి:

అగ్నిగర్భో దితే: పుత్రా: స్శంఖ స్శిశిరనాశనః


13

*రాహు నీడ దాటు సూర్యం*

*ఆదిత్యం  ఆకాశ విహారం*

*బాగుగా కురిపించేవు వర్షం*

*వింధ్యాగిరి వైపు పయనం*

13

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు:స్సామపారగః

ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధీ ప్లవంగమః


14

*ఎరుపు గోళం వేడి దైవం*

*ప్రాణ ప్రియం శత్రు నాశం*

*సూర్యదేవం ప్రాణ కారకం*

*విశ్వ పోషకం లోక నాధం*

14

ఆతపీ మండలీ మృత్యు: పింగళ:స్సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా: రక్త స్సర్వభవోద్భవః


15

*తారల  రాశుల గ్రహాధిపతిం*

*విశ్వ భావం  కిరణాధిపతిం*

*అగ్ని రూపం సూర్యాదిత్యం*

*పన్నెండు రూపాల ఆదిత్యం*

15

నక్షత్రగ్రహతారాణా అధిపో విశ్వాభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే


16

*తూర్పు   గిరి నివాసం*

*పడమర గిరి నివాసం*

*జ్యోతిష గణాం పతిం*

*తిథి వారాల అధిపతిం*

16

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః

జ్యోతిర్గణానాం పతయే  దినాధీపతయే నమః


17

*జయం   క్షేమ కారకం*

*నీలి గుర్రాల రథ దేవం* 

*అదితి పుత్రం దేవం*

*ఆదిత్యాయ వందనం*

17

జయాయ జయ భద్రాయ హర్యశ్యాయ నమోనమః

నమో నమ: స్సహశ్రాంశో ఆదిత్యాయ నమోనమః


18

*ఉగ్రాయ  వీరాయ  ప్రాణాయ*

 *సారంగాయ పద్మ వికాసాయ*

*ప్రళయాంతర ప్రాణకారాయ*

*ఆదిత్యాయ వందనం*

18

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః

నమః పద్మప్రభోదాయ మార్తాండాయ నమోనమః


19

*బ్రహ్మ విష్ణు మహేశాయ*

*సూర్యాయ   ప్రకాశాయ*

*రుద్రాయ ప్రాణ బక్షాయ* 

*ఆదిత్యాయ వందనం*

19

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః


20

*బద్ధక నాశయ  చలి నాశయ*

*శత్రు నాశయ నక్షత్ర నాథాయ* 

*పరమాత్మాయ దివ్య తేజాయ*

*ఆదిత్యాయ వందనం*

20

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే

క్రుతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః


21

*కనక కిరణాయ చీకటి నాశాయ*

*సర్వ కర్తాయ విశ్వకర్తాయ* 

*సర్వ సాక్షాయి కర్మసాక్షాయ*

*ఆదిత్యాయ వందనం*

21

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మనే

సమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే


22

*సకల జీవ సృష్టికర్తాయ*

*సకల జీవ లయ కర్తాయ*

 *సకల జీవ పాలకాయ*

 *ఆదిత్యాయ వందనం*

22

నాశయత్యేష వై భూతం తథైవ సృజతి ప్రభు:

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభిస్తిభి


23

*సకల జీవులలో నుండు దేవాయ*

*నిదుర వేకువలో నుండు దేవాయ*

*యాగ ఆహుతి యాగ ప్రసాదాయ*

 *ఆదిత్యాయ వందనం*

23

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః

ఏష ఏవాగ్నిహొత్రం చ ఫలం చైవాగ్నిహొత్రిణామ్


24

*యాగ క్రతువుల దేవాయ*

*సకల క్రియల దేవాయ*

*సకల లోకాల ఈశాయ*

*ఆదిత్యాయ వందనం*

24

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు:


25

*ఆపదలందు  భయాలందు*

*కష్టాలందు  బాధలందు*

*ఆదిత్యుని కీర్తించు వారికి*

*ఏ నాశనం ఉండదు రామ*

25

ఏనమాపత్సు క్రుచ్చ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కస్చిన్నావసీదతి రాఘవ


26

*లోకాల దేవుని పూజింపుము*

*దేవతల దేవుని పూజింపుము*

*మూడు మార్లు పఠించుము*

*రామా కలుగును విజయము*

26

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్

ఏతత్  త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి


27

*రామా  ఇప్పుడే వధించెదవు*

*రావణుని నీవు వథించెదవు*

*అని   అగస్త్యముని పలికెను*

 *వెంటనే వెడలి పోయెను*

27

అస్మిన్ క్షణే మహాబాహొ రావణంత్వం వదిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ 


28

*అది అంతా రాముడు వినెను*

*ఆదిత్య హృదయము వినెను*

*అగస్త్య ముని మాట వినెను*

*మహిమను మదిలో తలచెను*

28

ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్ తధా

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్


29

*ఆదిత్యహృదయం పఠించెను*

*మూడు    మార్లు   పఠించెను*

*పరమ సంతృప్తిని  పొందెను*

*రాముడు విల్లు చేత పట్టేను*

29

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్


30

*రావణుని వైపు తాను నడిచెను*

*రాముడు గట్టిగా నిశ్చయించెను*

*రావణుని చంప నిశ్చయించెను*

*రాముడు యుద్ధము చేసెను*

30

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్


31

*దేవతలలో సూర్యుడు చూసేను*

*ఆదిత్యుడు రాముని చూసెను*

*రావణ మరణం తప్పదననెను*

*రాముని తొందర పడమనెను*

31

అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహ్రుష్య మాణః

32

నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి

సూర్యం సుందర లోకనాధ మమృతం వేదాన్ తసారం శివం

జ్ఞానం బ్రహ్మమయం సురేషమమలం లోకైక చిత్తం స్వయం

ఇంద్రదిత్య నరాదీపం సురగురుం త్రైలోక్య చూడామణిమ్

విష్ణుబ్రహ్మశివస్వరూపహృదయం వందే సదాభాస్కరం

భానో భాస్కర మార్తాండ చండరష్మే దివాకర

ఆయురారోగ్య మైస్వర్యం విద్యాం దేహి నమోస్తుతే


*ఓం ఇది ఆదిత్య హృదయం*

*భావ గానం  సంపూర్ణం*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి