16, మార్చి 2018, శుక్రవారం

పురుషోత్తమ ప్రాప్తి యోగం భావ గానం

[12/03, 04:48] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *పురుషోత్తమ ప్రాప్తియోగం*
*భగవద్గీత15 అధ్యాయం*
  *భావ గానం* శ్లో. 1-5
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

1.శ్లో :
 పైన వేరులు కింద కొమ్మలోయి
 జీవరాశి రావి శాశ్వతమోయి
సంసారమే దాని రూపమోయి
దాని ఆకులు వేదాలనోయి
తెలిసినవారే వేదవేత్తలోయి

2.శ్లో :
జీవగుణాలే పోషించు నీరోయి
ఇంద్రియాలే చిగురు లోయి
మమతలే మూలములోయి
కర్మబంధాలే సంతానమోయి

3.శ్లో :
 ఆది అంతములు లేనిదోయి
 ఈ జీవ చక్రము ఆగనిదోయి
 అసలు స్ధిరమే లేనిదోయి
అహంకారముల యానమోయి
వైరాగ్యమే వదిలించునదోయి

4.శ్లో :
ఆపై మరు జన్మలుంచనిదోయి
పరంధామము కై చూడవోయి
పూర్వకాల జీవమూలమోయి
ఆ ఆది దైవమే శరణ మోయి

5.శ్లో :
ఆదిఆత్మపై మనసుంచుమోయి
దేహము పై ధ్యాస వీడుమోయి
ఆశలు ఆసక్తి దోషాలు నెగ్గోయి
భాధలుభోగాలు వీడు మోయి
జ్ఞానియే అచటకు  చేరునోయి


🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణార్పణం స్వాహా
రచన : శ్యామలరావుssss
Cell : +91 99891 25191
[12/03, 04:49] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *పురుషోత్తమ ప్రాప్తియోగం*
*భగవద్గీత15 అధ్యాయం*
  *భావ గానం* శ్లో. 6-10
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

6.శ్లో :
ఆపై మరి జన్మలుంచని దోయి
సూర్య చంద్రుల  ప్రకాశాలోయి
అచట అవి కాంతిహీనాలోయి
ప్రకాశమయం నాధామమోయి

7.శ్లో :
అతిపురాతన జీవాంశమోయి
జీవాత్మ  అది నా అంశమోయి
ప్రకృతి మది ఇంద్రియాలనోయి
తన  వైపుకు  ఆకర్షించు నోయి

8.శ్లో :
తన తదుపరి తనువుకోయి
తన మదిని తలపులనోయి
తనతో తరలించునోయి
వాయువు వాసనలనోయి
తనతో తరలించునటులోయి

9.శ్లో:
ఆహార వ్యవహారాలనోయి
ఇంద్రియ విషయాలనోయి
జీవాత్మ ఆస్వాదించునోయి
అధికారై అనుభవించునోయి

10.శ్లో:
సాత్వికరాజస తామసాలకోయి
ఆజ్ఞానులు బానిసలోయి
ఆత్మను వారు తెలియలేరోయి
ఆత్మను జ్ఞానులే  తెలిసేరోయి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణార్పణం స్వాహా
రచన : శ్యామలరావుssss
Cell : +91 99891 25191
[12/03, 08:16] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *పురుషోత్తమ ప్రాప్తియోగం*
*భగవద్గీత15 అధ్యాయం*
 *భావ గానం* శ్లో11-15.

11.శ్లో:
ప్రయత్నించి యోగులు లోయి
 తమలో ఆత్మను తెలిసేరోయి
ప్రయత్నించినా అజ్ఞానులోయి
తమలో ఆత్మను తెలియరోయి

12.శ్లో:
నా శక్తియే లోకాలనోయి
 కాంతితో నింపునోయి
నా శక్తియే అగ్ని కాంతోయి
సూర్య చంద్రుల కాంతోయి

13.శ్లో:
నేనే  సకల ప్రాణుల నోయి
పెంచి పోషించువానినోయి
నేనే బలమును శక్తినోయి
మూలికలకు రసశక్తినీయు
చంద్రుడిని  నేనే నోయి

14.శ్లో:
నేనే వైశ్వానరాగ్ని రూపానోయి
జీవుల దేహమందున్నానోయి
ప్రాణ అపానాదులతో నోయి
నాలుగురకాల ఆహారాలనోయి
నేనే జీర్ణము చేయుదు నోయి

15.శ్లో:
నేనే జీవుల హృదయవాసి నోయి
నేనే జ్ఞానము జ్ఞాపకమునోయి
వేదవేత్తను వేదాంతకర్త నోయి
నన్నే వేదములు తెలిపెనోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణార్పణం స్వాహా
రచన : శ్యామలరావుssss
Cell: +91 99891 25191
[13/03, 22:36] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *పురుషోత్తమ ప్రాప్తియోగం*
*భగవద్గీత15 అధ్యాయం*
 *భావ గానం* శ్లో.16-20

16.శ్లో:
పురుషులు రెండు విధాలోయి
శరీరులు  నశించు    వారోయి
జీవాత్మలు నశించని వారోయి

17.శ్లో.
ఆది దైవమే  పరమాత్ముడోయి
ముల్లోకాల నుండు దేవుడోయి
ముల్లోకాలు ఏలు  ఈసుడోయి
ఆ దైవమే పురుషోత్తముడోయి

18.శ్లో.
శరీరాలకు అతీతుడనోయి
జీవాత్మ కన్న ఉత్తమునోయి
శాశ్విత వేదప్రసిద్ధుడనోయి
నేనే పురుషోత్తముడనోయి

19.శ్లో.
నన్నిలా తెలిసిన వారోయి
వారే అన్ని తెలుసినవారోయి
నన్నే పురుషోత్తముడనోయి
వారు నన్నే సేవింతురోయి

20.శ్లో.
అతి రహస్యశాస్త్రమిదోయి
పుణ్యపురుషా బుద్దిగానోయి
 మెలిగి కృతార్థుడవ వోయి


ఓం తత్ సత్ ఇది సత్యం
శ్రీభగవద్గీత ఉపనిషత్తులో
బ్రహ్మ విద్యా యోగ శాస్త్రమున
శ్రీకృష్ణార్జునుల సంవాదమైన
పురుషోత్తమ ప్రాప్తి యోగమను
15వ అధ్యాయం సంపూర్ణం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
రచన : శ్యామలరావుssss
Cell: +91 99891 25191