5, ఏప్రిల్ 2018, గురువారం

శ్రద్దాత్రయ విభాగ యోగం భావగానం

[16/03, 04:36] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
   భగవద్గీత 17వ అధ్యాయం
     భావగానం  1,2 శ్లోకాలు

అర్జునుడు అడిగెను:
శ్లో.1:
వేదాలు తెలుపని విధాలనోయి
పూజలు చేయు వారి శ్రద్ధలోయి
 మాధవా అవిఎటువంటివోయి
 నీవే విభజించి  వివరించవోయి

పరమాత్మ పలికెను
శ్లో.2:
వేదాలు తెలుపని తీరులోయి
దేహ స్వభావాన కలుగునోయి
సాత్విక రాజస తామసాలోయి
అవి మూడు రకాలుండునోయి

శ్లో.3:
అంతరంగ మనుసరించోయి
వారి   శ్రద్దలు  వుండునోయి
అందుచేత ఆ గుణమేనోయి
కలిగి ఆ రూపే పొందేరోయి

శ్లో.4:
సాత్వికులు  దేవతలనోయి
రాజసులు  యక్షులనోయి
తామసులు భూతాలనోయి
శ్రద్దగా పూజలు చేసేదరోయి

శ్లో.5:
శాస్త్రాలు తెలుపని తీరునోయి
ఘోరతపసులే వారు చేసేరోయి
అహంకారము గొప్పలవారోయి
కామ వికారాలు  కలిగినోరోయి

శ్లో.6:
ప్రాణాలు వారు భాధపెట్టేరోయి
లోనుండు నన్ను కష్టపెట్టేరోయి
అజ్ఞాన అసుర స్వభావులోయి

శ్లో.7:
 యాగ తపస్సు దానములోయి
వారు మూడు రకాల చేసేరోయి
వారు తినే ఆహారాలవలనోయి
వారి స్వభావాలు వుండునోయి

🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[19/03, 05:56] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
   భగవద్గీత 17వ అధ్యాయం
     భావగానం   8-10శ్లోకాలు

పరమాత్మ పలికెను:
శ్లో.8:
సాత్వికులు మెచ్చేరోయి
రసాల ఆహారాలనోయి
పాలు వెన్న నేయిలోయి
ఆయు ఆరోగ్యాలనోయి
పుష్టి సుఖాలీయునోయి

శ్లో.9:
రాజసులు మెచ్చేరోయి
వేడివి మాడినవోయి
ఉప్పు  కారాలవోయి
పులుపు చేదులవోయి
దాహమేయించువోయి
రోగబాధలీయునవోయి

శ్లో.10:
తామసులు నచ్చేరోయి
రసహీన ఆహారమోయి
ఎంగిలివి వాసనవోయి
నిలవ అపవిత్రాలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[19/03, 22:42] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
   భగవద్గీత 17వ అధ్యాయం
     భావగానం   8-10శ్లోకాలు

పరమాత్మ పలికెను:
శ్లో.8:
సాత్వికులు మెచ్చేరోయి
రసాల ఆహారాలనోయి
పాలు వెన్న నేయిలోయి
ఆయు ఆరోగ్యాలనోయి
పుష్టి సుఖాలీయునోయి

శ్లో.9:
రాజసులు మెచ్చేరోయి
వేడివి మాడినవోయి
ఉప్పు  కారాలవోయి
పులుపు చేదులవోయి
దాహమేయునవోయి
రోగబాధలీయునవోయి

శ్లో.10:
తామసులు నచ్చేరోయి
రసహీన ఆహారమోయి
ఎంగిలివి వాసనవోయి
నిలవవి అపవిత్రాలోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[20/03, 04:26] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం
భావగానం 11-13శ్లోకాలు

పరమాత్మ పలికెను:
శ్లో.11:
ప్రతిఫలమాశించకోయి
శాస్త్ర పద్దతి గానోయి
బాధ్యతగా చేసేదోయి
సాత్విక యాగమోయి

శ్లో.12:
ప్రతిఫలముఆశించోయి
 గొప్పతనం కోసమోయి
ఆడంబరాలకోసమోయి
రాజసయాగంచేసేరోయి

శ్లో.13:
శాస్త్ర విధం కానిదోయి
 దానదక్షిణలు లేనిదోయి
మంత్ర  హీనమదోయి
శ్రద్ధ హీనయాగమోయి
తామసయాగమదోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[20/03, 05:41] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం భావగానం14-16శ్లోకాలు

పరమాత్మ పలికెను:

శ్లో.14:
తపస్సులు మూడోయి
గురువు ద్విజులకోయి
దైవము జ్ఞానులకోయి
శ్రద్దగా చేసే సేవలోయి
శుభ్రత పవిత్రత లోయి
బ్రహ్మచర్య ఆచరణోయి
అదే"శరీర" తపస్సోయి

శ్లో.15:
సత్యం ప్రియము లోయి
కోపంలేని మాట  లోయి
అధ్యయనంజపాలోయి
కలిసి శ్రద్దగా చేసోవోయి
అదే"మాటల"తపస్సోయి

శ్లో.16:
ప్రసన్నం శాంతమోయి
సౌమ్యము మౌనమోయి
మనో నిగ్రహమోయి
శుద్ధభావాల ఆచరణోయి
అదే "మానసిక" తపస్సోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[21/03, 07:32] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం భావగానం14-16శ్లోకాలు

పరమాత్మ పలికెను:
మేను మాట మనసుల కోయి 
మేలు చేయు తపస్సు లోయి

శ్లో.14:
తపస్సులు మూడోయి
గురువు ద్విజులకోయి
దైవము జ్ఞానులకోయి
శ్రద్దగా చేసే సేవలోయి
శుభ్రత పవిత్రత లోయి
బ్రహ్మచర్య ఆచరణోయి
అదే"శరీర" తపస్సోయి

శ్లో.15:
సత్యము ఇష్టము లోయి
కోపంలేని పలుకు లోయి
అధ్యయనం   జపా లోయి
శ్రద్ద కలిసిన ఆచరణోయి
అదే"మాటల"తపస్సోయి

శ్లో.16:
ప్రసన్నం శాంతమోయి
సౌమ్యం మౌనమోయి
మనసు అదుపునోయి
మేలుభావాల ఆచరణోయి
అదే "మానసిక" తపస్సోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[22/03, 02:59] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం భావగానం17-19శ్లోకాలు

పరమాత్మ పలికెను:

సాత్విక రాజస తామస
గుణాల  తపస్సులోయి
అవి మూడు రకాలోయి

శ్లో.17:
ప్రతిఫలము ఆశించించకోయి
మనసా వాచా కర్మణానోయి
శ్రద్ధగా యోగి ఆచరించేదోయి
అది *సాత్విక* తపస్సోయి

శ్లో.18:
గౌరవ ఆడంబరాలకోయి
చేయు తపస్సోయి
క్షణాల ఫలమోయి
అది  *రాజస* తపస్సోయి

శ్లో.19:
 భాదించు  కొనుచోయి
పీడించు    కొనుచోయి
పరులకీడు కోరుచోయి
ఆచరించు తపస్సోయి
అది *తామస* తపస్సోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[22/03, 07:45] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం భావగానం17-19శ్లోకాలు

పరమాత్మ పలికెను:

సాత్విక రాజస తామస
గుణాల  తపస్సులోయి
అవి మూడు రకాలోయి

శ్లో.17:
ప్రతిఫలము కోర కుండోయి
మనసా వాచా కర్మణానోయి
శ్రద్ధగా యోగిలానోయి
ఆచరించు తపస్సోయి
అది *సాత్విక* తపస్సోయి

శ్లో.18:
గౌరవము గొప్పలకోయి
ఆచరించు తపస్సోయి
అది క్షణాల ఫలమోయి
అది *రాజస* తపస్సోయి

శ్లో.19:
 భాదించు  కొనుచోయి
పరులకీడు కోరుచోయి
ఆచరించు తపస్సోయి
అది *తామస* తపస్సోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[23/03, 15:03] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం భావగానం20-22శ్లోకాలు

పరమాత్మ పలికెను:

సాత్విక రాజస తామసాలోయి
దానాలు మూడు రకాలోయి

శ్లో.20:
ప్రతిఫలము కోర కోయి
బాధ్యతని అర్హులకోయి
తగు దేశకాలాలందోయి
అందించు దానమోయి
అది *సాత్విక* దానమోయి

శ్లో.21:
ప్రతిఫలము కోరుచోయి
ప్రత్యుపకారము కోరుచోయి
 అందించు దానమోయి
అది *రాజస* దానమోయి

శ్లో.22

అనర్హులకు చేయునదోయి
అనుచితమైనదోయి
తగని దేశకాలాలం దోయి
అందించు దానమోయి
అది *తామస* దానమోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[25/03, 08:25] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం భావగానం20-22శ్లోకాలు

పరమాత్మ పలికెను:

దానాలు మూడు రకాలోయి

శ్లో.20:
ప్రతిఫలము కోరనిదోయి
బాధ్యతని అర్హులకోయి
తగు దేశకాలాలందోయి
అందించు దానమోయి
అది *సాత్విక* దానమోయి

శ్లో.21:
ప్రతిఫలము ఆశించోయి
 అందించు దానమోయి
అది *రాజస* దానమోయి

శ్లో.22

అనర్హులకు దానమోయి
అనుచితమైన దోయి
తగని దేశ కాలాలందోయి
అందించు దానమోయి
అది *తామస* దానమోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[25/03, 17:30] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
 *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం భావగానం23-26శ్లోకాలు

పరమాత్మ పలికెను:

 దైవశక్తికి మూలాలోయి చిరునామాలు మూడోయి

శ్లో.23:
*ఓం తత్ సత్* లు
బ్రహ్మ నాదా లవోయి
చిరు దైవరూపాలోయి
వేదయాగాలిచ్చెనోయి
వేదాలు యాగాలనోయి
అవే అందించిన వోయి

శ్లో.24:
 అందువలనే *ఓం* అనుచోయి
తపసు దానాలు పూజలోయి
యాగాలు ప్రారంభింతురోయి

శ్లో.25:
ప్రతి ఫలము ఆశించకోయి
 లోకహితము ముక్తి కోయి
*తత్* అంతా నీవనుచోయి
దానతపోయాగాలు చేతురోయి

శ్లో.26:
సత్యం సద్భావమోయి
శుభం శాంతమోయి 
ప్రశంస గౌరవమోయి
నిజం పనులందోయి
దైవం వుండునోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
[27/03, 06:28] Syamala Rao SSSS: *శ్రద్ధా త్రయ విభాగ యోగం*       
 భగవద్గీత 17వ అధ్యాయం
 భావగానం23-end శ్లోకాలు

పరమాత్మ పలికెను:

శ్లో.23:
*ఓం తత్ సత్* లు
బ్రహ్మ నాదము  లోయి
చిన్న దైవరూపా లోయి
వేదాలు యాగాలనోయి
అవే  అందించె   నోయి

శ్లో.24:
 అందువలనే *ఓం* అనుచోయి
తపసు దానాలు పూజ లోయి
యాగాలు ప్రారంభింతు రోయి

శ్లో.25:
*తత్* అంతా నీవనుచోయి
ప్రతి ఫలము ఆశించకోయి
 లోకహితము ముక్తి కోయి
దానతపోయాగాలు చేతురోయి

శ్లో.26:
*సత్యం* సద్భావమోయి
శుభం శాంతమోయి 
ప్రశంస గౌరవమోయి
నిజం పనులందోయి
దైవం వుండునోయి

శ్లో.27:
తపస్సు దానాలు
 యాగాలందోయి
సత్యమే అసలైన
కల్యాణ స్థితోయి
దైవం  సేవలోయి
నిజం  సేవలోయి

శ్లో.28:
శ్రద్ద లేకుండా చేయు
యాగ తపోదానాలోయి
అవి *అసత్యా* లోయి
శ్రద్దలేని కార్యాలందోయి
శుభ ఫలముండదోయి
ఇలలోన పైలోకాలకోయి
 తగు ఫలముండదోయి

ఓం తత్  సత్
శ్రీమద్భాగవద్గీతా
 ఉపనిషత్తు లో
 శ్రద్ధా త్రయ విభాగ
 యోగమను 17వ
 అధ్యాయం సంపూర్ణం
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
  +91 99891 25191

భజగోవిందం భావగానం

[29/03, 16:51] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏
*భజగోవిందం*
తెలుగు భావ గానం
🙏🙏🙏🙏🙏🙏

1.
భజ గోవిందం
భజ గోవిందం
గోవింద భజనం
అంత్యకాలం దరి
పాండిత్యం రక్షించదు
2.
మూఢా ధనాశ ఏల
మంచి పని చేయాల
మనసా ఆ ఫలాల 
నీవు ఆనందించాల
3.
కామమే వికారము
పాలిండ్లకై తపనేల
అవి రక్త మాంసాలు
మరిమరి మరుపేల
4.
అందాలన్నీ క్షణికాలు
కామమే  ముంచును
రోగభాదలు  ఇచ్చును
బతుకంత శోకమవును
5.
నీ సంపాదన పైనే
నీవారి ఆశలుండును
నీసంపాదన లేనపుడు
నీక్షేమమైన అడుగరు

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామల రావుssss
సర్వం దైవార్పణమస్తు
[30/03, 14:34] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏
*భజగోవిందం*
తెలుగు భావ గానం
🙏🙏🙏🙏🙏🙏
పార్ట్ 2  ,శ్లో6-10

6.
ఉపిరున్న నాడోయి
కుశల మడిగేరోయి
ఊపిరాడని నాడోయు
దరిచేర భయపడేరోయి
7.
బాల్యమంతా ఆటలోయి
యౌవ్వనమంతా కాంతలోయి
ముదిమంతా  చింతలోయి
పరమాత్మ కై చింతలెపుడోయి
8.
భార్యా పిల్లలెవరోయి
సంసారమె విచిత్రమోయి
నీవెవరో ఎరుగవోయి
నిన్ను నీవు తెలియవోయి
9.
సత్సంగమే బంధాలుంచదోయి
మోహ బంధాలు వలదోయి
చంచలం పోవునోయి
నిశ్చలమే నీదగునోయి
అదే ముక్తి మార్గమోయి
10.
వృద్ధాప్యాన కామముండదోయి
నీరెండిన చెరువుండదోయి
ధనం తరిగిన
జనం వుండరోయి
జ్ఞానమున బంధాలుండవోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
వాట్సప్ +91 99891 25191
సర్వం దైవార్పణమస్తు
[30/03, 14:41] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏
*భజగోవిందం*
తెలుగు భావ గానం
🙏🙏🙏🙏🙏🙏
పార్ట్ 3  ,శ్లో11-15

11.
ధనజనయవ్వన గర్వాలోయి
ఇట్టే పోవు క్షణికాలోయి
మాయాలోకమిది
అంతా మాయెనోయి
బ్రహ్మను నీవు చేరాలోయి
12.
ఎండావానల కాలచక్రమోయి
మరలా తిరిగివచ్చునోయి
కాలాన వయసు పెరుగునోయి
ఆయువు తరుగునోయి
13.
కాంతా కనకాల చింతేలనోయి
మూడు లోకాలుదాటాలోయ
సత్సాంగమేదాటించోయి
14.
గడ్డాలు మీసాలున్నానోయి
కాషాయ బట్టలున్నానోయి
తెలిసీ పట్టించుకోని  వారోయి
వట్టి పగటి వేషాలవారోయి
15.
ముసలై శరీరం కుంగునోయి
పళ్లూజుత్తు వూడునోయి
కర్రే నడకకు తోడవునోయి
జీవుడా నీకు ఆశలేలనోయి

🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
వాట్సప్ +91 99891 25191
సర్వం దైవార్పణమస్తు
[30/03, 14:47] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భజగోవిందం*
తెలుగు భావ గానం
🙏🙏🙏🙏🙏🙏🙏
పార్ట్ 4  ,శ్లో16-20
16.
చలికి వణికే వోయి
వేడిని కోరేద వోయి
బతుకు భారమౌనోయి
ఆశలు నీవు వీడవోయి
17.
గంగా స్నానాలోయి
దాన ధర్మా లోయి
ఎన్ని చేసినానోయి
జ్ఞానమే మోక్షమార్గమోయి
18.
దైవములో వుండవోయి
నేలపై నిదురించ వోయి
భోగాలు వీడవలెనోయి
వైరాగ్యమే సుఖమోయి
19.
ఎక్కడున్నా నోయి
ఎలావున్నా నోయి
బ్రహంలో వుండోయి
అదే ఆనందమోయి
20.
కొంచెమైన గీతాపఠనమోయి
గంగాపానం దైవసేవలోయి
కొంచెమైన నరకముంచవోయి

🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
వాట్సప్ +91 9989125191
సర్వం దైవార్పణమస్తు
[30/03, 16:15] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*భజగోవిందం*
తెలుగు భావ గానం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పార్ట్ 5 , శ్లో21-25

21.
మళ్లీమళ్లీ పుట్టి చావాలోయి
అమ్మకడుపులో వుండాలోయి
ఈ సంసారమే బంధాలోయి
కృష్ణుడే నిను కాపాడాలోయి
22.
దొరికినదాంతో  తృప్తిచెందోయి
యోగికి పాపపుణ్యాలంటవోయి
పసివానిలా  ఆనందించునోయి
మనసు అదుపులో ఉంచునోయి
23.
నీవెవరు  ఎచటి వానివోయి
నీ తల్లి తండ్రులు ఎవరోయి
నిన్ను నీవు  తెలియాలోయి
కలలు భ్రమలు  వీడాలోయి
24.
అందరిలో దేవుడున్నాడోయి
శ్రద్దగా ఇది నీవు వినుమోయి
అంతా సమమని ఎరుగవోయి
అదే విష్ణు లోక మార్గమోయి
25.
పిల్లలు బంధువులేల నోయి
 స్నేహాలు కలతలేల నోయి
అందరిలో నినుచూడ వోయి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
వాట్సప్ +91 9989125191
సర్వం దైవార్పణమస్తు
[04/04, 05:29] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భజగోవిందం*
  భావ గానం
🙏🙏🙏🙏🙏🙏🙏
పార్ట్ 6 , శ్లో26-31(end)

26.
కామం కోపం స్వార్ధం
 మోహం వీడుమోయి
ఆత్మజ్ఞానం నీతోడోయి
నరకం నీదరి రాదోయి
27.
కొంచెం కొద్ధి గానోయి
భవద్గీత జ్ఞానమోయి
దైవ చింతన తోడోయి
మంచివారి చెంతోయి
దీనులందు దయోయి
మదిలో వుండాలోయి
28.
కాంతల  కామాలోయి
రోగాల   బాధలవోయి
పుట్టిపోవు బతుకోయి
పాపాల  పుట్టవకోయి
29.
ధనమే చెడుపు నోయి
 అది నీవు మరువకోయి 
నిజసుఖము కాదోయి
డబ్బుకై పరుగేలనోయి
పుత్రులను చూసోయి
ధనకునికి భయమోయి
30.
నిత్యం యోగ సాధనం
వీడకు ప్రాణాయామం
జపమే వివేక మార్గం
ఆహార నియమానోయి
నిత్యం యోగివవోయి
31.
గురుపాదాలు వీడకోయి
గురుభక్తి కాపాడునోయి
ఇంద్రియాల కోరికలోయి
అదుపులో వుంచవోయి
దేవుని నీవు చేరెదవోయి

ఇది భజగోవిందం
శంకరాచార్య ప్రభోదం
 భావ గానం సంపూర్ణం

🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:శ్యామలరావుssss
వాట్సప్ +91 9989125191
సర్వం దైవ సమర్పణం