12, నవంబర్ 2017, ఆదివారం

అచ్యుతాష్టకమ్ భావగానం

[29/10, 5:02 PM] Syamala Rao SSSS: 🙏 *అచ్యుతాష్టకమ్* 1🙏
మూలం:ఆది శంకరాచార్యులు
భావగానం:శ్యామలరావుssss
+91 9989125191

*అచ్యుతం కేశవం*
ప్రళయాన నశించడోయి
శేషనాగ శయనుడోయి
 *రామ నారాయణం*
రామనారాయణుడోయి
 *కృష్ణ దామోదరం*
నల్ల దామోదరుడోయి
 *వాసుదేవం హరిమ్*
వసుదేవ సుతుడోయి
పాపాలు హరించువాడోయి
*శ్రీధరం మాధవం*
లక్ష్మీపతి మాధవుడోయి
 *గోపికా వల్లభం*
గోపికా నాయకుడోయి
 *జానకీ నాయకం*
ఆ సీతాపతిని 
*రామ చన్ద్రం భజే*
రామచంద్రుని కీర్తింతుమోయి
🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణం
[30/10, 6:27 PM] Syamala Rao SSSS: 🙏 *అచ్యుతాష్టకమ్* 2🙏
మూలం:ఆది శంకరాచార్యులు
భావగానం:శ్యామలరావుssss
+91 9989125191

*అచ్యుతం కేశవం*
ప్రళయాన జీవించు
       శేషనాగ శయనా
 *సత్యభామాధవం*
       సత్యభామ మాధవా
 *మాధవం శ్రీధరం*
      మాధవా  శ్రీధరా
 *రాధికారాధితమ్*
      రాధా ఆరాధితా
*ఇందిరా మందిరం*
      లక్ష్మి నిలయా
*చేతసా సున్దరం*
      మది సుందరా
*దేవకీ నన్దనం*
      దేవకీ నందనా
*నన్దనం సన్దధే*2
       ఆనందం ధ్యాయే

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణం
[31/10, 5:00 PM] Syamala Rao SSSS: 🙏 *అచ్యుతాష్టకమ్* 3🙏
మూలం:ఆది శంకరాచార్యులు
భావగానం:శ్యామలరావుssss
+91 9989125191

*విష్ణవే  జిష్ణవే* 
      విశ్వనిలయే జయశీలే
*శఙ్ఖినే  చక్రిణే*
      శంక చక్ర హస్తే 
*రుక్మినీరాగిణే*
      రుక్మినీనాధే
*జానకీ జానయే*
      జానకీ నాయకే
 *వల్లవీవల్లభా*
      గోపికావల్లభా
*యాఽర్చితాయాత్మనే*
      గోపార్చితదేవా
*కంసవిధ్వంసినే*
       కంస సంహారినే
*వంశినే తే నమః*3
       గోపవంశే నమః

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణం
[01/11, 9:45 AM] Syamala Rao SSSS: 🙏 *అచ్యుతాష్టకమ్* 4🙏
మూలం:ఆది శంకరాచార్యులు
భావగానం:శ్యామలరావుssss
+91 9989125191

*కృష్ణ గోవిన్ద హే రామ*
      కృష్ణ గోవింద సీతాపతే
*నారాయణ  శ్రీపతే*
     శ్రీమన్నారాయణ శ్రీపతే
*వాసుదేవాజిత శ్రీనిధే*
     వాసుదేవ జయ శ్రీనిధే
*అచ్యుతానన్త హే*
     శాశ్వితా అనంతనిధే
*మాధవాధోక్షజ*
    మాధవా భూలోకరక్షకా
*ద్వారకానాయక*
     ద్వారకా పాలకా
*ద్రౌపదీరక్షక*4
     ద్రౌపదీరక్షకా.4

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణం

సహస్రనామ స్తోత్రము* - సరళభావగానం 91- 95 శ్లోకాలు

🙏 *లలితా సహస్రనామ స్తోత్రము*
-  సరళభావగానం  91- 95  శ్లోకాలు

శ్యామలరావుssss +919989125191

*తత్వాసనా తత్వమయీ*
*పంచకోశాంతరస్థితా*|
*నిస్సీమ మహిమా*
*నిత్యయౌవనా మదశాలినీ* 91

ఓం 'తత్' సత్ భావం
నీవే పరమాత్మ ఆసనం
పంచ ప్రాణాల మధ్యస్తం
నీ మహిమలు అనంతం
నిత్యయవ్వన రూపశీలం

*మదఘూర్ణిత రక్తాక్షీ*
*మదపాటల గండభూ*
*చందన ద్రవ దిగ్ధాంగీ*
*చాంపేయ కుసుమ ప్రియా* 92

 ఎరుపు వెలుగుల  కనులు
 ఎరుపు మెరుపుల చెంపలు
ఆనంద రసాల అందాలు
చందన చర్చిత అంగాలు
 పుష్ప ప్రియం సంపెంగలు
ప్రియ పుష్పాలు సంపెంగలు
*కుశలాకోమలాకారా*
*కుకుళ్ళా కుళేశ్వరీ*
*కుళకుండలయా కౌల*
*మార్గ తత్పర సేవితా*93

కుశలం కౌశలం కోమలం
సకల కుటుంబ ఈశ్వరీం
బంధుకుటుంబ సేవితాం

*కుమార గణనాథాంబా*
 *తుష్టిః పుష్టి ర్మతి ర్ధృతిః*
*శాంతి స్వస్తి మతీ కాంతి*
*ర్నందినీ విఘ్ననాశినీ*94

 కుమార గణేషుల మాతా
 తృప్తి పుష్టిః స్వరూపా
బుద్ధి ధైర్య శాంతిరూపా
స్వస్తి రూప మనోలక్షణీ
కాంతిమతి ఆనందిని
సకల విఘ్న నాశనీ .

*తేజోవతీ త్రినయనా*
*లోలాక్షీ కామరూపిణీ*
*మాలినీ హంసినీ మాతా*
*మలయాచల నివాసినీ*95

 తేజోమయీ త్రిలోచనీ
లోకమాతా కామరూపీణి
పూలమాలా ధారిణి
మాతా శ్వాసలఊపిరీ
మలయాద్రి నివాసినీ
🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా

లలితా సహస్రనామ స్తోత్రము భావగానం 106 – 110 శ్లోకాలు

🙏 *లలితా సహస్రనామ స్తోత్రము* -  భావగానం
శ్యామలరావుssss
106 – 110 శ్లోకాలు

*మూలాధారంభుజారుడా*
 *పంచవక్త్రాస్థి సంస్థితా*
*అంకుశాదిప్రహరణా*
*వరదాది నిషేవితా*106

మూలాధార చక్ర దేవి
పంచ  ముఖాలదేవి
అస్థికల  ఆశ్రయదేవి
అంకుశాది ఆయుధ దేవి .
వరదాయిని దేవసేవితా

*ముద్గౌదనాసక్తాచిత్తా*
*సాకిన్యాంబా స్వరూపిణీ*
*అజ్నాచక్రాబ్జ నిలయా*
 *శుక్లవర్ణా షడాసనా*107

 పులగం ప్రసాద ప్రియా
 సాకినీ రూప మాతా
 ఆజ్ఞా చక్ర  నిలయా
తెలుపు ఛాయ దేవి
ఆరు ముఖాల దేవి


*మజ్నాసంస్థా హంసవతీ*
*ముఖ్యశక్తి సమన్వితా*
*హరిద్రాన్నైకరసికా*
*హాకినీరూప ధారిణీ*108

మజ్జా ధాతు నిలయా
పచ్చని ప్రసాద ప్రియా
హాకినీ రూప  దేవతా
హంసదేవి ముఖ్యదేవి
క్షమాదేవి సమన్వితా

*సహస్రదళ పద్మస్థా*
 *సర్వవర్ణోపా శోభితా*
*సర్వాయుధధరా శుక్ల*
*సంస్థితా సర్వతోముఖి* 109

 సహస్రార చక్ర నిలయా
సకల రంగుల  శోభితా
సకల ఆయుధ ధారిణిి
సకల క్రియా సిద్ధదేవి
శుక్ల  ఆశ్రయిమాతా

*సరౌదన ప్రీతచిత్తా*
*యాకిన్యంబా స్వరూపిణీ*
*స్వాహా స్వధా మతిర్మేధా*
*శ్రుతిః స్మృతిరనుత్తమా* 110

సకల ప్రసాద ప్రియా
యాకినీ దేవి రూపా
 ఆహ్వాన స్వాగతా
 ధారణ  స్వాగతా
 అబుద్ధి బుద్ధి దేవీ
మేధా చతుర  దేవి
విన్నవి చూచినవి
గుర్తుంచు శక్తి దేవి
ఉత్తమ మాతవుదేవి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా

లలితా సహస్రనామ స్తోత్రం* భావగానం 116–120 శ్లోకాలు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*లలితా సహస్రనామ స్తోత్రం* 
భావగానం 116–120 శ్లోకాలు
శ్యామలరావుssss
+91 99891 25191


*పరాకాష్ట పరానిష్ఠా*
*ప్రజ్నాన ఘనరూపిణీ*
*మాధ్వీపానా లసా మత్తా*
 *మాతృకావర్ణ రూపిణీ*116

 అతీత శక్తుల దేవి
అతీత శక్తుల నిష్ఠా
సర్వాంతర్యామిని
సర్వము చూచుదేవి
జ్ఞాన రూపిణి దేవి
మధుపాన అలసతా
నిత్య పరవశి మాతా
సకల రంగులశోభితా

*మహాకైలాస నిలయా*
*మృణాళ మృదుదోర్లతా*
*మహనీయా దయామూర్తి*
 *ర్మహాసాంరాజ్యశాలినీ*117

మహాకైలాస నిలయా
కమల కోమల భుజా
దయామయి మహనీయా
పరబ్రహ్మ రాజ్యపాలికా

*ఆత్మవిద్యా మహా విద్యా*
 *శ్రీవిద్యా కామసేవితా*
*శ్రీషోడశాక్షరీభూత*
*త్రికుటా కామకోటికా*118

ఆత్మవిద్యా   స్వరూపిణి
మహావిద్యా  స్వరూపిణి
శ్రీవిద్యా        స్వరూపిణి
షోడశాక్షరీ    స్వరూపిణి
త్రికూటమంత్ర స్వరూపిణి
కామసేవితా  కామరూపిణీ

*కటాక్షకింకరీభూత*
*కమలా కోటిసేవితా*
*శిరస్థితా చంద్రనిభా*
*పాలస్థేంద్రా ధనుఃప్రభా* 119

భక్త కోటి జన కటాక్షిణీ
భక్త జన సేవక దేవీ
తలపై కిరీటం చంద్ర ప్రకాశినీ
నుదురుపై నివాసినీ
ఇంద్రధనుస్సు ప్రకాశినీ

*హృదయస్థా రవిప్రఖ్యా*
 *త్రికోణాంతర దీపికా*
*దాక్షాయిణీ దైత్యహంత్రీ*
 *దక్షయజ్న నివాసినీ*120

 హృదయ  నివాసిని
సూర్య సమ ప్రకాశిని
త్రిభుజ మద్య నివాసిని
త్రికోణ మధ్య ప్రకాశిని
దక్షపుత్రి దక్షయాగనాశిని
రాక్షస సంహరిణి

 🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీలలితార్పణం స్వాహా

2, అక్టోబర్ 2017, సోమవారం

Rudra kavacham

🙏🙏🙏🙏🙏🙏
 *రుద్ర కవచం*
*సరళ భావ గానం*
 🙏🙏🙏🙏🙏🙏
మూలం: వేదం
రచన :శ్యామలరావుssss

1.దుర్వాస ముని పలికెను:
దేవా మీకు శిరసా వందనం
స్వయముగ పుట్టిన ఈశ్వరం
సర్వము నీవైన ఏకైక  దైవం
సర్వదేవ రూపం పరమేశ్వరం

*రుద్ర కవచం*
*దుర్వాస ఉవాచ:-*
*1.  శ్లో:-*
*ప్రణమ్యామి శిరసా దేవం*
*స్వయంభుం పరమేశ్వరం.*
*ఏకం సర్వ గతం దేవం*
*సర్వ దేవ మయం విభుం.*

2. పలికేను నేను రుద్ర కవచం
 అంగ ప్రాణాల రక్షణా కవచం
 పగలురాత్రుల దేవుని కవచం
 అతి పురాతన రక్షా కవచం

*2.  శ్లో:-*
*రుద్ర వర్మ ప్రవక్షామి*
*అంగ ప్రాణస్య రక్షయే.*
*అహో రాత్ర మయం దేవం* *రక్షార్థం నిర్మితం పురా.*

ముందుండి నను రుద్రుడు రక్షించు గాక
ముఖము  మహేశ్వరుడు
రక్షించు గాక
నా తలను ఈశ్వరుడు
రక్షించు గాక
నుదురు నీలలోహితుడు
రక్షించు గాక

*3.  శ్లో:-*
*రుద్రో మే చాగ్రతః పాతు* *ముఖం పాతు మహేశ్వరః*
*శిరో మే యీశ్వరః పాతు* *లలాటం నీలలోహితః*

4.కనులను ముక్కంటి
రక్షించు గాక
ముఖము  మహేశ్వరుడు
రక్షించు గాక
చెవులు శంభుడు
రక్షించు గాక
ముక్కును సదా శివుడు
రక్షించు గాక
*4.  శ్లో:-*
*నేత్రయోస్త్రయంబకః పాతు*
 *ముఖం పాతు మహేశ్వరః*
*కర్ణయోః పాతుమే* *శంభుర్నాసికాయాం* *సదాశివః.*

5.నా నాలుకను వాగీశుడు
రక్షించు గాక
నా పెదాలు అంబికాపతి
రక్షించు గాక
నా కంఠము  నీలకంఠుడు
రక్షించు గాక
నా భుజాలు పినాకపాణి
రక్షించు గాక

*5.  శ్లో:-*
*వాగీశః పాతు మే జిహ్వా* *మోష్ఠా పాతంబికాపతిః*
*శ్రీ కంఠః పాతు మే గ్రీవాం* *బాహూంశ్చైవ పినాక ధృత్.*


  1. ఇటువంటి మరిన్నిభావ గానాల కోసం  గూగుల్ లో సెర్చ్ చేయండి " syamalaraossss.blogspot"

23, సెప్టెంబర్ 2017, శనివారం

Sivoham sivoham

[23/09, 8:04 PM] Syamala Rao SSSS: 🙏  *రామాయణం*  🙏
యుద్ధకాండ సర్గ102- శ్లో13

శ్రీరాముని శ్లోకం యుద్ధమున
లక్ష్మణుడు పడిపోయినపుడు

   *దేశే   దేశే   కళత్రాణి*
  *దేశే దేశే  చ   బాంధవాః*
  *తం తు దేశం న పశ్యామి*
 *యత్ర  భ్రాతా సహోదరః*

  భావ గానం
*దేశ దేశా లందోయి*
*అక్కడ బంధువు లుంటారోయి*
*దేశ దేశా లందోయి*
*ఎక్కడ సహోదరు లుంటారోయి*
 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[23/09, 8:04 PM] Syamala Rao SSSS: 🙏 *శివోహం శివోహం*🙏

రచన:ఆది శంకరాచార్యులు
భావ గానం: శ్యామలరావు

*న మే ద్వేష రాగౌ*
*న మే లోభ మోహౌ*
*మదో నైవ మే నైవ*
 *మాత్సర్యభావః*
*న ధర్మో న చార్థో*
*న కామో న మోక్షః*
*చిదానందరూపః*
*శివోహం శివోహం*
🙏🙏🙏🙏🙏🙏🙏

*లేవు నాలో రాగ ద్వేషాలు*
*లేవు నాలో లోభ మోహాలు*
*లేవు నాలో కామమోక్షాలు*
*లేవు నాలో మదమత్సాలు*
*లేవు నాలో ధర్మ అర్దాలు*

*నేనే చిదానందరూపం*
*నేనే శివం నేనే శివం*

🙏🙏🙏🙏🙏🙏🙏
[23/09, 8:04 PM] Syamala Rao SSSS: |
🙏 *శివోహం శివోహం*🙏
     (నిర్వాణషట్కమ్ -5)
రచన:ఆది శంకరాచార్యులు
భావ గానం: శ్యామలరావు

 *మృత్యుశంకా న*
 *మే జాతిభేదః*
*పితా నైవ మే నైవ*
 *మాతా న జన్మ*
*న బంధుర్న మిత్రం*
 *గురుర్నైవ శిష్యః*
*చిదానందరూపః*
*శివోహం శివోహమ్*
🙏🙏🙏🙏🙏🙏

భావగానం:
*నాకు చావు శంకా లేదు*
*నాకు జాతి తేడా లేదు*
*నాకు జననము  లేదు*
*నాకు అమ్మనాన్నలేరు*
*నాకు బంధుమిత్రులు లేరు*
*నాకు గురు శిష్యులు లేరు*
*నేనే చిదానందరూపం*
*నేనే శివం నేనే శివం*
🙏🙏🙏🙏🙏🙏🙏

5, సెప్టెంబర్ 2017, మంగళవారం

శ్రీరుద్రం భావగానం అనువాకం 7,8

[05/09, 5:20 PM] Syamala Rao SSSS: 🙏 *శ్రీ రుద్రం* 🙏
తెలుగు భావ గానం
మూలం: యజుర్వేదం
అనువాకము 7

*యుద్ధభేరి నాధ రూపునకు*
*శత్రు భయంకరరూపునకు*
*శత్రుఅంచనా సమర్థునకు*
*రాయబారి  రూపునకు*
 *రాజహిత  రూపునకు*
*బాణాల పొది కత్తికల*
*రుద్రునకు వందనం*

*పదునైన ఆయుద రూపునకు*
*మేలుచేయు విలుకానికి*
*రుద్రునకు వందనం*

*కాలిబాట నడిచే రుద్రునకు*
*రాజమార్గాన రుద్రునకు*
*నీరు సెలయేళ్ళరూపునకు*
*రుద్రునకు వందనం*

*నీటికొలను , బురద రూపునకు*
*నీటిబావులు రసాల రూపునకు*
*తెల్లమేఘాల వానమేఘాల రూపునకు*
*మెరుపుల మేఘాల రూపునకు*
*రుద్రునకు వందనం*

*నల్ల మేఘాల ఎండ మేఘాల రూపునకు*
*గాలివానల మేఘాల రూపునకు*
*ప్రళయకాల జల రూపునకు*
*గోవులు గృహాలు కాపాడు*
*రుద్రునకు వందనం*


అనువాకము 7 సమాప్తము

  భక్తి భావగానాలు కోసం   లింక్ ను టచ్ చేయండి
Syamalaraossss.blogspot.in
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[05/09, 9:38 PM] Syamala Rao SSSS: 🙏 *శ్రీరుద్రం*🙏
మూలం : యజుర్వేదం
నమకం అనువాకము 8.
తెలుగు భావ గానము
1)
*సోమునకువందనం*
 *రుద్రునకు వందనం*
2)
*రాగి రంగు రక్త రంగు*
*రుద్రునకు వందనం*
3)
*పుణ్యపతికి పశుపతికి*
*రుద్రునకు వందనం*
4)
*ఉగ్రరూపునకు*
 *భీమరూపునకు*
*రుద్రునకు వందనం*
5)
*ఎదురుగా ఉన్న*
*దూరాన ఉన్న*
*వారిని వధించు*
*రుద్రునకు వందనం*
6)
*దగ్గరగా వున్న*
*దూరాన వున్న*
*వారిని వధించు*
*రుద్రునకు వందనం*
7)
*వృక్షాల రూపునకు*
*ఆకుల రూపునకు*
*రుద్రునకు వందనం*
8)
*ఓం కార రూపునకు*
*రుద్రునకు వందనం*
9)
 *సుఖ కారకరూపుడు*
*లోకసుఖ భావకుడు*
*రుద్రునకు వందనం*
10)
 *లోకిక సుఖ రూపునకు*
*మోక్ష సుఖ రూపునకు*
*రుద్రునకు వందనం*

11)
 *కల్యాణ స్వ రూపునకు*
*కల్మషరహిత రూపునకు*
*రుద్రునకు వందనం*
12)
*పుణ్య తీర్ధాల రూపునకు*
*నదీతీర లింగ రూపునకు*
 *రుద్రునకు వందనం*

13)
*సంసార మోక్ష రూపునకు*
*సంసార సాగర మీదించు*
 *రుద్రునకు వందనం*

14)
*తత్వా జ్ఞాన రూపునకు*
*మంత్ర జప రూపునకు*
 *రుద్రునకు వందనం*

15)
*జీవన గమన రూపునకు*
*జీవ కర్మఫల రూపునకు*
*రుద్రునకు వందనం*
16)
*నదీతీర గరిక రూపునకు*
*నదీతీర నురగరూపునకు*
*రుద్రునకు వందనం*
17)
*ఇసుక రూపునకు*
*ప్రవాహ రూపునకు*
*రుద్రునకు వందనం*

 అనువాకము 8. సంపూర్ణం
సర్వం శివార్పణం స్వాహా