12, నవంబర్ 2017, ఆదివారం

లలితా సహస్రనామ స్తోత్రము భావగానం 106 – 110 శ్లోకాలు

🙏 *లలితా సహస్రనామ స్తోత్రము* -  భావగానం
శ్యామలరావుssss
106 – 110 శ్లోకాలు

*మూలాధారంభుజారుడా*
 *పంచవక్త్రాస్థి సంస్థితా*
*అంకుశాదిప్రహరణా*
*వరదాది నిషేవితా*106

మూలాధార చక్ర దేవి
పంచ  ముఖాలదేవి
అస్థికల  ఆశ్రయదేవి
అంకుశాది ఆయుధ దేవి .
వరదాయిని దేవసేవితా

*ముద్గౌదనాసక్తాచిత్తా*
*సాకిన్యాంబా స్వరూపిణీ*
*అజ్నాచక్రాబ్జ నిలయా*
 *శుక్లవర్ణా షడాసనా*107

 పులగం ప్రసాద ప్రియా
 సాకినీ రూప మాతా
 ఆజ్ఞా చక్ర  నిలయా
తెలుపు ఛాయ దేవి
ఆరు ముఖాల దేవి


*మజ్నాసంస్థా హంసవతీ*
*ముఖ్యశక్తి సమన్వితా*
*హరిద్రాన్నైకరసికా*
*హాకినీరూప ధారిణీ*108

మజ్జా ధాతు నిలయా
పచ్చని ప్రసాద ప్రియా
హాకినీ రూప  దేవతా
హంసదేవి ముఖ్యదేవి
క్షమాదేవి సమన్వితా

*సహస్రదళ పద్మస్థా*
 *సర్వవర్ణోపా శోభితా*
*సర్వాయుధధరా శుక్ల*
*సంస్థితా సర్వతోముఖి* 109

 సహస్రార చక్ర నిలయా
సకల రంగుల  శోభితా
సకల ఆయుధ ధారిణిి
సకల క్రియా సిద్ధదేవి
శుక్ల  ఆశ్రయిమాతా

*సరౌదన ప్రీతచిత్తా*
*యాకిన్యంబా స్వరూపిణీ*
*స్వాహా స్వధా మతిర్మేధా*
*శ్రుతిః స్మృతిరనుత్తమా* 110

సకల ప్రసాద ప్రియా
యాకినీ దేవి రూపా
 ఆహ్వాన స్వాగతా
 ధారణ  స్వాగతా
 అబుద్ధి బుద్ధి దేవీ
మేధా చతుర  దేవి
విన్నవి చూచినవి
గుర్తుంచు శక్తి దేవి
ఉత్తమ మాతవుదేవి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి