12, నవంబర్ 2017, ఆదివారం

లలితా సహస్రనామ స్తోత్రము భావగానం 1-40 శ్లోకాలు

[21/10, 2:59 PM] Syamala Rao SSSS: 🙏 *లలితా సహస్రనామ స్తోత్రము* 1-5🙏

 భావ గానము
రచన:శ్యామలరావుssss

*1- 5  శ్లోకాలు*

*ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ,*
 *శ్రీమత్సింహాసనేశ్వరీ*|
*చిదగ్నికుండ సంభూతా,*
 *దేవకార్య సముద్యతా*1

ఓం శ్రీమాతా శ్రీమహారాణీ
శ్రీ మహా సింహాసనేశ్వరీ
చైతన్య యాగ సంభవి
దేవకార్యాలకై పుట్టితివి

*ఉద్యద్భాను సహస్రాభా,*
 *చతుర్బాహు సమన్వితా*
*రాగస్వరూప పాశాడ్యా,*
 *క్రోధాకారాంకుశోజ్జ్వలా  2*

 వేలాది సూర్యుల ప్రకాశా
 నాలుగు చేతుల మాతా
 అనురాగ స్వరూప పాశా
 కోప అంకుశాల జ్వాలా

*మనో రూపేక్షు కోదండా*
 *పంచతన్మాత్ర సాయకా*
*నిజారుణ ప్రభాపూర*
*మజ్జద్బ్రహ్మాండ మండలా3*

 తీపి మది రూప చెఱకు విల్లు
తన్మాత్రల రూప పంచబాణాలు
అరుణకాంతుల సహజ రూపం
బ్రహ్మాండ జగ మండల  రూపం

*చంపకాశోక పున్నాగ*
 *సౌగంధిక లసత్కచా*
*కురువింద మణిశ్రేణీ*
 *కనత్కోటీర మండితా4*

 సంపంగి అశోక పున్నాగ
 చెంగల్వ పూవుల శిరోజా
 కలువల వరసల శోభితా
మణుల కాంతుల  కిరీటా


*అష్టమీ చంద్రవిభ్రాజ*
*దళికస్థల శోభితా*
*ముఖచంద్ర కళాంకాభ*
 *మృగనాభి విశేషకా 5*

 అష్టమి  చంద్ర కాంతాం
 సుందర వదన మాతాం
 నుదుట కస్తురి విశేషాం
 చంద్ర  వదన  శోభితాం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా
[22/10, 3:42 PM] Syamala Rao SSSS: డ్రాఫ్ట్
🙏
 *లలితా సహస్రనామ స్తోత్రము*11-15

భావగానము
రచన:శ్యామలరావుssss

*నిజసల్లాప మాధ్య్ర్య*
*వినిర్భర్విత కచ్ఛపీ*
*మందస్మిత ప్రభాపూర*
 *మజ్జత్కామేశ మానసా*11

తియ్యని పలుకుల మాటల
'కచ్ఛపి'వీణ నామధారిణి
 చిరునవ్వుల  కాంతుల
  శివుని పైమది నిండినది


*అనాకలిత సాదృశ్య*
 *చుబుక శ్రీ విరాజితా*
*కామేశబద్ధ మాంగల్య*
*సూత్రశోభితకంధరా*12

 పోలిక దొరకని  గడ్డం
కాంతి శోభల ప్రకాశం
మెడలో పరమశివబంధం
పవిత్ర మంగళసూత్రం

*కనకాంగద కేయూర*
 *కమనీయ భుజాన్వితా*
*రత్నగ్రైవేయ చింతాకలోల*
*ముక్తాఫలాన్వితా*
13
 భుజాల బంగారు వంకీలు
రత్నాలనగల అలంకారాలు 
కదిలే   ముత్యాల హారము
కంఠాన చింతాకు హారము

*కామేశ్వర ప్రేమరత్న*
*మణి ప్రతిపణస్తనీ*
*నాభ్యాలవాల రోమాళి*
*లతాఫల కుచద్వయీ* 14

 కామేశ్వర  ప్రేమ రత్నాకరి
 ప్రియ మణి హృదయస్తనీ
 జంట  ఫలాల   భుజాలు
 లతాతీగ నూగారు బొడ్డు

*లక్ష్యరోమ లతాధారతా*
*సమున్నేయ మధ్యమా*
*స్తనభార దళన్మధ్య*
*పట్టబంధవళిత్రయా*15

 మధ్యలో తీగ నడుము
 వక్షోభార మధ్య పట్టీలు
 మూడు పట్టు మడతలు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా
[23/10, 7:51 AM] Syamala Rao SSSS: 🙏 *లలితా సహస్రనామ స్తోత్రము*6-10🙏

భావగానము
రచన:శ్యామలరావుssss

(అమ్మవారి  సౌందర్య వర్ణన)

*వదనస్మర  మాంగల్య*
 *గృహతోరణ చిల్లికా |*
*వక్త్రలక్ష్మీ పరీవాహ*
*చలన్మీనాభ లోచనా  6*

శుభమంగళ తోరణాలు
అందాల   కనుబొమలు
సుందర సిరి  సంపదలు
చలనాల చేపల కనులు

 *నవచంపక పుష్పాభ*
 *నాసాదండ విరాజితా*
*తారాకాంతి తిరస్కారి*
 *నాసాభరణ భాసురా 7*

అందాల మోమున ముక్కు
కొత్త సంపెంగలా వెలిగేను
ముక్కుబులాకి వెలుగులు
తారల కాంతులు మించెను

*కదంబ మంజరీ క్లుప్త*
*కర్ణపూర మనోహరా |*
*తాటంక యుగళీభూత*
*తపనోడుప మండలా 8*

కదంబ పూల  సరాలు
చెవుల  చెంప స్వరాలు
చెవుల జంట జూకాలు
మనోహర మండలాలు
సూర్య చంద్ర  తేజాలు

*పద్మరాగ శిలాదర్శ*
*పరిభావి కపోలభూః*
*నవవిద్రుమబింబ శ్రీ*
*న్యక్కారి రదనచ్ఛదా 9*

 పద్మాల ఎరుపులను
పరిహసించు బుగ్గలు
పగడాల ఎరుపులను
 పరిహసించు పెదాలు

*శుద్ధ విద్యాంకురాకార*
 *ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా*
*కర్పూరవీటికామోద*
 *సమాకర్షద్దిగంతరా 10*

నిర్మల  విద్యారంభ  రూపిణి
జంట  పలువరుసల శోభిణి
కర్పూరతాంబూల సువాసిని
అనంత  లోకాల సమాకర్షిణి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా
[23/10, 9:19 PM] Syamala Rao SSSS: 🙏 *లలితా సహస్రనామ స్తోత్రము*16-20🙏
 (అమ్మవారి  సౌందర్య వర్ణన)
భావగానము
రచన:శ్యామలరావుssss

*అరుణారుణ కౌసుమ్భ*
*వస్త్రభాస్వత్కటీతటీ*
*రత్నకింకిణికారమ్య*
 *రశనా దామ భూషితా*16

 సూర్యోదయ ప్రకాశము
నడి  వస్త్ర    ప్రాంతము
మణిగంటల గొలుసులు
ఒడ్డాణ    ఆలంకారాలు

*కామేశజ్ఞాత సౌభాగ్య*
 *మార్దవోరుద్వయాన్వితా*
*మాణిక్య మకుటాకార*
 *జానుద్వయ విరాజితా*17

 కామేశ్వరుడే ఎరిగిన
 సౌభాగ్యమైన మేను
 మాణిక్య  కిరీటము
 మోకాళ్ల  ప్రకాశము

*ఇంద్రగోప పరిక్షిప్త స్మర*
*తూణాభ జంఘికా*
*గూఢగుల్ఫా, కూర్మపృష్ఠ*
 *జయిష్ణు ప్రపాద్వితా*18

  మన్మధుని    బాణాలు
  పాదాలు చీలమండలు
  తాబేలువీపు నునుపులు
 సుందర పాదాల చివరలు

*సఖదీధితి సన్ఛన్న*
*సమజ్జన తమోగుణా*
*పదద్వయ ప్రభాజాల*
 *పరాకృత సరోరుహా*19

 కాలి  గోళ్ళ  కాంతులు
 తొలిగించు అజ్ఞానాలు
 జంట పాదాల  పక్కన
పూజలందిన పద్మాలు

*శింజానమణి మంజీర*
 *మండిత శ్రీ పదాంబుజా*
*మరాళీ మందగమనా*
*మహాలావణ్య శేవధిః*20

 మణుల గజ్జెల  సవ్వడులు
అందాల పద్మాలు పాదాలు
హంస నడకల సోయగాలు
అతిశయాల  ఆనందనిధులు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా
[25/10, 8:48 AM] Syamala Rao SSSS: 🙏 *లలితా సహస్రనామ స్తోత్రము*21-25🙏
భావగానము
రచన:శ్యామలరావుssss

*సర్వారుణా,అనవద్యాంగీ,*
 *సర్వాభరణ భూషితా*
*శివకామేశ్వరాకంధా*
*శివా,స్వాధీన వల్లభా*21

 అంతా అరుణ  ప్రకాశం
 తేడాలేని సుందరరూపం
 సకల అలంకార శోభితం
 కామేశ్వరుని వడి స్థానం
 నీవే శివం,శివుడే నీవశం


*సుమేరు శృంగ మధ్యస్థా,*
*శ్రీమన్నగర నాయికా*
*చింతామణి గృహాంతఃస్థా*
 *పంచ బ్రహ్మాసన స్థితా*22

 మేరుపర్వత మధ్య ప్రాంతం
 శ్రీమన్ నగర  వాసనాయకీం
 మణి కాంతుల నివాసినీం
 పంచ బ్రహ్మల సింహాసనీం

*మహాపద్మాటవీ సంస్థా,*
*కదంబ వనవాసినీ*
*సుధాసాగర మధ్యస్థా*
*కామాక్షీ, కామదాయినీ*23

 మహాపద్మాల వనాలలో
 కడిమి చెట్ల వన వాసిని
 సుధా సాగరము మధ్యన
 కోరిన వరాలీయు కామాక్షిి

*దేవర్షిగణ సంఘాత*
*స్తూయమానాత్మ వైభవా*
*భండాసుర వధోద్యుక్త*
*శక్తి సేనాసమన్వితా*24

 దేవతలు ముని బృందాలు
 కీర్తించేరు దేవి   వైభవాలు
భండాసుర సంహారమున
దేవసేనల శక్తి గానిలిచావు

*సంపత్కరీ సమారూడ*
 *సింధుర వ్రజ సేవితా*
*అశ్వారూఢా ధిష్ఠితాశ్వ*
*కోటి కోటిభిరావృతా*25

సంపత్కరిదేవి  ఏనుగు నెక్కేను
ఏనుగుల గుంపులు సేవించేను
అశ్వాదేవి గుర్రము   నెక్కేను
కోటి కోట్ల గుర్రాలు  సేవించేను

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా
[26/10, 9:42 AM] Syamala Rao SSSS: 🙏 *లలితా సహస్రనామ స్తోత్రము* 🙏
భావగానము 26 – 30 శ్లోకాలు
రచన :శ్యామలరావు ssss

*చక్రరాజ రథారూఢ*
*సర్వాయుధ పరిష్కృతా*
*గేయచక్ర రథారూఢ*
 *మంత్రిణీ పరిసేవితా*26

 'చక్రరాజ'  రథము నెక్కేవు
 సకల ఆయుధాలు పట్టేవు
 'గేయచక్ర' రథము నెక్కేవు
 మంత్రిణిచే  సేవింపబడేవు

*కిరిచక్ర రథారూఢ*
*దండనాథా పురస్కృతా*
*జ్వాలామాలిని కాక్షిప్త*
*వహ్నిప్రాకార మధ్యగా*27

 'కిరిచక్ర'  రథమును నెక్కేవు
 దండనాధుని  సేవలందేవు
 జ్వాలమాలిని చుట్టు నుండేను
 అగ్నిజ్వాలాల మధ్య నుండేవు

*భండసైన్య వధోద్యుక్త*
*శక్తి విక్రమహర్షితా*
*నిత్యా పరాక్రమాటోప*
*నిరీక్షణ సముత్సుకాతా*28

 భండాసుర సేనలను వధించు
 శక్తి సేనలు చూసి మురిసేవు
 నిత్య పరాక్రమ గుణాలతో
 నిండు ఉత్సాహా నుండేవు

*భండపుత్ర వధోద్యుక్త*
 *బాలా విక్రమనందితా*
*మంద్రిణ్యమ్బా విరచిత*
 *విషంగ వధతోషితా*29

 భండాసుర పుత్రుల వధించిన
 బాలంబ పరాక్రమ  ఆనందిని
విషంగాసురుని సంహరించిన
 మంత్రాంబ చతుర సంతోషిణి

 *విశుక్ర ప్రాణహరణ*
 *వారాహీ వీర్యనందితా |*
*కామేశ్వర ముఖాలోక*
*కల్పిత శ్రీగణేశ్వరా*30

 విశుక్రాసుర ప్రాణాలు తీసిన
 వారాహిని చూసి మురిసేవు
 కామేశ్వరుని మోము చూచి
 శ్రీగణేసుని కల్పించు కొనేవు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా
[27/10, 5:53 AM] Syamala Rao SSSS: 🙏 *లలితా సహస్రనామ స్తోత్రము* 🙏
 భావగానము: 31- 35 శ్లోకాలు
రచన:శ్యామలారావుssss

*మహాగణేశ నిర్భిన్న*
*విఘ్నయంత్ర ప్రహర్షితా*
*భండాసురేంద్ర నిర్ముక్త*
*శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ*31

 జయవిఘ్నయంత్ర నాశక
 విజయ వినాయక హర్షిణీ
 భండాసుర బాణల నాశక
 అస్త్రాలు  బాణాల వర్షిణి

*కరాంగుళినఖోత్పన్న*
*నారాయణ దశాకృతిః*|
*మహాపాశుపతాస్త్రాగ్ని*
*నిర్దగ్ధాసుర సైనికా*32

 చేతి గోళ్ళ నుండి వచ్చేను
 విష్ణువు దశావతారములు
 పాశుపతాస్త్రము వేసావు
 అసుర సేనలను చంపావు

*కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ*
*సభండాసుర శూన్యకా*
*బ్రహ్మోపేంద్ర మహేంద్రాది*
*దేవసంస్తుత వైభవా*33

కామేశ్వరాస్త్రము వేసావు
భండాసురుని  చంపావు
బ్రహ్మ విష్ణు  మహేశ్వరులు
స్తుతుల కీర్తించిరి వైభవాలు

*హరనేత్రాగ్ని సన్దగ్ధ*
 *కామ సంజీవనౌషధిః*
*శ్రీమద్వాగ్భవ కూటైక*
*స్వరూప ముఖపంకజా*34

ముక్కంటి మండించిన కాముని
బతికించు సంజీవిని  మందువి
'వాగ్భవ'మను  అక్షర కూటము
వదనం కమలాల  స్వరూపము

*కంణ్ఠాధః కటిపర్యంత*
*మధ్యకూట స్వరూపిణీ*
*శక్తి కూటైకతాపన్న*
 *కట్యధోభాగధారిణీ*35

 కంఠము నుండి నాభి వరకు
  'మధ్యకూట'  స్వరూపము
 నడుము నుండి  క్రింది వరకు
 'శక్తికూట'మంటి స్వరూపము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ లలితార్పణం స్వాహా
[27/10, 6:11 PM] Syamala Rao SSSS: 🙏 *లలితా సహస్రనామ స్తోత్రము* 🙏
 భావగానం 36 – 40 శ్లోకాలు
రచన :శ్యామలరావుssss

*మూలమంత్రాత్మికా,*
 *మూలకూటత్రయ కళేబరా*
*కులామృతైకరసికా,*
 *కులసంకేతపాలినీ*36

పదిహేను అక్షరాల మంత్రం
మూడింటి కూటమి శరీరం
ఆత్మరూపం మూలమంత్రం
అమృతకుల ఆసక్తిజనని
కులాచార సంకేత పాలిని

*కులాంగనా, కులాంతఃస్థా*
 *కౌలినీ, కులయోగినీ*
*ఆకులా, సమయాంతఃస్థా*
 *సమయాచార తత్పరా*37

 కుల కుటుంబ వనిత
 కుల మద్యన లలిత
 కుల దేవతా రూపిణి
 కుండలినీ    రూపిణి
 కులములేని రూపిణి
 సమయాచార పాలిని?
 సమయ అంతర్భాగిని?
 ఆచార కాల తత్పరి?

*మూలాధారైక నిలయా*
 *బ్రహ్మగ్రంథి విభేదినీ*
*మణిపూరాంత రుధిరా*
 *విష్ణుగ్రంథి విభేదినీ*38

మూలాధారమే ముఖ్యనివాసం
బ్రహ్మగ్రంథిని వేరుచేయునది.
మణిపూరక చక్రము చివరది
 విష్ణుగ్రంథిని వేరుచేయునది.

*ఆజ్ఞాచక్రాంత రాళస్థా*
*రుద్ర గ్రంథి విభేదినీ*
*సహస్రారాంబుజారూఢా*
 *సుధాసారాభివర్షిణీ*39

 ఆజ్ఞాచక్రము  లోపలుండేది
 రుద్రగ్రంథిని  వేరుచేయునది
 వేయిరేకుల పద్మానున్నదేవి
 అమృతము కురిపించుదేవి

*తటిల్లతాసమరుచిః*
 *షట్చక్రోపరిసంస్థితా*
*మహాసక్తిః, కుండలినీ*
 *బిసతంతు తనీయసీ*40

 మెఱపుతీగ సమభావం
 ఆరుచక్రాల పైన స్థానం
 బ్రహ్మము కోరు భావం
 పాము వంటి  రూపం
 తామరలో సన్నదారం

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీలలితార్పణం స్వాహా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి