8, నవంబర్ 2021, సోమవారం

16, జులై 2021, శుక్రవారం

సాంఖ్యయోగం శ్లో.62

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

సాంఖ్యయోగం శ్లో.62


విషయాలు ఆలోచించు వానికి 

ఆ విషయాలపై ఆసక్తి కలుగును

ఆసక్తి వలన కోరికలు కలుగును

కోరికలు వలన కోపం కలుగును


*ధ్యాయతో విషయాన్ పుంసః*

*సంగస్తేషూపజాయతే*

*సంగాత్ సంజాయతే కామః*

*కామాత్ క్రోధోఽభిజాయతే*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

 భక్తి స్తోత్రం భావ గానం fb page

2, జులై 2021, శుక్రవారం

గీత. అ.2. శ్లో.51

 సరళంగా సులభంగా

*సాంఖ్యయోగం*

సంఖ్య= నంబర్

(సాంఖ్యా= 1,2,3 etc  )

 numbers for  counting


యోగం= chapter 

భావం:  accounts  


*గీత. అ.2. శ్లో.51*


తమ కర్మలఫలాలు ఆశించరు

అలా సమబుద్ధి గల జ్ఞానులు

మరుజన్మ బంధాలు వీడెదరు 

అలా పరమపదం పొందెదరు


*కర్మజం బుద్ధియుక్తా హి*

*ఫలం త్యక్త్వా మనీషిణః*

*జన్మబంధవినిర్ముక్తాః*

*పదం గచ్ఛంత్యనామయం*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావగానం fb

27, జూన్ 2021, ఆదివారం

గీత. అ.2. శ్లో.47

 సరళంగా సులభంగా

గీత. అ.2. శ్లో.47

సాంఖ్యయోగము


కర్మలు చేయు అధికారం కలదు

కర్మ ఫలం కోరు అధికారం లేదు

కర్మ ఫలాలకు కారణం కారాదు

కర్మలు చేయకుండ మానరాదు


*కర్మణ్యేవాధికారస్తే*

*మా ఫలేషు కదాచన*

*మా కర్మఫలహేతుర్భూః*

*మా తే సంగోఽస్త్వకర్మణి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss. blogspot

12, జూన్ 2021, శనివారం

సాంఖ్యయోగము *గీత. అ.2. శ్లో.32*

 సరళంగా సులభంగా

సాంఖ్యయోగము

*గీత. అ.2. శ్లో.32*


అనుకోకుండా వచ్చిన అవకాశం

స్వర్గ ద్వారం తెరిచిన అవకాశం

క్షత్రియులు సుఖించు అవకాశం  

పార్థా పోరాడి  పొందే అవకాశం


*యదృచ్ఛయా చోపపన్నం*

*స్వర్గద్వారమపావృతమ్*

*సుఖినః క్షత్రియాః   పార్థ*

*లభంతే యుద్ధమీదృశమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

భక్తి స్తోత్రం భావగానం ఫేస్బుక్

7, జూన్ 2021, సోమవారం

సాంఖ్యం అర్దం భావం ఉద్దేశం

 *సాంఖ్యం*  

అర్దం భావం ఉద్దేశం

మూలం : వికి పీడియా

భావగానం:శ్యామలరావు

 

*అర్దం*:  

సాంఖ్య:  ఒక అంకె

సాంఖ్యం: లెక్కించే అంకెలు


*భావం*: 

దాటిన నిజ తత్వాల సంఖ్య


*ఉద్దేశం*:

మొత్తం 25 తత్వాలు దాటాలి

నీ గమ్యం మోక్షం ముక్తి చేరాలి


*వివరణ*

ఇది వేద ఉపనిషత్తుల పదం

ఇది ఋషి జ్ఞాన   అనుభవం

ఇది వారి అవగాహన సారం

ఇది జ్ఞాన  విచారణ వివరం 

 

*తత్వాల లక్ష్యం*

జంతు భావాల నుంచి  విముక్తి  

రాక్షస  భావాల నుంచి  విముక్తి

నిజమైన భావాలను తెలపటం

పురుషులలోని ఆత్మ తెలపటం

ఆత్మ పరమాత్మలను తెలపటం

పరమ పురుష లోకం తెలపటం

పరమాత్మ  లోకం చేరాలనటం

ముక్తి వైపు ప్రభావితం చేయటం