18, ఫిబ్రవరి 2018, ఆదివారం

[09/02, 05:53] Syamala Rao SSSS: *లలితా సహస్రనామ స్తోత్రము*
 *భావగానం 26-27 శ్లోకాలు*

*చక్రరాజ రథారూఢ*
*సర్వాయుధ పరిష్కృతా*
*గేయచక్ర రథారూఢ*
  *మంత్రిణీ పరిసేవితా* 26

 'చక్రరాజ'  రథము నెక్కేవు
 సకల ఆయుధాలు పట్టేవు
 'గేయచక్ర' రథము నెక్కేవు
 మంత్రిణిచే  సేవింపబడేవు

*కిరిచక్ర రథారూఢ*
*దండనాథా పురస్కృతా*
*జ్వాలామాలిని కాక్షిప్త*
*వహ్నిప్రాకార మధ్యగా* 27

 'కిరిచక్ర'  రథమును నెక్కేవు
 దండనాధుని  సేవలందేవు
 జ్వాలమాలిని చుట్టు నుండేను
 అగ్నిజ్వాలాల మధ్య నుండేవు


🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీలలితార్పణం స్వాహా
రచన:శ్యామలరావుssss
http://syamalaraossss.blogspot.in
[10/02, 06:13] Syamala Rao SSSS: *లలితా సహస్రనామ స్తోత్రము*
 *భావగానం 28-29 శ్లోకాలు*


*భండసైన్య వధోద్యుక్త*
*శక్తి విక్రమహర్షితా*
*నిత్యా పరాక్రమాటోప*
*నిరీక్షణ సముత్సుకాతా* 28

 భండాసుర సేనలను వధించు
 శక్తి సేనలు చూసి మురిసేవు
 నిత్య పరాక్రమ గుణాలతో
 నిండు ఉత్సాహా నుండేవు

*భండపుత్ర వధోద్యుక్త*
  *బాలా విక్రమనందితా*
*మంద్రిణ్యమ్బా విరచిత*
  *విషంగ వధతోషితా*
29

 భండాసుర పుత్రుల వధించిన
 బాలంబ పరాక్రమ  ఆనందిని
విషంగాసురుని సంహరించిన
 మంత్రాంబ చతుర సంతోషిణి

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీలలితార్పణం స్వాహా
రచన:శ్యామలరావుssss
http://syamalaraossss.blogspot.in
[11/02, 22:19] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 *లలితా సహస్రనామ*🙏
🙏 *స్తోత్రము భావగానం*🙏
 🙏 *శ్లోకాలు 30-31*  🙏
   🙏🙏🙏🙏🙏🙏


  *విశుక్ర ప్రాణహరణ*
  *వారాహీ వీర్యనందితా*
*కామేశ్వర ముఖాలోక*
 *కల్పిత శ్రీగణేశ్వరా*
30

 విశుక్రాసుర ప్రాణాలు తీసిన
 వారాహిని చూసి మురిసేవు
 కామేశ్వరుని మోము చూచి
 శ్రీగణేసుని కల్పించు కొనేవు

*మహాగణేశ నిర్భిన్న*
*విఘ్నయంత్ర ప్రహర్షితా*
*భండాసురేంద్ర నిర్ముక్త*
*శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ* 31


జయవిఘ్నయంత్ర నాశక
 విజయ వినాయక హర్షిణీ
 భండాసుర బాణల నాశక
 అస్త్రాలు  బాణాల వర్షిణి
🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీలలితార్పణం స్వాహా
రచన:శ్యామలరావుssss
http://syamalaraossss.blogspot.in
[12/02, 05:12] Syamala Rao SSSS: 🙏 *శ్రీ రుద్రం - నమకం* 🙏
తెలుగు భావ గానము
మొదటి అనువాకం( శ్లో1-17 )
మూలం : వేదం

1.
నమస్తే భగవాన్ రుద్రాయ
2.
 నమస్తే నీబాణాల విల్లుకయా
నమస్తే నీ బాహువులకయా
నమస్తే నీకోపానికి రుద్రాయ
నమస్తే పాపదుఃఖ నాశాయా
3.
నీఅంబులపొదిసుఖమీయుగాక
నీబాణాలు ఆనందమీయుగాక
4.
నీ రౌద్రరూపము వీడెదవుగాక
నీ ఆయుధాలు వీడెదవు గాక
ఆనంద శాంతరూపుడవుగాక
మమ్ము అనుగ్రహింతువు గాక

5.
శివాయ గిరీశ  శాంతించవయా
నీ చేతుల బాణాలు ఆపవయా
నీభక్తుల బాధలు తొలగాలయా
6.
జీవుల ఆనందకారుడవయా
శుభ మంగళకారుడవయా
సుఖాలీయు శివునివయా
నిన్నే మేము కీర్తింతుమయా
7.
దేవతల ప్రధమునివయా
దేవతల వైద్యునివయా
రాకాసులను బాధించవయా
రాకాసులను చంపవయా
8.
బంగారుసూర్యునిలా ఉన్నావయా
రుద్రా నీవు అంతటా ఉన్నావయా
రుద్రా నీవు ప్రసన్నుమవ వయా
9.
అస్తమించు సూర్యునివయా
రుద్రా నీవు నీలకంఠునివయా
ఉదయసాయంత్ర సంద్యలయా
రుద్రా నీవు సుఖమీయవయా
10.
వేలాదికనుల దయచూపవయా
నీ గణాలకు వందనమయా
నీ వారందరికీ వందనమయా
11.
నీ వింటినారి సడలించవయా
నీబాణాలు పొదిలోనుంచవయా
12.
శివాయ నీకు వేలాదికనులయా
నీకు వేలాది అంబులపొదిలయా
బాణాలు మావైపు వేయకయా
రుద్రా మము నీవు రక్షించవయా
13 .
జటాజూటధారి విల్లు వీడవయా
నీ బాణాలు పొదిలో నుంచవయా
14.
నీ విల్లు బాణాలతో రుద్రాయ
మా కష్టాలు తొలగించవయా
15.
బాణాలులేని విల్లుకు వందనం
బాణాలుకల పొదికి  వందనం
రుద్రాయ నీచేతులకు వందనం
16.
నీ బాణాలతో మము  బాదించకోయి
మా శత్రువులపై ప్రయోగించవోయి

17.(- ముఖ్యం రెండు సార్లు చదవాలి-)
నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ
మహాదేవాయ ముక్కంటివయా
త్రికాగ్ని కాలాయ త్రిపురాంతకాయ
కాలాగ్ని రుద్రాయ  నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
నమస్తే శివాయ మహాదేవాయ

*-ప్రధమ అనువాకం సంపూర్ణం-*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శివార్పణం స్వాహా
భావగానం:శ్యామలరావుssss
Cell no. +91 99891 25191
తెలుగు మూలం  :వేదమాలిక-
SRISATYASAI SADHANA TRUST PUBLICATIONS

syamalaraossss.blogspot.com 
[12/02, 20:04] Syamala Rao SSSS: Rudra kavacham
రుద్రుడు నను రక్షించు గాక

🙏🙏🙏🙏🙏🙏
  *రుద్ర కవచం*
*సరళ భావ గానం*
 🙏🙏🙏🙏🙏🙏
మూలం: వేదం
భావగానం:శ్యామలరావుssss

1.దుర్వాస ముని పలికెను:
దేవా మీకు శిరసా వందనం
స్వయముగ పుట్టిన ఈశ్వరం
సర్వము నీవైన ఏకైక  దైవం
సర్వదేవ రూపం పరమేశ్వరం

*రుద్ర కవచం*
*దుర్వాస ఉవాచ:-*
*1.  శ్లో:-*
*ప్రణమ్యామి శిరసా దేవం*
*స్వయంభుం పరమేశ్వరం.*
*ఏకం సర్వ గతం దేవం*
*సర్వ దేవ మయం విభుం.*

2. పలికేను నేను రుద్ర కవచం
 అంగ ప్రాణాల రక్షణా కవచం
 పగలురాత్రుల దేవుని కవచం
 అతి పురాతన రక్షా కవచం

*2.  శ్లో:-*
*రుద్ర వర్మ ప్రవక్షామి*
*అంగ ప్రాణస్య రక్షయే.*
*అహో రాత్ర మయం దేవం* *రక్షార్థం నిర్మితం పురా.*

ముందుండి నను రుద్రుడు రక్షించు గాక
ముఖము  మహేశ్వరుడు
రక్షించు గాక
నా తలను ఈశ్వరుడు
రక్షించు గాక
నుదురు నీలలోహితుడు
రక్షించు గాక

*3.  శ్లో:-*
*రుద్రో మే చాగ్రతః పాతు* *ముఖం పాతు మహేశ్వరః*
*శిరో మే యీశ్వరః పాతు* *లలాటం నీలలోహితః*

4.కనులను ముక్కంటి
రక్షించు గాక
ముఖము  మహేశ్వరుడు
రక్షించు గాక
చెవులు శంభుడు
రక్షించు గాక
ముక్కును సదా శివుడు
రక్షించు గాక
*4.  శ్లో:-*
*నేత్రయోస్త్రయంబకః పాతు*
 *ముఖం పాతు మహేశ్వరః*
*కర్ణయోః పాతుమే* *శంభుర్నాసికాయాం* *సదాశివః.*

5.నా నాలుకను వాగీశుడు
రక్షించు గాక
నా పెదాలు అంబికాపతి
రక్షించు గాక
నా కంఠము  నీలకంఠుడు
రక్షించు గాక
నా భుజాలు పినాకపాణి
రక్షించు గాక

*5.  శ్లో:-*
*వాగీశః పాతు మే జిహ్వా* *మోష్ఠా పాతంబికాపతిః*
*శ్రీ కంఠః పాతు మే గ్రీవాం* *బాహూంశ్చైవ పినాక ధృత్.*


ఇటువంటి మరిన్నిభావ గానాల కోసం  గూగుల్ లో సెర్చ్ చేయండి " syamalaraossss.blogspot.com
[13/02, 04:46] Syamala Rao SSSS: Bhakti stotram Telugu meaning
 🙏🙏🙏🙏🙏🙏
 🙏 *శ్రీరుద్రం*🙏
 తెలుగు భావగానం
శ్లో 18 - 21
అనువాకం-2
18.
బంగారు చేతుల సేనానికి వందనం
దిక్కులనేలు అధిపతి కి వందనం
పచ్చనికొమ్మల చెట్టు రూపికీ వందనం
పశువుల నేలు పశుపతి కి వందనం
లేత గడ్డి లా ఎరుపు పచ్చని రంగుల రుద్రునకు వందనం


19.
మృత్యుంజయాయ నంది వాహనాయ వందనం
పాడి పంటల అన్నాల అధిపతికి వందనం
ఆకుపచ్చని లతల  జంధ్యాదారికి వందనం
సుగుణులకు బలమీయు రుద్రునకు వందనం
తాపముతొలిగించు జగాల అధిపతికి వందనం
20.
శత్రుసంహారికి  ప్రాంత అధిపతి కి వందనం
సారధికి వనాల అధిపతికి వందనం
రోహితునికి వృక్షాల అధిపతికి వందనం
21.
మంత్రరక్షక మంత్రాధిపతి కి వందనం
జనరక్షకునికి జపరక్షకునికి
వందనం
వ్యాపార అధిపతికి వందనం
వ్యాధిమందుల అధిపతికి వందనం
నిండావృక్షాల వనాధిపతికి వందనం
గట్టిగాగర్జించు దళాధిపతికి వందనం
నడిపించు రక్షించు అధిపతికి వందనం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శివార్పణం స్వాహా syamalaraossss.blogspot.com
[13/02, 04:46] Syamala Rao SSSS: Bhakti stotram Telugu meaning
 *శ్రీరుద్రం*🙏
 తెలుగు భావగానం
శ్లో 22
అనువాకం-3
22.
శత్రువులను ఓడించు
 రుద్రునకు వందనం
శత్రువులను బాదించు
రుద్రునకు వందనం

చేతిలో విల్లంబు
పొదిలో బాణాలు
దొంగలకు అధిపతి కి
రుద్రునకు వందనం

వంచకుల అధిపతి కి
రుద్రునకు వందనం
రాత్రి దొంగల అధిపతి కి
రుద్రునకు వందనం
నిరంతర సంచారికి
నిత్య వంవాసికి వందనం
రుద్రునకు వందనం

కత్తిగల     దొంగ రూపునకు వందనం
పీడించు   దొంగ రూపునకు వందనం
పీకకోయు దొంగ రూపునకు
వందనం
వారి అధిపతికి  రుద్రునకు వందనం

తలపాగ కల రుద్రునకు వందనం
పర్వతాల నడయాడు
రుద్రునకు వందనం

భూమి దోచు వారి అధిపతి కి
రుద్రునకు వందనం

విల్లు బాణాలు రుద్రునకు వందనం

విలుతాడు కుట్టిన
బాణాలు పట్టిన
 రుద్రునకు వందనం

వింటి నారి లాగిన
బాణాలు గురిపెట్టిన
రుద్రునకు వందనం

కూర్చున్న నుంచున్న
రుద్రునకు వందనం

మేలుకున్న పడుకున్న
రుద్రునకు వందనం
సంఘములో రుద్రునకు
సంఘ అధిపతి కి
రుద్రునకు వందనం

గుర్రాల విగ్రహాలకు వందనం
గుర్రాల నెక్కువారికి వందనం
బీదవారికి బిచ్చవానికి
రుద్ర రూపులకు వందనం

3వ అనువాకం సంపూర్ణం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శివార్పణం స్వాహా syamalaraossss.blogspot.com
[13/02, 04:46] Syamala Rao SSSS: Bhakti stotram Telugu meaning
🙏🙏🙏🙏🙏🙏🙏
 🙏 *శ్రీరుద్రం*🙏
నమకం అనువాకం-4
తెలుగు భావగానం

వేధించు వనిత ,ఉన్నతా మాత
దుర్గామాత  రూప రుద్రునకు వందనం


ఆసక్తిరూప ఆసక్తి రక్షక
రుద్ర రూపునకు వందనం

సంఘాలకు సంఘాధిపతి
రుద్ర రూపునకు వందనం

దేవగణాలకు గణాధిపతికి
రుద్ర రూపునకు వందనం

అశ్వగజ విరూపునకు
రుద్ర రూపునకు వందనం

అణిమాది శక్తునకు
అష్ట ఐశ్వర్య రహితనకు
రుద్రరూపునకు వందనం

శరీరునకు ఆత్మరూపునకు  రుద్రరూపునకు వందనం

రథవీర  రథ రహితునకు
రుద్రరూపునకు వందనం

ప్రాణ అప్రాణ రూపనకు
రుద్రరూపునకు వందనం

రధరూప  రధాధిపతిరూప
రుద్రరూపునకు వందనం

సేనల సేననాయక రూప
రుద్రరూపనకు వందనం

రధశిక్షక రధసారధి రూప రుద్రరూపునకు వందనం

దేవశిల్ప రుద్రునకు వందనం
రధ శిల్ప రూప రుద్రునకువందనం


 లావు రూప రుద్రునకు వందనం
కార్మిక రూప రుద్రునకు వందనం

పక్షులను చంపు రుద్రునకు వందనం
చేపలను చంపు రుద్రునకు వందనం

చక్కని శరీర రుద్రునకు వందనం
చక్కని విల్లున్న రుద్రునకు వందనం

జంతు రోగాల రుద్రునకు వందనం
కుక్కల  బంధాల రుద్రునకు వందనం

శ్వాస రూప రుద్రునకు వందనం
సునాకాధిపతి రుద్రునకు వందనం

4వ అనువాకం సంపూర్ణం

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శివార్పణం స్వాహా syamalaraossss.blogspot.com
[13/02, 04:46] Syamala Rao SSSS: Bhakti stotram Telugu meaning
🙏🙏🙏🙏🙏🙏
🙏 *శ్రీరుద్రం*🙏
అనువాకము 5.
మూలం : యజుర్వేదం
తెలుగు భావగానం

పుట్టించి పెంచు పోషించు
రుద్రునకు వందనం

పాపనాశునకు
పశుపతికి
రుద్రునకు వందనం

నీల కంఠునకు
తెల్లని మెడకు
రుద్రునకు వందనం

జటాజూటునకు
గుండు రూపునకు
రుద్రునకు వందనం

వేలకనుల వానికి
వంద విల్లుల వానికి
రుద్రునకు వందనం

కైలాసగిరి నివాసునకు
జీవుల అంతర్యామికి
రుద్రునకు వందనం

బాణ రూపునకు మేఘ రూపనకు వానరూపునకు
రుద్రునకు వందనం

పొట్టివానికి వామనుని కి
రుద్రునకు వందనం

పొడుగువానికి పెద్దవానికి
రుద్రునకు వందనం

ముసలివానికి జ్ఞానికి
రుద్రునకు వందనం

ఆది పురుషునకు
ముందు ప్రముఖునకి
రుద్రునకు వందనం

అంతటా వుండు
అంతటా కదులు
రుద్రునకు వందనం

వేగవంతునకు
వాగు రూపునకు
ప్రవాహ రూపునకు
రుద్రునకు వందనం

అలల రూపునకు
కొలను రూపునకు
రుద్రునకు వందనం

నది రూపునకు
ద్వీప రూపునకు
దేశ   రూపునకు
ఖండ రూపునకు
రుద్రునకు వందనం

అనువాకము 5 సమాప్తము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శివార్పణం స్వాహా syamalaraossss.blogspot.com
[15/02, 06:31] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏                     
    *అచ్యుతాష్టకమ్* 
🙏🙏🙏🙏🙏🙏🙏

మూలం:
*శ్రీఆది శంకరాచార్యులు*

*అచ్యుతం కేశవం*
ప్రళయాన నశించడోయి
శేషనాగ శయనుడోయి

*రామ నారాయణం*
రామనారాయణుడోయి

 *కృష్ణ దామోదరం*
నల్లని వాడోయి
దామోదరుడోయి

*వాసుదేవం హరిమ్*
వసుదేవ సుతుడోయి
పాపాలు హరించువాడోయి

*శ్రీధరం మాధవం*
లక్ష్మీపతి మాధవుడోయి

 *గోపికా వల్లభం*
గోపికా నాయకుడోయి

 *జానకీ నాయకం*
ఆ సీతాపతినోయి

*రామ చన్ద్రం భజే*
రామచంద్రుని
 కీర్తింతుమోయి

🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణార్పణం స్వాహా
భావగాన రచన:
శ్యామలరావుssss
+91 9989125191
🙏🙏🙏🙏🙏🙏🙏
[17/02, 15:12] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏

*లలితా సహస్రనామ స్తోత్రము*
 *భావగానం 33-34 శ్లోకాలు*


*కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ*
*సభండాసుర శూన్యకా*
*బ్రహ్మోపేంద్ర మహేంద్రాది*
*దేవసంస్తుత వైభవా* 33

కామేశ్వరాస్త్రము వేసావు
భండాసురుని  చంపావు
బ్రహ్మ విష్ణు  మహేశ్వరులు
స్తుతుల కీర్తించిరి వైభవాలు

*హరనేత్రాగ్ని సన్దగ్ధ*
*కామ సంజీవనౌషధిః*
*శ్రీమద్వాగ్భవ కూటైక*
*స్వరూప ముఖపంకజా* 34

ముక్కంటి మండించిన కాముని
బతికించు సంజీవిని  మందువి
'వాగ్భవ'మను  అక్షర కూటము
వదనం కమలాల  స్వరూపము



🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీలలితార్పణం స్వాహా
రచన:శ్యామలరావుssss

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి