27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సులభం గా సరళం గా గీతా శ్లోకాలు

[22/02, 08:36] Syamala Rao SSSS: 🙂సులభం గా సరళం గా🙂

*భగవద్గీత* *భక్తి యోగం*
 *ముఖ్య శ్లోకం  12-17*

(పదాలు విడివిడి గా పలకండి)

*యో*                ఎవడు
 *న హృష్యతి* సంతోషించడో
 *న ద్వేష్టి*        ద్వేషించడో
 *న శోచతి*      శోకించడో
 *న కాంక్షతి*।   ఆశించడో

*శుభాశుభ*  శుభాశుభాలను
*పరిత్యాగీ*   వదిలి వేస్తాడో
*భక్తి మాన్య*  ఆ భక్తుడు
*స్స మే*              నాకు
*ప్రియః*॥     ప్రియుడు

(శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి)

*యోన హృష్యతి నద్వేష్టి*
 *నశోచతి న కాంక్షతి*।
*శుభా శుభ పరిత్యాగీ*
*భక్తి మాన్యస్సమేప్రియః॥*

భావగానం

*పరమాత్మ పలికేనోయి*

 ఎవడు సంతోషించడోయి
ద్వేషించడు శోకించడోయి
ఆశించడు కోరడోయి
శుభాశుభాలు వీడునోయి
ఆ భక్తుడే నాకు ప్రియుడోయి

🙏🙏🙏🙏🙏🙏🙏
భావగానo : శ్యామలరావు
సర్వం శ్రీ కృష్ణార్పణం
[23/02, 10:06] Syamala Rao SSSS: *సులభం గా సరళంగా*

*భగవద్గీత  కర్మయోగము*
*ముఖ్య శ్లోకం 03-16*

(విడి విడి గా పదాలు చదవండి)

*ఏవం*               ఇలా
*ప్రవర్తితం*        ప్రవర్తించు
*చక్రం*              ధర్మచక్రం
*న +అనువర్తయత్ +*
                         అనుసరించని
*ఇహా*              ఇక్కడ
*యః*।             వారు
*అఘాయుర్*  ఆయువంతా
*ఇంద్రియా*      ఇంద్రియాల
*రాయో*          యొక్క
*మోఘం*        స్వార్ధం/మాయ
*స*                 తో
*జీవతి* ॥       జీవింతురు
*పార్థ*             పార్దా

(ఇప్పుడు శ్లోకం చదవండి)

*ఏవం ప్రవర్తితం చక్రం*
*నానువర్తయతీహ యః* ।
*అఘాయురిన్ద్రియారామో*
*మోఘం పార్థ స జీవతి* ॥

పార్దా , ఈ ధర్మచక్రము నోయి
ఇలా అనుసరించని వారోయి 
ఇంద్రియాల మాయలందోయి
ఆయువంతా  జీవింతురోయి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రచన: శ్యామలరావుssss
సర్వం భగవా దర్పణం స్వాహా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి