2, ఆగస్టు 2018, గురువారం

గుణత్రయ విభాగ యోగం* భగవద్గీత 14 -1,2,3,4

భగవద్గీత భావగానం
 సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *గుణత్రయ విభాగ యోగం*
 భగవద్గీత 14 వ అధ్యాయం


శ్లో1.
 వివరించెదను  పరమమైనది
జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమిది
ఇది తెలిసిన మునులనందరు
పూర్వము పరమసిద్ధి పొందిరి

శ్లో2.
ఈ జ్ఞానమును  పొందినవారు
నా సాన్నిధ్యము పొందినవారు
మరలమరల వారు జనించరు
ప్రళయాన వారు మరణించరు

శ్లో3.
ఈ ప్రకృతిలో నేనే ప్రవేశింతును
మహా  సృష్టి  బీజం  ఉంచెదను
సకల  జీవులను  పుట్టించెదను
అలా  జరుగుచున్నది  అర్జునా

శ్లో4.
అన్ని జీవ గర్భము లందు
నేనే విత్తనముంచు మూర్తిని
ఈ ప్రకృతే మహా గర్భము
నేనే తండ్రిని  బీజ దాతను



🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 రచన:
S S S S  Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పురుషోత్తమ ప్రాప్తి యోగం*15 - 5,6,7,8

[07/07, 08:42] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*పురుషోత్తమ ప్రాప్తి యోగం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏                 
భగవద్గీత దేవుని పాట 15 - 5

పరమాత్మ పలికెను:

మోహం బంధదోషాలు నెగ్గుము
నిత్యం ఆదిదేవంలో ఉండుము
సుఖం దుఃఖం ద్వందం వీడుము
జ్ఞానివై నా పరంధామం చేరుము

శ్లో 5.
*నిర్మమోహా జితసంగదోషాః*
*ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః*
*ద్వందైర్విముక్తా సుఖదుఃఖసఙ్నే*
*గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
రచన: శ్యామలరావుssss
[08/07, 05:07] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*పురుషోత్తమ ప్రాప్తి యోగం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని పాట భగవద్గీత 15 - 6

పరమాత్మ పలికెను

శ్లో.6
సూర్య చంద్ర అగ్ని కాంతులు
 ప్రకాశించలేనిది నా ధామం
ఏది పొందిన మరి జన్మించరో
ఆ ధామమే నా పరంధామం

*న తద్భాసయతే సూర్యో*
*న శశాంకో న పావకః*
*యద్గత్వా న నివర్తంతే*
*తద్దామ పరమం మమ*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
రచన: శ్యామలరావుssss
[09/07, 06:44] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*పురుషోత్తమ ప్రాప్తి యోగం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని పాట భగవద్గీత 15 - 7

పరమాత్మ పలికెను

*మమైవాంశో  జీవలోకే*
*జీవ భూత సనతనః*
*మన ష్షష్ఠాణీంద్రియాణి*
*ప్రకృతిస్థాని కర్షతి*

శ్లో.7
జీవలోకమంతా నాఅంశమే
జీవిలోనిది అతిపురాతనము
జీవుని  మది ఇంద్రియాలను
ప్రకృతి తనవైపు ఆకర్షించును

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
రచన: శ్యామలరావుssss
[10/07, 07:12] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*పురుషోత్తమ ప్రాప్తి యోగం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని పాట భగవద్గీత 15 - 8

పరమాత్మ పలికెను

శ్లో.8 భావ గీతం

జీవాత్మ తదుపరి తనువుకు
 తన తోడుగా  తరలించును
తన మదిని తన తలపులను
వాయువుతో వాసనల తరలినట్లు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
రచన: శ్యామలరావుssss

బ్రహ్మా ముహూర్తం*

*బ్రహ్మా  ముహూర్తం* అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

 
*బ్రాహ్మా  ముహూర్తం*
సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా  ముహూర్తం అంటారు.
 
*ఆఖరి నిమిషాలు*
రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా  ముహూర్తం అంటారు.
 
*పూజలు*
బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.
 
*విద్యార్థులకు*
విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.
 
*జీవక్రియలు*
మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది.
 
*ఒత్తిడి*
అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.
 
*పెద్దవాళ్లు ఎందుకు లేవాలి* ?
ఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.

*ఫ్రెష్ ఆక్సిజన్*
రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.

*గృహిణులు ఎందుకు లేవాల*ి.?
గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

పురుషోత్తమ ప్రాప్తి యోగం 15 - 9

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*పురుషోత్తమ ప్రాప్తి యోగం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని పాట భగవద్గీత 15 - 9

పరమాత్మ పలికెను
శ్లో: 9 భావ గానం

వినుచు చూచుచు తాకుచు
వాసన  చూచుచు  తాగుచు
 ఆశ్రయించి  ఆస్వాదించును
 ఆత్మే అధికారై మనసేలును

శ్లో.9
*శ్రోత్రం చక్షుః స్పర్శనం చ*
*రసనం ఘ్రాణమేవచ*
*అధిష్ఠాయ మనశ్చాయం*
*విషయానుపసేవతే*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
రచన: శ్యామలరావుssss

సృష్టి సూక్తం (నాసదీయ సూక్తం)

Rough draft pl don't post
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
       *సృష్టి సూక్తం*
 *(నాసదీయ సూక్తం)*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
(ఋగ్వేదం 10 వ మండలం 129 వ సూక్తం)
         
*నాసదాసీన్నోసదాసీత్తదానీం*
 *నాసీద్రజో నో వ్యోమాపరో యత్ ।*
*కిమావరీవః కుహకస్య శర్మన్నంభః*
 *కిమాసీద్గహనం గభీరం* 1

అపుడు ఏమిలేదు అసలేదీలేదు
గాలి,లోకం, పైలోకాలేవి లేవు
అంతరిక్ష నీరేది  ఎక్కడుందది
ఏది కప్పింది ఎంత లోతునుంది

*న మృత్యురా॑సీద॒మృతం॒ న తర్హి॒ న రాత్ర్యా॒।*
*ఆహ్న॑ఆఅసీత్ప్రకే॒తః ఆనీదవాతం స్వధయా*
*తదేకం తస్మాద్ధాన్యన్నపరః కిఞ్చనాస 2*

చావులేదు అమృతం లేదు
కాంతి లేదు పగలు లేదు
అంతా చీకటే  నిండివుంది
అంతా గాలిలేని ఊపిరి అది
అంతా చీకటి మరేదీ లేదు

*తమ॑।ఆఅసీ॒త్తమ॑సాగూ॒హ్ళమగ్రే॑*
*ప్రకే॒తం స॑లి॒లం సర్వ॑మాఽఇ॒దం ।*
*తుచ్ఛ్యేనాభ్వపిహితం*
*యదాసీత్తపసస్తన్మహినా జాయతైకం ౩*

అందులోనుండి వచ్చింది
వేడి వెచ్చదనం వచ్చింది
ఆది కోరిక వచ్చి చేరింది
ఆది విత్తనమది అయింది

*కామ॒స్తదగ్రే॒ సమ॑వర్త॒తాధి*
*మన॑సో॒ రేతః॑ ప్రథ॒మం యదాసీ॑త్ ।*
*సతోబన్ధుమసతి నిరవిన్దన్హృది౬*
*ప్రతీష్యా కవయో మనీషా 4*

 కోరిక పైకి లేచి చుట్టిముట్టింది
మొదటి మనసు వచ్చి చేరింది
ఋషులు మది నిలిపి వెతికిరి
బొడ్డు బంధమేది ఏది కాదని
తెలివి జ్ఞానము వాడి చూసిరి

*తి॒ర॒శ్చీనో॒ విత॑తో ర॒శ్మిరే॑షామ॒ధః*
*స్వి॑దా॒సీ౩ దు॒పరి॑స్విదాసీ ౩త్।*
*రేతోధా।ఆఅసన్మహిమాన।ఆఅసన్త్స్వధా।*
*ఆవస్తాత్ ప్రయతిః పరస్తాత్ 5*

ఖాళీల నుండి బొడ్డుతాడు పట్టిరి
చిన్న శక్తిరూప దేవతలను తెలిసిరి
ఏది పైది ఏది కింద లోకం తెలిసిరి
పైశక్తిపాతం చేసెను లోకాలు సారం

*కో।ఆ॒ద్ధా వే॑ద॒ కఽఇ॒హ ప్రవో॑చ॒త్ కుత॒।*
*ఆఅజా॑తా॒ కుత॑ఽఇ॒యం విసృ॑ష్టిః ।*
*అర్వాగ్దేవా।ఆస్య విసర్జనేనాథాకో*
*వేద యత।ఆఅబభూవ 6*

ఎవరికి తెలుసు ఎవరు చెప్పగలరు
ఇదంతా ఎప్పుడు  వచ్చిందో
ఈ సృష్టంతా ఎలా జరిగిందో
దేవతలే సృష్టి తరువాత వారు
అందుచే నిజం వారికి తెలుసా
 సృష్టి కి మొదలు ఎప్పుడో

*ఇ॒యం విసృ॑ష్టి॒ర్యత॑।ఆఅబ॒భూవ॑*
*యది॑ వా ద॒ధే యది॑ వా॒ న ।*
*యో।ఆస్యాధ్యక్షః పరమే వ్యోమన్త్సో।*
*ఆంగ వేద యది వా న వేద 7*

ఎప్పుడు సృష్టి  ఆరంభమైనదో
తన సృష్టి తీరు ఇదే నని ఆ
దేవునకు తెలుసో తెలియదో
ఎంతో ఎత్తునుంది దేవలోకము
అచట నుండి చూసేను దైవము
దేవునకు తెలుసో తెలియదో

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భావగానం రచన:
S S S S  Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఋషుల పలుకులు

🙏🙏🙏🙏🙏🙏🙏
 *ఋషుల పలుకులు*
🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లో"
*కృషితో నాస్తి దుర్భిక్షం*
*జపతో నాస్తి పాతకమ్*
*మౌనేన కలహం నాస్తి*
*నాస్తి జాగరతో భయమ్*

భావగానం

 కృషి  తో కరువు ఉండదు
 జపం తో  పాపం ఉండదు
 మౌనంతో  వైరం   ఉండదు
 జాగ్రత్త తో భయం ఉండదు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

భాగవత మాణిక్యాలు

🙏🙏🙏🙏🙏🙏🙏
భాగవత  మాణిక్యాలు
🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీహరి భక్తుడు  ప్రహ్లాదుడు
హరి భక్తి అనే తేనెరుచి   వివరించుట 

*మందార మకరంద*
*మాధుర్యమున దేలు*
*మధుపంబు వోవునే*
*మదనములకు*

మందారపూల  మకరందం
 రుచి  చూచి ఆనందించు
తుమ్మెద మరల ఉమ్మెత్త
 పూల వైపు పోవునా

*నిర్మల మందాకినీవీచికల*
 *దూగు రాయంచ చనునే* *తరంగిణులకు*
మందాకినినది మంచినీరు
రుచి చూసి ఆనందించు
రాజహంస మరల
చెరువు వైపు పోవునా

*లలిత రసాల పల్లవ*
 *ఖాదియై సొక్కు కోయిల*
 *జేరునే కుటజములకు*

రసాల మావి చిగురులు
 రుచి చూసి ఆనందించు
రాగాల కోయిల మరల
అడవిపూల వైపు పోవునా

*పూర్ణేందు చంద్రికాస్ఫురిత*
*చకోరక మరుగునే సాంద్ర* *నీహారములకు*

పున్నమివెన్నెల నీటిచుక్కలు
రుచి చూసి ఆనందించు
చకోర పక్షి మరల
పొగమంచు వైపు పోవునా

*అంబుజోదర దివ్య*
 *పాదారవింద* *చింతనామృత*
 *పాన విశేష మత్త*

పద్మనాభ పాదామృతం
రుచి చూసి ఆనందించు
భక్తిలో నుండి మరలగలనా

*చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?*

ఎలా నా మది  ఇంకోవైపు
 మరలును ?
చక్కని గుణశీల వేయి మాటలేల ?