2, ఆగస్టు 2018, గురువారం

గుణత్రయ విభాగ యోగం* భగవద్గీత 14 -1,2,3,4

భగవద్గీత భావగానం
 సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *గుణత్రయ విభాగ యోగం*
 భగవద్గీత 14 వ అధ్యాయం


శ్లో1.
 వివరించెదను  పరమమైనది
జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమిది
ఇది తెలిసిన మునులనందరు
పూర్వము పరమసిద్ధి పొందిరి

శ్లో2.
ఈ జ్ఞానమును  పొందినవారు
నా సాన్నిధ్యము పొందినవారు
మరలమరల వారు జనించరు
ప్రళయాన వారు మరణించరు

శ్లో3.
ఈ ప్రకృతిలో నేనే ప్రవేశింతును
మహా  సృష్టి  బీజం  ఉంచెదను
సకల  జీవులను  పుట్టించెదను
అలా  జరుగుచున్నది  అర్జునా

శ్లో4.
అన్ని జీవ గర్భము లందు
నేనే విత్తనముంచు మూర్తిని
ఈ ప్రకృతే మహా గర్భము
నేనే తండ్రిని  బీజ దాతను



🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 రచన:
S S S S  Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి