2, ఆగస్టు 2018, గురువారం

భాగవత మాణిక్యాలు

🙏🙏🙏🙏🙏🙏🙏
భాగవత  మాణిక్యాలు
🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీహరి భక్తుడు  ప్రహ్లాదుడు
హరి భక్తి అనే తేనెరుచి   వివరించుట 

*మందార మకరంద*
*మాధుర్యమున దేలు*
*మధుపంబు వోవునే*
*మదనములకు*

మందారపూల  మకరందం
 రుచి  చూచి ఆనందించు
తుమ్మెద మరల ఉమ్మెత్త
 పూల వైపు పోవునా

*నిర్మల మందాకినీవీచికల*
 *దూగు రాయంచ చనునే* *తరంగిణులకు*
మందాకినినది మంచినీరు
రుచి చూసి ఆనందించు
రాజహంస మరల
చెరువు వైపు పోవునా

*లలిత రసాల పల్లవ*
 *ఖాదియై సొక్కు కోయిల*
 *జేరునే కుటజములకు*

రసాల మావి చిగురులు
 రుచి చూసి ఆనందించు
రాగాల కోయిల మరల
అడవిపూల వైపు పోవునా

*పూర్ణేందు చంద్రికాస్ఫురిత*
*చకోరక మరుగునే సాంద్ర* *నీహారములకు*

పున్నమివెన్నెల నీటిచుక్కలు
రుచి చూసి ఆనందించు
చకోర పక్షి మరల
పొగమంచు వైపు పోవునా

*అంబుజోదర దివ్య*
 *పాదారవింద* *చింతనామృత*
 *పాన విశేష మత్త*

పద్మనాభ పాదామృతం
రుచి చూసి ఆనందించు
భక్తిలో నుండి మరలగలనా

*చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?*

ఎలా నా మది  ఇంకోవైపు
 మరలును ?
చక్కని గుణశీల వేయి మాటలేల ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి