2, ఆగస్టు 2018, గురువారం

గుణత్రయ విభాగ యోగం భగవద్గీత 14- 9 to 13

భగవద్గీత భావగానం
 సరళంగా సులభంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *గుణత్రయ విభాగ యోగం*
 భగవద్గీత 14- 9 to 13

శ్లో9.
సత్వగుణము సుఖము నందు
రజో  గుణము  కర్మల    నందు
తమోగుణము  అజ్ఞానమందు
మురిపించి ఆపదల నుంచును

10శ్లో.
రజో , తమోలు తగ్గిన
సత్వగుణము పెరుగును
సత్వ , తమోలు తగ్గిన
రజోగుణము పెరుగును
సత్వ , రజోలు   తగ్గిన
తమోగుణము పెరుగును

11,12&13 శ్లో.
సత్వాన దేహం ప్రకాశించును
జ్ఞాన ప్రకాశము కనిపించును
రజో గుణాన లోభముండును
పని తపన అశాంతి ఉండును
తమోగుణాన బద్ధకముండును
అజ్ఞానము మోహముండును

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 రచన:
S S S S  Syamalarao
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి