7, జులై 2017, శుక్రవారం

మంత్ర పుష్పం తెలుగు పాట 1,2

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్ర పుష్పం*.   1.

*ఓం ధాతా పురస్తాద్య ముదా జహార*
*శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః  చతస్రః*
*తమేవం విద్వానమృతమిహ భవతి*
*నాన్యః పంథా అయనాయ విద్యతే*

భావ గానం:
అన్ని దిక్కుల నుండి రక్షించువానినోయి
ముందు బ్రహ్మ పూజించి సుఖించెనోయి
ఆ ఆది దైవమును తెలిసిన చాలునోయి
అదే అందరికి అమృత మార్గమ నోయి
వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించె నోయి
మూలం :వేదం
భావగాన రచన:syamalaraossss
🙏🙏🙏🙏🙏🙏🙏🙏


🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్ర పుష్పం* 2.

 *సహస్ర శీర్షం దేవం*
*విశ్వాక్షం విశ్వశంభువం*
*విశ్వం నారాయణం దేవం*
 *అక్షరం పరమం పదం*

భావ గానం:
 
అంతటా తలలున్న దేవమోయి
అంతటా కనులున్న దైవమోయి
అన్ని లోకాల శుభ  దైవమోయి
విశ్వమంతానిండిన దైవమోయి
నశించని నారాయణుడోయి
ముక్తి నీయు పరంధాముడోయి

మూలం : వేదం
భావ గాన రచన: syamalaraossss
🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి