21, జులై 2017, శుక్రవారం

Mantra pushpam telugu paata meaning

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్ర పుష్పం -సందర్భం*

 హిందూ ఆలయాలలో పూజల చివరిలో పూజారి గారు అక్కడ ఉన్న అందరికి తలో ఒక  పుష్పం ఇచ్చి  వేదం లోని *మంత్రపుష్పం* చదువు తారు. ఆ తరువాత ఆ పుష్పాలను భక్తుల నుండి స్వీకరించి  గర్భగుడి లోని దైవానికి సమర్పిస్తారు . వేదం లో భాగమైనది మంత్ర పుష్పం.
ఇది దైవం గురించి ఆయాన విశిష్టతను తెలుపు తుంది
[07/07, 4:19 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్ర పుష్పం*.   1.

*ఓం ధాతా పురస్తాద్య ముదా జహార*
*శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః  చతస్రః*
*తమేవం విద్వానమృతమిహ భవతి*
*నాన్యః పంథా అయనాయ విద్యతే*

భావ గానం:
అన్ని దిక్కుల నుండి రక్షించువానినోయి
ముందు బ్రహ్మ పూజించి సుఖించెనోయి
ఆ ఆది దైవమును తెలిసిన చాలునోయి
అదే అందరికి అమృత మార్గమ నోయి
వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించె నోయి
మూలం :వేదం
భావగాన రచన:syamalaraossss
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[07/07, 5:50 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్ర పుష్పం* 2.

 *సహస్ర శీర్షం దేవం*
*విశ్వాక్షం విశ్వశంభువం*
*విశ్వం నారాయణం దేవం*
 *అక్షరం పరమం పదం*

భావ గానం:
 
అంతటా తలలున్న దేవమోయి
అంతటా కనులున్న దైవమోయి
అన్ని లోకాల శుభ  దైవమోయి
విశ్వమంతానిండిన దైవమోయి
నశించని నారాయణుడోయి
ముక్తి నీయు పరంధాముడోయి

మూలం : వేదం
భావ గాన రచన: syamalaraossss
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[08/07, 7:05 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్ర పుష్పం*  3.

*విశ్వతః పరమాన్నిత్యమ్*
*విశ్వం నారాయణగ్o హరిమ్*
*విశ్వమే వేదం పురుషస్త*
 *ద్విశ్వ ముపజీవతి*


విశ్వము కన్నా ఉన్నతుడోయి
 అందరిలోనుండు ఆత్మోయి
శాశ్వత పోషకుడు హరోయి
సర్వాత్మడు పరమాత్ముడోయి
ఈ విశ్వ లోకాల కారకుడోయి
ఆ దైవమే విశ్వానికి తోడోయి
[10/07, 6:15 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్రపుష్పం -తెలుగుభావం*  4.

*పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o*
 *శాశ్వతగ్oశివమచ్యుతమ్*
*నారాయణం మహాజ్ఞ్యేయమ్*
*విశ్వాత్మానం పరాయణం*

భావగానం:
పతిలా పోషించువాడు
లోకాలకు ఈశ్వరుడు
శాశ్వితుడు శుభకరుడు
సకల లోక ఉన్నతుడు
సకల జీవ నాయకుడు
అతడు నారాయణుడు
అతడు మహా దేవుడు
లోకమంత ఆత్మ వాడు
పూజింప తగు దేవుడు
[10/07, 7:40 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్ర పుష్పం తెలుగు భావం* 5.

*నారాయణ పరో*
*జ్యోతి రాత్మా*
 *నారాయణః పరః*
*నారాయణ పరమ్*
*బ్రహ్మ తత్వం*
*నారాయణః పరః*
*నారాయణ పరో*
*ధ్యాతా ధ్యానం*
*నారాయణః పరః*

తెలుగు భావం

నారాయణుడే  పరమలోకము
నారాయణుడే జ్యోతిరూపము
 నారాయణుడే ఆత్మ రూపము
నారాయణుడే  పరబ్రహ్మము
నారాయణునే  ధ్యానిoచుము
[10/07, 7:42 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*మంత్ర పుష్పం తెలుగు భావం* 6.

 *యచ్చకించి జ్జగత్సర్వం* *దృశ్యతే శ్రూయతే౭ పివా*
*అంతర్బహిశ్చ తత్సర్వం* *వ్యాప్య నారాయణ స్స్థితః*

భావం:
 చూసే దంతా  వినే దంతా
లోకమంతా  మారే దంతా
లోనా బైటా వుండే దంతా
పైనా కింద  వుండే దంతా
నారాయణుడే అ దంతా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[12/07, 5:13 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్రపుష్పం*శ్లో 7.& 8
*తెలుగు భావగానం*

 *అనంతమవ్యయం*
*కవిగ్o సముద్ద్రే౭ న్తమ్*
*విశ్వశంభువం*
*పద్మకోశ ప్రతీకాశగ్o*
*హృదయం చాప్యధోముఖం*

*అధోనిష్ట్యా వితస్యాన్తే*
*నాభ్యా ముపరి తిష్ఠతి*
*జ్వాలామాలాకులం భాతి*
*విశ్వాస్యా౭యతనం మహత్*


అంతు లేనివాడు
నశించని వాడు
అన్ని తెలిసినవాడు
సంసార సాగర హరుడు
సకల జీవుల శుభుడు

మెడకు జానెడు కిందోయి
నాభికి జానెడు పైకోయి
ఎర్ర తామరమొగ్గలా
 గుండె వుండునోయి
దిగువకు చూచునోయి
అగ్ని లా ప్రకాశమోయి
అదే ప్రాణి స్థానమోయి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: వేదం
తెలుగు భావం:శ్యామలారావుssss
[12/07, 1:50 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *మంత్రం పుష్పం* శ్లో. 9 &10
తెలుగు భావ గానం

*సంతతగ్o శిలాభిస్తు*
*లమ్బత్యా కోశ సన్నిభమ్*
*తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం*
*తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితమ్*

*తస్యమధ్యే మహానగ్ని*
 *ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః*
*సో ౭ గ్రభుగ్వి భజంతిష్ఠ*
 *న్నాహార మజరః కవిః*
*తిర్యగూర్ధ్వ మధశ్శాయీ*
 *రశ్మయస్తన్య సన్తతా*


తెలుగు భావగానం:

అదే హృదయ నివాసము
నాడి నరముల కమలము
వేడి వెలుగుల మయము  
దానికి ఉంది చిన్నరంద్రము
అందే  ఉంది అగ్నిసర్వము

అనంతమైన అగ్నిరూపము
విశ్వము ముందు ప్రకాశము
తన  ముందున్నది తినును
ఆహారముగా విభజించును
అన్నీ వైపులా అందించును
మీదకి కిందకి అందించును
తేజో సంతానము పంపును

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం : వేదం
రచనం:శ్యామలరావుssss
[13/07, 6:18 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మంత్రం పుష్పం* శ్లో.11&12
తెలుగు భావ గానం

*సంతాపయతి స్వం దేహ*
 *మాపాద తల మస్తకః*
*తస్య మధ్యే వహ్ని శిఖా*
 *అణీ యోర్ధ్వా వ్యవస్థితః*

*నీలతో యద మధ్యస్థా*
 *ద్విద్యుల్లేఖే వ భాస్వరా*
*నీవార సూక వత్తన్వీ పీతా*
 *భాస్వత్యణూపమా*

తెలుగు భావం:
పాదాల నుండి తలవరకోయి
వేడిసెగలు అందించు నోయి
అది మహాగ్ని చక్రము మోయి

మధ్య పుల్లలానిలచిన దోయి
పైకిచేరు అగ్నిశిఖల తోడోయి
ఉన్నత చక్రము కాంతులోయి

బంగారురంగు మెరుపు కాంతులోయి
నీలిమబ్బుల  మెరుపు కాంతులోయి
బియ్యపుగింజ చివర ములకంతోయి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం : వేదం
రచనం:శ్యామలరావుssss
[14/07, 5:56 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రం పుష్పం .13.
తెలుగు భావ గానం

*తస్యా శ్సిఖాయ మధ్యే*
*పరమాత్మా వ్యవస్థితః*
*స బ్రహ్మ సశివ స్సహరి స్సేన్ద్ర*
*స్సో౭క్షరః పరమస్స్వరాట్*


తెలుగు భావం:

ఆ అగ్ని పైభాగ మధ్యనోయి
అదే పరమాత్మ నివాసమోయి
అతడే బ్రహ్మ  అతడే శివుడు
అతడే హరి  అతడే ఇంద్రుడు
అతడే నశించని పరమాత్మడు
అతడే నడిపించు పాలకుడు

ఓం ఇది శ్రీ కృష్ణ యజుర్వేదము లోని
తైత్తరీయ అరణ్యక మందు
 పదవ పాఠకమున  
నారాయణ ఉపనిషత్ లో
13వ అనువాకము సమాప్తము.
[14/07, 2:31 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మంత్రపుష్పం 14.
తెలుగుభావం గానం

 *యో ౭ పాం పుష్పం వేద* *పుష్పవాన్ ప్రజావాన్* *పశుమాన్ భవతి*
*చన్ద్రమావా అపాం పుష్పం*
 *పుష్పవాన్ ప్రజావాన్* *పశుమాన్ భవతి*
*య ఏవంవేద*

తెలుగు భావగానం

ఎవరు నీరే పూవులని తెలిసేదరో
వారు స్త్రీలు ప్రజలు పశువులు పొందెదరు

ఎవరు చంద్రుడే నీరు పూవులని తెలిసెదరో
వారు స్త్రీలు  ప్రజలు పశువులు పొందెదరు .
[14/07, 8:38 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్ర పుష్పం15.
తెలుగు భావ గానం

 *యో౭పామాయతనం*
 *వేద,ఆయతనవాన్ భవతి*
*అగ్నిర్వా అపామాయతనం*
 *వేద,ఆయతనవాన్ భవతి*
*యో ౭ గ్నే రాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*అపోవా ఆగ్నేరాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*

ఎవరు నీటి స్థానము ఎరుగుదురో
వారు నీటి స్థానము పొందెదరు
ఎవరు నిప్పే నీటికి ఆధారమని
ఎరుగుదురో
వారునిప్పు స్థానముపొందెదరు
ఎవరు నిప్పుకి నీరే ఆధారమని ఎరుగుదురో
వారు నీటి స్థానము పొందెదరు
నీటికి నిప్పు, నిప్పుకి నీరు ఆధారముని ఎరుగుదురోవారే తెలిసినవారు

మూలం : వేదం
తెలుగురచన: శ్యామలరావుssss
[16/07, 10:09 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్ర పుష్పం16
తెలుగు భావగావం


*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*వాయుర్వా అపాం ఆయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యోవాయో రాయతనం*
 *ఆయతనవాన్ భవతి*
*అపోవై వాయోరాయతనం*
 *ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*

 (నీరు = హైడ్రోజన్ గాలి + ఆక్సీజన్ గాలి)

ఎవరు నీటి  నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు

ఎవరు గాలి నీటిదని తెలిసెదరో
వారు ఆ నివాసము పొందెదరు

ఎవరు గాలి నివాసమెరిగెదరో
వారు ఆ నివాసము  పొందెదరు


ఎవరు నీరే గాలిదని తెలిసెదరో
వారు ఆనివాసము పొందెదరు.
[16/07, 10:18 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్ర పుష్పం 17
తెలుగు భావగావం.

*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*అసౌవై తపన్నపా మాయ తనం*
*ఆయతనవాన్ భవతి*
*ఆముష్య తపత ఆయతనంవేద*
*ఆయతనవాన్ భవతి*
*అపోవా ఆముష్య తపత*
 *ఆయతనం ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*


( హైడ్రోజన్ + ఆక్సీజన్ = 💥🔥+నీరు)

ఎవరు నీటి నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు

సూర్య తేజో నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు

నీరు జ్వాలల  బంధ మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం :వేదం
తెలుగు రచన: శ్యామలరావుssss
[17/07, 6:17 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రపుష్పం  18.

*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*చన్ద్రమా వా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యశ్చన్ద్ర మసఆయతనం*
*వేద ఆయతనవాన్ భవతి*
*అపోవై చన్ద్రమస ఆయతనం*
*ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*

Water &Moon stay  linked
☔🌨🔀🌜
భావ గానం:

ఎవరు నీటి నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు
నీరు చంద్రుని దని  తెలిసెదరో
వారు ఆ నివాసము పొందెదరు
ఎవరు చంద్ర నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు
నీరుచంద్రుల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు

[20/07, 8:20 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్ర పుష్పం19.

 *యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*నక్షత్రాణివా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యో నక్షత్రాణా మాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*అపోవై నక్షత్రాణా మాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*

☔🌊🔁⭐
Water 's house is star
Star's house is water


తెలుగు భావ గానము:

ఎవరు నీటి నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు

నక్షత్రాలకు నీరు నివాసమని
నీటికి నక్షత్రాలు నివాసమని

నీరు, తారల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[20/07, 8:33 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్ర పుష్పం20.

*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*పర్జన్యో వా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యః పర్జన్యస్యాయతనం* *ఆయతనవాన్ భవతి*
*అపోవై పర్జన్య స్యాయతనంవేద* *ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*

🌊☔🔁🌨💨
Water is house of cloud
Cloud  is house of water
తెలుగు భావ గానం:

ఎవరు నీటి నివాసమెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు

మబ్బులు నీటి నివాసమని తెలిసెదరో
వారు ఆ నివాసం పొందెదరు

మబ్బు , నీరుల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[20/07, 8:37 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్ర పుష్పం21


*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*సంవత్సరో వా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యస్సంవత్సరస్యాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి
అపోవై* *సంవత్సరస్యాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*
☔🌨⏩🗓
Water's house is year
Year's house is water

తెలుగు భావ గానం:

ఎవరు నీటి నివాసమెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు

నీరు సంవత్సర నివాసని తెలిసెదరో
వారు ఆ నివాసం పొందెదరు

సంవత్సరము నీరు నివాసని తెలిసెదరో
వారు ఆ నివాసం పొందెదరు


నీరు ,సంవత్సరాల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏



[20/07, 1:21 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మంత్రపుష్పం 23

*కిం తద్విష్ణోర్బల మాహుః*
*కా దీప్తిః కిం పరాయణం*
*ఏకొ యధ్ధారాయ ద్దేవః*
*రేజతీ రోదసీ ఉభౌ*

భూమి ఆకాశాలు రెండూనోయి
విష్ణువే భరించు దైవమోయి

అంత బలమెలా పొందెనోయి
అందుకు కారణమే మోయి
[20/07, 1:53 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏

మంత్రం పుష్పం24.

 *వాతాద్విష్ణోర్బల మాహుః*
 *అక్షరాదీప్తిః రుచ్యతే*
*త్రిపధా ద్దారయః ద్దేవః*
 *యద్విష్ణో రేక ముత్తమమ్*

వాయువు వలన బలమోయి
శాశ్వతమునుండి తేజమోయి
త్రిపాద విభూతుల నుండోయి
ఇహ పరములు రెండూనోయి
 పొందిన దైవము విష్ణువోయి
అందరి కన్న ఉత్తముడోయి
[20/07, 2:20 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రం పుష్పం25.
 *రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే*
*నమోవై యం వై శ్రవణాయ కుర్మహే*
*సమే కామాన్ కామకామాయ*
 *మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ*
 *దధాతు
కుబేరాయవై శ్రవణాయ*
*మహారాజాయ నమః*

 రాజులకు రాజైన దేవుడోయి
 పరులకు లాభాలీయునోయి
వైశ్రవణునకు వందనమోయి
సకల కోరికల యజమానోయి
మా కోరికలన్ని తీర్చునోయి
అతడే కుబేరుడు వైశ్రవణుడోయి
ఆ మహారాజుకు వందనమోయి
[20/07, 1:23 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రం పుష్పం26.

*ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,*
 *ఓం తదాత్మా
ఓం తత్సత్యమ్*
*ఓం తత్సర్వం , ఓం తత్పురోమ్ నమః*

తెలుగు పాట:

అతడే బ్రహ్మ మతడే వాయువు
అతడే సత్య  మతడే ఆత్మ
అతడే సర్వ  మతడే ఆదిదైవం
[20/07, 8:31 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రపుష్పం27.

 *అన్తశ్చరతి భూతేషు*
 *గుహాయామ్ విశ్వమూర్తిషు*

తెలుగు పాట:

జీవులందున్నవాడు
బయటా వున్నవాడు
తెలియని వాడు
 విశ్వమంతా వున్నవాడు
[20/07, 8:35 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మంత్రపుష్పం28.

*త్వం యజ్ఞ్యస్త్వం* *వషట్కారస్త్వం మిన్ద్రస్తగ్o* *రుద్రస్త్వం విష్ణుస్త్వం*
 *బ్రహ్మత్వం ప్రజాపతిః*
*త్వం తదాప ఆపొజ్యోతీ*
 *రసో ౭ మృతం*
*బ్రహ్మ
భూర్భువస్సువరోమ్*

భావ గానం:
నీవే యాగము  యాగమంత్రము
నీవే  విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు
నీవే  జలము తేజము రసము
 నీవే శాశ్వతము  విశ్వరూపము
నీవే  ఓం కారబ్రహ్మవు
[20/07, 8:35 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రపుష్పం29.
 *ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*
 *స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*
*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*
*అస్తు సదా శివోమ్*

తెలుగు భావ గానం:

సకల విద్యలకు ఈసుడవు
సకల జీవులకు ఈసుడవు
నీవే బ్రహ్మ యజమాని
నీవే బ్రాహ్మల యజమాని
నీవే బ్రహ్మ సదాశివుడవు
[20/07, 8:36 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్ర పుష్పం30.

*తద్విష్ణో పరమం పదగ్o*
*సదా పశ్యన్తి సూరయః*
*దివీవ చక్షు రాతతమ్*

భావగానం:
ఆ విష్ణు లోకము నోయి
ఆ పరమ పధమునోయి
జ్ఞానులు సదా చూచేరోయి
ఆకాశమంతా చూచేరోయి
[21/07, 6:16 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రపుష్పం 31.

*తద్విప్రాసో విపన్వవో*
 *జాగృవాం స్సమిన్దతే*
*విష్ణోర్య త్పరమం పదమ్*

భావ గానం:
కోరికలు దోషాలు లేని వారు
జాగృతి చలనాలు కలవారు
విష్ణులోక కాంతులు పెంచేరు
పరలోక ప్రకాశము పెంచేరు
[21/07, 6:20 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రపుష్పం32.

*ఋతగ్o సత్యం పరమ్బ్రహ్మ*
*పురుషం కృష్ణ పింగళమ్*
*ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం*
*విశ్వరూపాయ వై నమో నమః*

భావగానం:

ముక్తినాధుడు సత్యరూపుడు
బ్రహ్మ రూపుడు నల్లనివాడు
పైకి వెలుగు  తేజోవంతుడు
విరూపనేత్రుడు విశ్వరూపుడు
దేవదేవునకు మరల వందనము.
[21/07, 6:27 AM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మంత్రపుష్పం33.

 *నారాయణాయ విద్మహే*
 *వాసుదేవాయ ధీమహి*
*తన్నో విష్ణు ప్రచోదయాత్*

తెలుగు భావం:

నారాయణుని ఉహించెదను
వాసుదేవుని ధ్యానించెదను
విష్ణు చైతన్యము  కలుగు గాక
[21/07, 6:08 PM] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంత్రపుష్పం34.
*ఆకాశ త్పతితం తోయమ్*
 *యథా గచ్ఛతి సాగరం*
*సర్వదేవ నమస్కారః*
*కేశవమ్ ప్రతి గచ్ఛతి*

తెలుగు భావ గానం:

ఆకాశ ధారాల నీరులు
ఎలా సాగరమే చేరునో
సకలదేవ వందనాలు
ఆ పరందామునే చేరును

మంత్రపుష్పం సంపూర్ణం
సర్వం భగవదర్పణం స్వాహా.

ఇటువంటి  మరికొన్ని అనువాదాల కోసం  సెర్చ్ ఇన్ గూగుల్
syamalaraossss.blog

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

23 కామెంట్‌లు:

  1. 21 లో....
    యో౭పామాయతనం వేద*
    *ఆయతనవాన్ భవతి*
    *సంవత్సరో వా అపామాయతనం*
    *ఆయతనవాన్ భవతి*
    *యస్సంవత్సరస్యాయతనం వేద*
    *ఆయతనవాన్ భవతి
    అపోవై* *సంవత్సరస్యాయతనం*
    *ఆయతనవాన్ భవతి*
    *య ఏవంవేద*...

    సంవత్సరం అనే పదానికి వర్షం పర్యాయ పదం అవుతుంది..... వర్షం అంటే నీరు అని కూడా అర్ధం ఉంది.... ఇలాగ కలుపు కో వచ్చు అనుకుంటూ ను.

    బాగా వ్రాసావు
    దీవనలు
    Snpgupta

    రిప్లయితొలగించండి
  2. Sir, అద్భుతం గా శెలవిచ్చారు. మీరు అనుమతిస్తే కాపీచేసుకొని ముఖపుస్తకంలో ప్రచురిస్తాను.

    రిప్లయితొలగించండి
  3. అర్థం తెలుసుకున్నాం,చాలా కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  4. సర్, తాత్పర్యం లేకుండా మంత్రపుష్పం మొత్తం కావాలి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడం రావట్లేదు. దయవుంచి నాకు వాట్సాప్ గానీ మెయిల్ గానీ చెయ్యవలరా? ధన్యవాదాలు. 8008431867

    రిప్లయితొలగించండి
  5. చాలా భక్తి శ్రద్ద లతో బాగా చేశారు. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. సర్ మంత్రపుష్పం యొక్క అంత రార్థాన్ని తెలుగులో తెలిసి ఆనందించాను.తమకు నమశ్శతములు.

    రిప్లయితొలగించండి
  7. Chala baga chepparu. Varsham ani chepthe enka bagundedhi.dhanyavadhalu, milanti vari avasaram etharani ki chala vundhi guru ji

    రిప్లయితొలగించండి
  8. Sir, Namaskaram, after 22nd verse you have not explained about "YO-PSUNAAVAM PRATHISHTITHAM VEDA--PRATHYEVA THISHTATHI". Is there any specific reason.

    రిప్లయితొలగించండి
  9. సహస్ర పరమా దేవి నుండి...ంమృ త్తి కె...పరమాంగటిం వరకు తెలుగులొ అర్ధం చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  10. sir, please explain the meaning of the slokas "Kaandaat kaandaat prarohanti parushah parushah pari, evaano duurvee pratanu sahasrena shatenucha"
    thank you.

    రిప్లయితొలగించండి
  11. Sir, very nice explanation. From 15th onwards if some more details given it is more beneficial to readers.

    రిప్లయితొలగించండి
  12. chala Bagundi. Mantra pushabhavanni saralamine Telugu lo andinchinanduku Namaskarmulu.

    రిప్లయితొలగించండి
  13. ఆర్యా,
    మంత్రపుష్పం ప్రతిపదార్ధం మరియు తాత్పర్యములతో సహా లభ్యమైతే చదివి తెలుసుకొనాలని ఉంది. అది మీ వద్ద ఉంటే దయచేసి నా మెయిల్ id కి pdf format లో పంపించవలసినదని మనవి.
    శ్యాం ప్రసాద్ గుండవరపు

    రిప్లయితొలగించండి