*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*3 వ రోజు పాసురము*
*లోకాలు కొలిచిన దేవుడోయి*
*వామనుని పూజింతు మోయి*
*వ్రతస్నానాల వనితల కోయి*
*వెంటనే కష్టాలు తీరా లోయి*
*పాల కుండలు నిండా లోయి*
*వానలు బాగ కురవా లోయి*
*పంటలు బాగ పండా లోయి*
*పూలలో తుమ్మెదలు లోయి*
*హాయిగా నిదురించా లోయి*
*సిరిసంపదలు నిండా లోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*4 వ రోజు పాసురము*
*ఓవరుణదేవ వానలు కురిపించ వోయి*
*సాగరాలనీరు నీమేఘాల నింప వోయి*
*నింగినిండ నీలిమేఘాల నింప వోయి*
*నీవు నీలమేఘ శ్యామరూపుడ వోయి*
*శంఖచక్రాల ఉరుముల మెరవ వోయి*
*సారంగ బాణాల ధారల కురవ వోయి*
*మామార్గశిర స్నానాలకై కురవ వోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*5 వ రోజు పాసురము*
*మాయ తొలగించువాడోయి*
*మధురనుండి వచ్చినాడోయి*
*యమునాతీర విహారుడోయి*
*గోకులరత్న దీపమతడోయి*
*యశోదగర్భ దీపమతడోయి*
*బంధించని దామోదరుడోయి*
*పవిత్రులమై పూజింతుమోయి*
*మనసారపాడి కీర్తింతుమోయి*
*పూవులపోసి అర్చింతుమోయి*
*పాపాలు తొలగించు వాడోయి*
: తిరుప్పావై 6 వరోజు పాశురం
గోదాదేవి గోపికను లేపుట
ఓ గోపిక పడక వీడవోయి
పక్షులెగిరె సఖి చూడవోయి
గుడి శంఖనాదమునోయి
వినవలె సఖి లేవవోయి
పూతన, శకటాదుల నోయి
చంపిన పన్నగ శయనునోయి
కోరి ధ్యానింప సఖి లేవవోయి
మునులు యోగులందరోయి
'హరి హరి' యని అందురోయి
మది పులకింప సఖి లేవవోయి
తిరుప్పావై 7 వ పాసురము
(తెలుగు పాట
రచన :శ్యామలారావు )
ఓ గోపబాల ,తలుపు తీయవోయి
ఈవేళ నిదురేల, మేలు కొనవోయి
ఆ జంటపక్షుల కూతలు వినవోయి
సువాసనల జడల గోపికలోయి
పెరుగు చిలికేె ధ్వనులు వినవోయి
ఓసఖియ నీవు వినవేల నోయి
కేశవుని కీర్తించు వేళయ నోయి
నిదురవీడుము నోము వేళయనోయి
: తిరుప్పావై 8వ పాసురము
(తెలుగు పాట
రచన :శ్యామలారావు )
తరుణి తూరుపు తెల్ల వారెనోయి
గోవుల మేతకు పోవుచున్నవోయి
తోటి గోపికలు వెళ్ళుచున్నారోయి
వారినాపి నీ కొరకై నిలిచామోయి
గోపికా వ్రతము చేయ రావోయి
కేశవుని కీర్తించు వ్రతము నోయి
కేసిని చంపినవాని సేవింతుమోయి
మనము తరలి వెళ్లిన నంతనోయి
తానే తరలి మనకై వచ్చు వాడోయి
తిరుప్పావై 9వ రోజు పాసురము
(తెలుగు పాట
రచన :శ్యామలారావు )
మణుల దీపకాంతుల మేడనోయి
మంచి మంచాన నిదురించె వోయి
మామ కూతురా మత్తువీడ వోయి
ఓ అత్త ,నీ వైన నిదుర లేప వోయి
వినదు పలుకదు ఏమయె నోయి
మాయలు మంత్రాలు పోవునోయి
మహామాయా మాధవా అనరోయి
మాధవుని నామాలు కీర్తించరోయి
: తిరుప్పావై 10వ రోజు పాసురము
(తెలుగు పాట
రచన :శ్యామలారావు )
నోముఫలాల సుఖించు వనితోయి
తలుపైనతీసి పలుకైన పలుకవోయి
తలపైన తులసిముడి కిరీటుడోయి
'పర'మందించు పరంధాముడోయి
కుంభకర్ణుని నిద్ర నీవు గెలిచేవోయి
తలుపుతీసి నోరారా పలుకవోయి
అడ్డుతీసి నీ దర్శన మీయరావోయి
: తిరుప్పావై 11వ రోజు పాసురము
(తెలుగు పాట
రచన :శ్యామలారావు )
గోవులు దూడలకై కేక లేసె నోయి
అందరు గోపాలసేవల వున్నారోయి
అందాల జడల ఆడ నెమలి వోయి
చుట్టాలు చెలులందరు వచ్చిరోయి
నీ ముంగిట కృష్ణుని కీర్తించే రోయి
ఉలకవు పలుకవు కీర్తించవేలోయి
ఎందుకే నీవింకా నిదురించేవోయి
తిరుప్పావై 12వ రోజు పాసురము
(తెలుగు పాట
రచన :శ్యామలారావు )
దూడలకు పాలీయు వేళాయనోయి
గోపాలులెవరు పట్టించుకొన రోయి
పొదుగుల పాలు నేల కారెనోయి
పాలధారలనేల బురద యెనోయి
కృష్ణని సేవలకువారు వెడలి రోయి
సఖీ మూడువిధాల తడిచె మోయి
మా తలలు మంచున తడిచె నోయి
మా పాదాలు క్షీరాల తడిచె నోయి
మా భావాలు భక్తి తో తడిచె నోయి
నీ వాకిలి ముంగిట వేలాడె మోయి
రావణ సంహారుని కీర్తించె మోయి
ఇదేమి నిదుర ఇకనైనా లేవ వోయి
నీ నిద్ర గోకుల మంతా తెలిసె నోయి
తిరుప్పావై -తెలుగు పాట
13వ రోజు పాసురము
( రచన :శ్యామలారావు )
బకాసురుని చంపెను కృష్ణుడోయి
లంకాసురుని చంపెను రాముడోయి
కల్యాణ గుణాలను కీర్తింతుమోయి
గోపికల వ్రతముచేయ వెడలి రోయి
తారలలో శుక్రుడుదయించె నోయి
తారలువీడి గురుడస్తమించె నోయి
నోముచేయ సమయ మయనోయి
పక్షులు లేచెను కమలాక్షి లేవోయి
చల్ల నీటిలో విరహ స్నానాలోయి
ముగ్ద మనోహరి మాగోపికవోయి
మనము కలిసి పోవుదమోయి
తిరుప్పావై -తెలుగు పాట
14వ రోజు పాసురము
( రచన :శ్యామలారావు )
నీ ఇంటి కలువలు చూడవోయి
ఎర్ర కలువలు వికసించె నోయి
నల్ల కలువలు మొగ్గలయెనోయి
ఎర్ర వలువల సాధువులోయి
తెల్ల వలువల యోగులోయి
కోవెలలు తీయ పోయిరోయి
అందరిని లేపెదనంటివోయి
గొప్పమాటకారివి లేవవోయి
నీ గుండెల నిండిన వానినోయి
అందరము కలిసి పాడ రావోయి
తిరుప్పావై -తెలుగు పాట
15 వ రోజు పాసురము
రచన :శ్యామల రావు
(గోపికల మాటల సంవాదము)
చిలుక పలుకుల గోపిక వోయి
ఇంకా నిదుర లేవ వేల నోయి
సఖులారా అలా అనకోయి
చికాకు మాటలు ఏలనోయి
నా మది జివ్వు మనే నోయి
నీవు మాటల నేర్పరివోయి
పోనిండు ,నేను కఠిన నోయి
మీరె మాటల నేర్పరులోయి
అంతా వచ్చార తెలుపరోయి
అంతా వచ్చారు చూడవోయి
వచ్చి నేనేమి చేయవలెనోయి
ఏనుగుల పీడ వదిలించెనోయి
శత్రువుల పీడ వదిలించెనోయి
ఆ గోపాలుని కీర్తించెద మోయి
తిరుప్పావై -తెలుగు పాట
16 వ రోజు పాసురము
రచన :శ్యామల రావు
(గోపికల )
ద్వారపాలక తలుపు తీయవోయి
గోపికలము లోనికి పోనీయవోయి
అందాలధ్వజము తోరణా లోయి
మణిివెలుగుల దేవాలయమోయి
తలుపుల తాళాలు తీయ ఏవోయి
మహామాయావి పరంధాము డోయి
'పర 'మిచ్చెెదనని మాటిచ్చె నోయి
వేరేమి కోరని గోప వనితల మోయి
వాని సుప్రభాతము పాడుదమోయి
మమ్ము గుడి లోనికి పోనీయ వోయి
: తిరుప్పావై -తెలుగు పాట
17వ రోజు పాసురము
రచన :శ్యామల రావు
(గోపికల )
దాహమైన నీరోయి
ఆకలైన అన్నమొయి
కట్టుకును వస్త్రమొయి
దానమీయు వాడవోయి
మాస్వామీ లేవవోయి
ఓ యశోదా లేపవోయి
స్వామీ వామనుడవోయి
ఆకాశము కొలిచేవోయి
బహు బలవంతుడవోయి
అంత నిద్ర పోవలదోయి
బలరామ తమ్ముడనోయి
నీవు మరి నిద్ర లేపవోయి
ఇదే గోపికల ప్రార్ధనోయి
తిరుప్పావై - తెలుగు పాట
రచన : శ్యామలారావు s s.s.s
18 వరోజు పాసురము
ఏనుగంత బలవంతుడ తడోయి
ఏనుగు మద మణుచు వాడోయి
శత్రువంటే వెనకడుగు వేయడోయి
ఆ నంద గోపుని కోడలివి నీ వోయి
అందాలరాశివి మెరుపుతీగ వోయి
సువాసనల కేశాపాసాల నీళవోయి
మాధవీలతపై కోకిిలలు కూసెనోయి
తెల్లవారినది చిన్నదాన చూడవోయి
మీ బావను కీర్తించ వచ్చితి మోయి
నీవు సంతోషముగ నడిచి రావోయి
ఎరుపుకమలాల పూల చేతులోయి
కరముల గాజులు గల్లు మననోయి
చెంగున నువు తలుపు తీయవోయి
తిరుప్పావై - తెలుగు పాట
రచన : శ్యామలారావు s s.s.s
19 వరోజు పాసురము
దీపాల గుత్తుల వెలుగుల నోయి
ఏనుగు దంతాల మంచాలనోయి
తెల్లని మెత్తని పానుపుపై నోయి
పూవుల గుత్తులు తలపై నోయి
అందాల నీళతో పవళించే వోయి
నీళాగుండెలాను విశాలుడవోయి
నీళా,కాటుక కనుల విశాల వోయి
నీప్రియుని నీవిక లేవనీయ వోయి
చిన్నఎడబాటు తాళలేని నీళవోయి
గోపీకా నీవు మాతో మాట్లాడవోయి
అపురూప లావణ్య సుందరివోయి
ఈగుణము నీరూపానికి తగదోయి
తిరుప్పావై - తెలుగు పాట
రచన : శ్యామలారావు s s.s.s
20 వ రోజు పాసురము
33 కోట్ల దేవత లందరి కోయి
కష్టాలు కలుగక ముందే నోయి
శత్రుభయము పోగొడుదువోయి
అర్జవంతుడవు రక్షింతు వోయి
విమలుడవు బలవంతుడవోయి
వాసుదేవుడవు నీవుమేలుకోవోయ
సన్ననడుము సుందరవదనవోయి
అందాలనీళా ,నీవు వరలక్ష్మీవోయి
కంచు అద్దాలు వింజామర లోయి
సేవలకొరకు మాకందించ లేవోయి
ఓపూర్ణవతి,మేము గోపికలమోయి
శ్రీకృష్ణునితో స్నానాలుచేయాలోయి
తిరుప్పావై - తెలుగు పాట
రచన : శ్యామలారావు s s.s.s
21 వ రోజు పాసురము
ఆవుల పాలు ధారగా కారేనోయి
కుండలు నిండి పాలు పొంగెనోయి
గోవులగుంపుల గోపాలనందనోయి
నీవు సత్యమైన పరమాత్మ వోయి
నిను కోరువారిని రక్షించుదు వోయి
లోకాలకు జ్యోతి స్వరూపుడవోయి
మహామహిమాల సంపన్నుడవోయి
నిదుర నుండి నీవు మేల్కొనవోయి
శత్రువులు నీపాదదాసు లయిరోయి
నీ పాదపద్మాలు వీడుండ లేమోయి
నీ పాదాలు కీర్తించ వచ్చితి మోయి
మంగళాశాసనములు చేతుమోయి
తిరుప్పావై - తెలుగు పాట
రచన : శ్యామలారావు s s.s.s
22 వ రోజు పాసురము
సుందర విశాల దేశాలరాజు లోయి
ఓడిరి అహంకారము వీడితి రోయి
గుంపుగుంపుల నిను చేరితి రోయి
మా అహంకారము వీడితి మోయి
గుంపు గుంపుల వచ్చితి మోయి
చిన్నగంట వలె మోమున నోయి
ప్రేమ కురిపించు కనులతోనోయి
మా వైపు కరుణగా చూడ వోయి
నీ ఎర్రని కమల నేత్రల చూపులోయి
నింగిలో జంట సూర్య చంద్రోదయాలోయి
మా కర్మల శాపాలు నశించునోయి
తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*23వ రోజు పాసురము*
*కొండగుహలో వర్షా కాలమందోయి*
*కదలక నిద్రించు సురసింహమోయి*
*లేచి జూలు విదిలించి నటులోయి*
*నలువైపుల దొర్లి నిలిచినటులోయి*
*చుట్టూ చూసి గర్జించి నటులోనయి*
*నీలశరీర నీమందిరము నుండోయి*
*నీరాకను చూడ రమణీయమోయి*
*లోకోత్తమ నీకు సింహాసనమోయి*
*నీవుకూచుని మాప్రార్ధన వినవోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*24వ రోజు పాసురము*
*లోకాలు కొలిచిన పాదాలకు శుభమోయి*
*లంకను గెలిచిన చేతులకు శుభమోయి*
*శకటుని చంపిన బాలునకు శుభమోయి*
*దూడాసురుని విసిరినవానికి శుభమోయి*
*గిరిని గొడుగుగా ఎత్తినవానికి శుభమోయి*
*శత్రువుని చిత్తు చేయువానికి శుభమోయి*
*రోజూ మేము కీర్తింతుమని తెలియవోయి*
: *తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*25వ రోజు పాసురము*
*దేవకీ దేవిబిడ్డగాపుట్టితివోయి*
*యశోదాబిడ్డగా పెరిగితివోయి*
*కంసుడుకిట్టక కీడుకోరె నోయి*
*ఆఎత్తులునుచిత్తుచేసే వోయి*
*ఇహమున 'పరము'ఇచ్చేవోయి*
*లక్ష్మికోరిన ఐశ్వర్యము వోయి*
*నీపాటపాడి పొంగుదుమోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*26వ రోజు పాసురము*
*మార్గశిర మాస స్నానాలు చేసే మోయి*
*మాధవా నీవు నీలమణి కాంతుడ వోయి*
*మాపూర్వులు ఆచరించిన వ్రత మోయి*
*వ్రత వస్తువులు తెలిపెదను విను మోయి*
*లోకాలవణికించు నాదమీయు శంఖాలోయి*
*పాలరంగు పాంచజన్యము వంటి వోయి*
*పెద్దపొడవైన పఱబూర వాద్యా లోయి*
*మంగళదీపాలు మంచి గాయకు లోయి*
*మేలు వస్త్రము జెండాలు కావ లెనోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*27వ రోజు పాసురము*
*కూడని వారిని కూడ గెలిచే వోయి*
*కల్యాణగుణ గోవిందుడవు నీ వోయి*
*నిను కీర్తించి పరము పొందే మోయి*
*మా కందరికి అదే పెద్ద సన్మాన మోయి*
*లోకులు మెచ్చేల తయారవుద మోయి*
*గాజులు జుంకాలు దిద్దులు వంకీ లోయి*
*పూలు పావడలు పట్టీలు పెట్టే మోయి*
*పాలఅన్నము మునిగేల నేయి పోసోయి*
*చేతుల నేయిదారల ఆరగింతు మోయి*
*అందరూ కలిసి హాయిగా పాడ రోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*28వ రోజు పాసురము*
*గోవులను మేపు గోపాలురమోయి*
*ఏమీ ఎరుగని గోపాలకుల మోయి*
*ఏదో పుణ్యాన మాలో పుట్టావోయి*
*ఏ లోపాలు లేని గోవిందుని వోయి*
*మాస్వామి బంధము వీడని దోయి*
*మర్యాదలు వీడి ప్రేమగా మేమోయి*
*నీపేరెట్టి పిలిచేము మన్నించవోయి*
*కోపించక దయతో 'పర'మీయవోయి*
*అందరూకలిసి హాయిగా పాడరోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*29వ రోజు పాసురము*
*వేకువనే లేచి నీ చోటు చేరెద మోయి*
*తెల్లవారక ముందే పూజింతు మోయి*
*నీ పాటలు పాడి కీర్తించు వార మోయి*
*నిన్నే సేవించు బంగారు పూల మోయి*
*గో సేవ చేసి భోం చేయు వార మోయి*
*మా భావాలు వినతులు కాదన కోయి*
*పరము కోరెదము నిను వీడలే మోయి*
*ఏడేడు జన్మలు నీతోనే వుండా లోయి*
*నీ సేవలు మించి నిన్నేమి కోర మోయి*
*అందరూ కలిసి హాయిగా పాడ రోయి*
*తిరుప్పావై - తెలుగు పాట*
*రచన : శ్యామలారావు s s.s.s*
*30వ రోజు పాసురము*.
*ఫలశృతి*
*పడవల కడలి చిలికె నోయి*
*లక్ష్మిని పొందె కేశవు డోయి*
*చంద్రవదనాల భామలోయి*
*సిరి సంపదలు పొందిరోయి*
*క్రమముగా పాడువారినోయి*
*కృష్ణుడుచల్లగ చూచునోయి*
*రెండుచేతుల గోపాలుడోయి*
*నాలుగుచేతుల కాచునోయి*
*తమిళ శ్రీవెల్లిపుట్టూరునోయి*
*గోదా ముప్పయి పాడెనోయి*
*తులసీ దళమాలి శ్రీవారోయి*
*తామరబీజమాల వేసెనోయి*
*భోగి గోదా కళ్యాణ మోయి*
*గోదాకి శుభ మంగళమోయి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి