19, సెప్టెంబర్ 2018, బుధవారం

Medha suktam bgava gaanam

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *మేధా సూక్తం భావ గానం*
*Vedik prayer for wisdom*
🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: వేదం తైత్తిరీయ అరణ్యకం- 4.10.41

తెలుగు  ఆధార పుస్తకం:
*సస్వర వేద మంత్రాలు*
Ramakrishna mission publications
1.
ఓం మేధా దేవి సంతోష దాయిని
రావాలి విశ్వవ్యాపి శుభ దాయిని
1.
*ఓం మేధాదేవీ జుషమా’ణా న ఆగా”ద్విశ్వాచీ’ భద్రా సు’మనస్య మా’నా |*

2.
అజ్ఞానమాటలు ఆనందించేవారము
నీ దయతో మంచి ఙ్ఞానం పొందేము
సూరులతో గొప్పసత్యాలు పలికేము

 2 *త్వయా జుష్టా’ నుదమా’నా దురుక్తా”న్ బృహద్వ’దేమ విదథే’ సువీరాః |*

3.
మేధాదేవి దయ పొందిన వారు
ఋషులు బ్రహ్మజ్ఞాను లౌదురు
సకల దన సంపదలు పొందెదరు
మేధాదేవి దయ పొందిన వారు
పలురకాల సంపదలు పొందెదరు
మేధాదేవి మాకు సంపదలీయు గాక

3.   *త్వయా జుష్ట’ ఋషిర్భ’వతి దేవి త్వయా బ్రహ్మా’‌உ‌உగతశ్రీ’రుత త్వయా” |*
 *త్వయా జుష్ట’శ్చిత్రం వి’ందతే వసు సా నో’ జుషస్వ ద్రవి’ణో న మేధే ||*

4.
ఇంద్రుడు మాకు మేదస్సు నీయుగాక
సరస్వతి మాకు మేదస్సు నీయుగాక
మేధాదేవి మాకు మేదస్సు నీయుగాక
కలువల మాలల కవలలు అశ్వినీ
దేవతలు మాకు మేధస్సు నీయుగాక

4. *మేధాం మ ఇంద్రో దదాతు*
*మేధాం దేవీ సరస్వతీ |*

 *మేధాం మే అశ్వినా’వుభా-*
 *వాధ’త్తాం పుష్క’రస్రజా |*

5.
అప్సరసలు గంధర్వుల మేధస్సులు
మేధాదేవీ సరస్వతీ సుగంధాలు
మేధాదేవీ మాకు అందించు  గాక

 5.
 *అప్సరాసు చ యా మేధా*
*గంధర్వేషు చ యన్మనః |*
 *దైవీం మేధా సరస్వతీ సా మాం*
*మేధా సురభి’ర్జుషతాగ్ స్వాహా” ||*

6.
అలాటి మేధస్సునీయి ఏది
సకల సుగంధాలు నింపునో
అన్ని రూపాలు శోధించునో
బంగారు కాంతుల వెలుగో
బలమైన పాలతో పోషించు
పట్టి పరిశోధించు మేధస్సో

మామేధస్సు వికసించుగాక
మాకు శుభము కలుగుగాక

6.
*ఆమాం మేధా సురభిర్విశ్వరూపా*
 *హిరణ్య వర్ణా జగతీ జగమ్యా|*
 *ఊర్జస్వతీ పయసా*
 *పిన్వమానా సా మాం*
 *మేధా సుప్రతీకా జుషంతామ్ ||*

7.
మాకు మేధస్సు మాకు ప్రజలను
 అగ్నిదేవుడు తేజ  మీయు  గాక
మాకు మేధస్సు మాకు ప్రజలను
 ఇంద్రుడు ఇంద్రియ మీయు గాక
మాకు మేధస్సు మాకు ప్రజలను
 సూర్యుడు ప్రకాశ   మీయు గాక

7.
 *మయి మేధాం మయి ప్రజాం*
 *మయ్యగ్నిస్తేజో  దధాతు*
*మయి మేధాం మయి  ప్రజాం*
*మయీంద్ర ఇంద్రియం దధాతు*
*మయి మేధాం మయి  ప్రజాం*
*మయి సూర్యో భ్రాజో’ దధాతు||*

8.
ఓం ఙ్ఞానహంసను ఊహింతుము
పరమ జ్ఞానహంసను ధ్యానింతుము 
జ్ఞానహంస మాకు స్ఫూర్తి నీయు గాక

ఓం శాంతిః శాంతిః శాంతిః

8
*ఓం హంస హంసాయ విద్మహే*
*పరమ హంసాయ  ధీమహి |*
*తన్నో హంసః ప్రచోదయాత్ ||*

  *ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||*

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీకృష్ణార్పణం
రచన:శ్యామలరావుssss

13, సెప్టెంబర్ 2018, గురువారం

*శ్రీమహాలక్ష్మి స్త్రోత్రమ్* భావగానాం

🙏🙏🙏🙏🙏🙏🙏
*శ్రీమహాలక్ష్మి స్త్రోత్రమ్*
🙏🙏🙏🙏🙏🙏🙏

*సందర్భం*:
లక్ష్మీ దేవి పాల సముద్రం నుండి ఉద్భవించినపుడు
దేవేంద్రుడు  స్తుతించినది

*వారం తిది*
శుక్రవారం పంచమి

*మూలం*
దేవీభాగవతం-9 స్కందము

1)
*నమః కమల వాసిన్యై*
నమస్తే కమల వాసిని
*నారాయణ్యై నమోనమః*
నారాయణి నమస్తే నమస్తే
*కృష్ణ ప్రియాయై సతత౦*
ఎల్లవేళలా కృష్ణ ప్రియవు
 *మహాలక్ష్మ్యై నమోనమః!!*
మహాలక్ష్మి నమస్తే నమస్తే

2)
 *పద్మ పత్రేక్షణాయై చ*
పద్మ పత్రాల కనుల దేవి *పద్మాస్యాయైనమోనమః*
పద్మ రూపా నమస్తే నమస్తే
*పద్మాసనాయై పద్మిన్యై*
పద్మ ఆసనము  పద్మిని
*వైష్ణవ్యై చ నమోనమః!!*
వైష్ణవి దేవి నమస్తే నమస్తే

3)
 *సర్వస౦పత్స్వరూపిణ్యై*
సకల సంపదల రూపుణి
*సర్వారాధ్యాయై నమోనమః*
అందరు ఆరాదించుదేవి
నమస్తే నమస్తే
*హరిభక్తి ప్రదాత్ర్యై చ*
హరి భక్తి  కలిగించు దేవి
 *హర్షదాత్ర్యై చనమోనమః*
ఆనందం కలిగించుదేవి
నమస్తే నమస్తే
*కృష్ణ వక్షఃస్థితాయై చ*
కృష్ణ హృదయ వాసిని
 *కృష్ణేశాయై నమోనమః*
కృష్ణ హృదయేశ దేవి నమస్తే నమస్తే
*చ౦ద్రశోభా స్వరూపాయై*
చంద్ర శోభల స్వరూపిణి
 *రత్నపద్మే చ శోభనే!!*
రత్న పద్మాల శోభిని

4)
*స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై*
సంపదల అధికారిణి దేవి
 *మహాదేవ్యై నమోనమః*
మహాలక్ష్మి నమస్తే నమస్తే
*నమో బుద్ధిస్వరూపాయై*
బుద్ధి రూప దేవి
*బుద్ధిదాయ్యై నమోనమః!!*
బుద్ధినీయు దేవి నమస్తే నమస్తే
*యథామాతా స్తనా౦ధానా౦*
అమ్మలా పాలిచ్చి పెంచేవు
*శిశూనా౦ శైశవే సదా*
పసిబిడ్డలా సదా పోషించేవు
*తథా త్వ౦ సర్వదా మాతా*
అలా నీవే అన్ని వేళలా అమ్మా
*సర్వేషా౦ సర్వరూపతః!!*
అన్ని విధాల అన్ని రూపాల మాతవు
శ్రీమహాలక్ష్మి నమస్తే  నమస్తే

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ మహాలక్ష్మికి సమర్పణం
భావగాన రచన
శ్యామలరావుssss
🙏🙏🙏🙏🙏🙏🙏

సూర్యోపనిషత్* భావ గానం

🙏🙏🙏🙏🙏🙏🙏
🌞 *సూర్యోపనిషత్*
🙏🙏🙏🙏🙏🙏🙏
 భావ గానం

*ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం*
 *వ్యాఖ్యాస్యామ:*

ఓం! ఇది అథర్వణవేదం
 అంగిరస ఋషి వాక్యం
 సూర్యోపనిషత్ వివరం

*బ్రహ్మా ఋషి: !*
*గాయత్రీ ఛన్ద: !*
*ఆదిత్యో దేవతా !*

ఈ ఉపనిషత్ కు
బ్రహ్మ యే ఋషి
గాయత్రి యే వేద చందస్సు
ఆదిత్యుడే దైవము

*హంస: సోఁహమగ్ని*
*నారాయణయుక్తం బీజమ్ !*
*హృల్లేఖా శక్తి: !*

అగ్ని,నారాయణం బీజం 
హృదయ రచనం బలం

*వియదాదిసర్గ*
 *సంయుక్తం కీలకమ్ !*
*చతుర్విధపురుషార్థ* 
*సిద్ధ్యర్థే వినియోగ: !*

  మొత్తం సృష్టికి  మూలం
 నాలుగు పురుషార్థాల
 సాధనకు  ఉపయోగం

*షట్ స్వరారూఢేన బీజేన*
 *షడఙ్గం రక్తామ్బుజ*
 *సంస్థితం*
*సప్తాశ్వరథినం*

ఆరు స్వరాల విత్తనం
ఆరు అంశాల కారణం
ఎర్ర కమలాన నివాసం
ఏడుగుఱ్ఱాల రథదైవం

 *హిరణ్యవర్ణం చతుర్భుజం* *పద్మద్వయాఁభయవరదహస్తం*
*కాలచక్రప్రణేతారం* 
*శ్రీసూర్యనారాయణ*
 *య ఏవం వేద స వై బ్రాహ్మణ:*!!

 బంగారు రంగు దేహం
 నాలుగు చేతుల దైవం
 రెండుచేతుల పద్మాలు
ఒక చేయి వరదానం
ఒక  చేయి అభయం
కాలచక్రమే అవతారం
శ్రీ సూర్య నారాయణం 
నిన్నిలా తెలిసినవారే
వేదాలు తెలిసినవారు

*ఓ భూర్భువ సువ: !*
*తత్సవితుర్వరేణ్యం*
 *భర్గో దేవస్య ధీమహి* !
*ధి యో యో న: ప్రచోదయాత్ !*

ఓంకారం  నిరాకారం
భూ వాయు  సూర్యం
లోకాలు పుట్టించె దైవం
 నీ కాంతి శక్తి  ధ్యానం
 చేయును బుద్ది ఉత్తేజం

*సూర్య ఆత్మా*
 *జగతస్తస్థుషశ్చ* !
*సూర్యాద్వై ఖల్విమాని*
*భూతాని జాయస్తే !*
*సూర్యాద్యజ్ఞ:*
*పర్జన్యోఁన్నమాత్మా !*

మారేను  ఈ ప్రపంచము
 మారదు  సూర్యఆత్మ
 యాగం మేఘం అన్నము 
 అన్నిటా సూర్యఆత్మ

*నమస్తే ఆదిత్య !*
*త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి !*
*త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి !*
*త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి !*
*త్వమేవ ప్రత్యక్షం రుద్రోఁసి !*
*త్వమేవ ప్రత్యక్షం ఋగసి !*
*త్వమేవ ప్రత్యక్షం యజురసి !*
*త్వమేవ ప్రత్యక్షం సామాసి !*
*త్వమేవ ప్రత్యక్షమథర్వాసి !*
*త్వమేవ సర్వం ఛన్దోఁసి !*
సూర్యునకు వందనం
నీవే ప్రత్యక్ష  కర్తవు
నీవే ప్రత్యక్ష  కర్మవు
నీవే ప్రత్యక్ష క్రియవు
నీవే ప్రత్యక్ష బ్రహ్మవు
నీవే ప్రత్యక్ష విష్ణువు
నీవే ప్రత్యక్ష రుద్రు డవు
నీవే ప్రత్యక్ష ఋగ్వేదం
నీవే ప్రత్యక్ష యజుర్వేదం
నీవే ప్రత్యక్ష అధర్వవేదం
నీవే ప్రత్యక్ష సామ వేదం
 నీవే సకల వేదాల రూపం
*ఆదిత్యాద్వాయుర్జాయతే* !
*ఆదిత్యాద్భూమిర్జాయతే !*
*ఆదిత్యాదాపోజాయస్తే* !
*ఆదిత్యాజ్జ్యోతిర్జాయతే !*
*ఆదిత్యాద్యోమ దిశో జాయస్తే !*
*ఆదిత్యాద్దేవాః జాయస్తే !*
*ఆదిత్యాద్వేదాః జాయస్తే !*

సూర్యుని నుండే గాలి
సూర్యుని నుండే భూమి
 సూర్యుని నుండే నీరు
సూర్యుని నుండే కాంతి
సూర్యుని నుండే దిశలు
సూర్యుని నుండే ఆకాశం
సూర్యుని నుండే అంతరిక్షం
సూర్యుని నుండే దేవతలు
సూర్యుని నుండే వేదాలు
అన్ని నీ నుండే పుట్టాయి

*ఆదిత్యో వా ఏష*
 *ఏతన్మణ్డలం తపతి*!
*అసావాదిత్యో బ్రహ్మా!*

నీవే ఆదిత్య రూపం
నీదే సూర్యమండలం
నీదే తపస్సు ప్రకాశం
నీవే ఆదిత్య బ్రహ్మం

*ఆదిత్యోంత:కరణ*
 *మనోబుద్ధి  చిత్తాహంకారా:*!
*ఆదిత్యో వై వ్యాన*
*స్సమానోదానోఁపాన: ప్రాణ:*!
*ఆదిత్యో వై శ్రోత్ర*
*త్వక్ చశౄరసనధ్రాణా:*!
*ఆదిత్యో వై వాక్పాణి*
*పాద పాయుపస్థా:*!
*ఆదిత్యోవై శబ్ద స్పర్శ*
 *రూప రసగన్ధా:*!
*ఆదిత్యో వై వచనా*
 *దానాగమన విసర్గానన్దా:* !
*ఆనన్దమయో విజ్ఞానమయో*
*విజ్ఞానఘన ఆదిత్య:* !

సూర్యుడే మనసు బుద్దులు
 అహంకార అంతఃకరణాలు
 సూర్యుడే ప్రాణ అపానాలు
ఉదాన వ్యాన సమానాలు
సూర్యుడే పలుకులు
 చేతులు, పాదాలు
సూర్యుడే ద్వనులు స్పర్శలు
రూపాలు రసాలు వాసనలు
 సూర్యుడే మాటలు దానాలు
 రాకలు పోకలు ఆనందాలు

సూర్యుడే సకల
ఆనంద మయుడు 
విజ్ఞాన  మయుడు
విజ్ఞాన స్వరూపుడు

*నమో మిత్రాయ*
 *భానవే మృత్యోర్మా పాహి !*
*భ్రాజిష్ణవే విశ్వహేతవే నమ:* !

 మిత్రునకు   నమస్కారం
 ప్రకాశునకు నమస్కారం
చావు నుండి రక్షించుము
తేజోవంతునకు వందనం
విశ్వకారణునకు వందనం

*సూర్యాద్భవన్తి భూతాని*
 *సూర్యేణ పాలితాని తు* !
*సూర్యే లయం ప్రాప్నువన్తి*
 *య: సూర్య: సోఁహమేవ చ !*

 సూర్యుని వలన ప్రాణులు పుట్టును
 సూర్యుని వలన పాలింప బడును
సూర్యుని  వలన లయం అ వును
ఎవరు సూర్యుడో అతడే నేను

*చక్షుర్నో దేవ: సవితా*
*చక్షుర్న ఉత పర్వత:*
*చక్షు-ర్ధాతా దధాతు న:*

దివ్య నేత్రాల దైవం సృష్టి  నేత్రం
 కనుచూపులు మాకు నిండుతనం
దైవం మాకు దివ్య నేత్రాల  నీయు గాక

*ఆదిత్యాయ విద్మహే*
 *సహస్రకిరణాయ*
*ధీమహి !తన్న:*
*సూర్య: ప్రచోదయాత్* !

వేలాది ప్రకాశ కిరాణాల
సూర్యుని ధ్యానిస్తాము
మా మదిలో వుండు గాక
మాకు స్ఫూర్తినీయు గాక!

*సవితా పశ్చాత్తాత్*
*సవితా పురస్తాత్*
 *సవితోత్తరాత్తాత్*
*సవితా ధరాత్తాత్*
*సవితా న: సువతు*
 *సర్వతాతిఁ సవితా నో*
 *రాసతాం దీర్ఘమాయు:*

సృష్టే ముందూ సృష్టే వెనకా
సృష్టే  పైనా      సృష్టే క్రిందా
సృష్టే అంతా  ఆ సూర్యుడే
మాకు పూర్ణత నీయుగాక!
మాకు దీర్ఘాయుషు నీయుగాక

*ఓమిత్యేకాక్షరం బ్రహ్మా*
*ఘృణిరితి ద్వే అక్షరే*
*సూర్య ఇత్యక్షరద్వయమ్*
*ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి*
*ఏతస్వైవ సూర్యస్యాష్టాక్షరో మను:*

*ఓం* ఒక అక్షర  బ్రహ్మము
*ఘృణి*  రెండు  అక్షరాలు
*సూర్య* రెండు  అక్షరాలు
*ఆదిత్య* మూడు అక్షరాలు
*ఓం ఘృణిః సూర్యః* *ఆదిత్యః*
ఇది *సూర్యఅష్టాక్షరీ మంత్రం*

*యస్సదాహ రహ ర్జపతి*
*స వై బ్రాహ్మణో భవతి*

 ఎవరు నిత్యము జపిస్తారో
వారు  బ్రాహ్మణులవుతారు

*సూర్యాభిముఖో జప్త్వా*
 *మహావ్యాధి భయాత్* *ప్రముచ్యతే* !
*అలక్ష్మీర్నశ్యతి* !
*అభక్ష్య భక్షణాత్*   *పూతో భవతి*!
*అగమ్యాగమనాత్* *పూతో భవతి* !
*పతిత సంభాషణాత్ పూతో భవతి*
*అసత్ సంభాషనాత్ పూతో భవతి* !

సూర్యుని ముందు చదివిన
రోగాలు భయాలు పోవును
వారి బీదతనం నశించును
చెడుప్రాంత దోషం పోవును
చెడుఆహార దోషం పోవును
నీచులతొ మాటల దోషం పోవును
అసత్య మాటల  దోషం పోవును

*మధ్యాహ్నే సూర్యాభిముఖ: పఠేత్ !*
*సద్యోత్పన్నఞ్చ మహాపాతకాత్ ప్రముచ్యతే !*

మధ్యాన్నం సూర్య జపం
పంచ మహాపాపనాశనం

*సైషా సావిత్రీం విద్యాం*
 *న కించిదపి న కస్మై*
*చిత్ప్రశంసయేత్ !*

ఇది ప్రశంసా కాదు
ఇది తక్కువా కాదు
ఇదే సృష్టించు సావిత్రీవిద్య


*య ఏతాం మహాభాగ:*
 *ప్రాత: పఠతి, స భాగ్యవాన్*
*జాయతే పశూన్విన్దతి*!
*వేదర్థం జాయతే*


సూర్యోదయాన జపించిన
ధన  సంపదలు పొందెదరు
పశు సంపదలు పొందెదరు
వేద  సంపదలు పొందెదరు

*త్రికాలమేతజ్జప్త్వా*
*క్రతుశతఫలమవాప్నోతి*!

మూడు సంద్యలలో జపం
వంద యాగాల శుభఫలం 

*హస్తాదిత్యే జపతి*
*స మహామృత్యుం తరతి*

 హస్తానక్షత్ర రోజున సూర్యజపం
తొలగించును మహా మృత్యుగండం

*ఏవం వేద ! ఇత్యుపనిషత్ !!*

ఇది తెలియుదగు విషయం
ఇది సూర్యోపనిషత్ వివరం

*ఓం శాంతి: శాంతి: శాంతి:!!*

🌞🌞🌞

భగవద్గీతా భావగానం* పార్ట్ 1-7 *సరళంగా సులభం గా*

[05/09, 22:21] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 1
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

 యుద్ధాన పార్ధుడు కోరెను
  శ్రీకృష్ణుడు రథమును
  సేనల మధ్యన నిలిపెను

అర్జునుడు రెండువైపులా
యుద్ధమునకు  సిద్ధమైన
 తండ్రులను గురువులను
మామలను  సోదరులను
మనుమలను మిత్రులను
చూచి  బాధతో  పలికెను

బంధువులును జనులను
విజయం కోసం చంపలేను
రాజ్య సుఖం వలదు కృష్ణా

బాధ తో విల్లు బాణాలను
అర్జునుడు విడిచి పెట్టెను
 (1:32)

కృష్ణుడు పలికెను

దుఃఖింప తగని వారికోసం
దుఃఖించుట తగదు పార్థా

ఆత్మలు  ఆత్మలుకానివి
ఉండునని తెలిసినవారు 
అశాశ్వత శరీరముల కైన
శాశ్వతాలైన  ఆత్మల కైన 
వివేకులు  దుఃఖింపడరు (2:11)

ఎలా బాల్యం యవ్వనము
 వృద్ధాప్యల దేహం మారునో
అలా ఆత్మ దేహంమారును
కనుక ధీరులు మోహపడరు (2:13)

ఎలా మనిషి  పాత బట్టలు 
వీడి కొత్తబట్టలు ధరించునో
 అలా ఆత్మ పాత దేహము
వీడి కొత్తదేహం ధరించును  (2:22)

ఆత్మ నాశనం  లేనిది
ఆయుధం నరక లేదు
అగ్ని మండింప  లేదు
నీరు  తడుప     లేదు
గాలి ఆర్పివేయ లేదు
ఆత్మకు నాశనం లేదు  (2:23)

పుట్టినవానికి చచ్చుట తప్పదు
చచ్చిన వానికి పుట్టక తప్పదు
తప్పని వాటికై  శోకింప తగదు (2:27)

యుద్ధాన మరణించిన
వీరస్వర్గం  పొందెదవు
యుద్ధాన  జయించిన
రాజ్యము  పొందెదవు
గట్టిమదితో పోరాడుము (2:37)

పనులను  ఆచరించుటకే 
నీకు అధికారము కలదు
 కానీ  పనుల ఫలితాలపై
నీకు అధికారము   లేదు
కర్మఫల కారణం కారాదు
అట్లని కర్మలు మానరాదు (2:47)

దుఃఖాన కుంగనివాడు
సుఖాన  పొంగనివాడు
రాగ కోపాలుండనివాడు
 అతడే  స్థితప్రజ్ఞుడన బడును(2:56)
[08/09, 17:36] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 2
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

ఇంద్రియాల కోరికలు
విషయ  భోగాలను
సదా కోరువారికోయి
రాగము పెరుగును
 కామం  కలుగును
 కోపం    కలుగును
వివేకం  తరుగును
జ్ఞాపకం తరుగును
బుద్ధి    నశించును
పతనం కలుగును
(2:62)

ఆత్మజ్ఞానం కర్మపాలనం
బ్రహ్మను కోరు ప్రయత్నం 
దాటించును  సంసారం
వారికి కలుగును సుఖం 
పొందెదరు ఆత్మదర్శనం (2:72)

 ఏది ఆత్మ ఏది కానిదోయి
అనే వివేకం కలుగునోయి
సన్యాసి జ్ఞాన యోగానోయి
యోగికి  కర్మ  యోగానోయి
జన్మలముక్తి కలుగుననోయి
 సృష్టి ముందే తెలిపానోయి    (౩:౩)

అన్నం వలన  జీవమోయి
వర్షం   వలన అన్నమోయి 
యజ్ఞం వలన  వర్షమోయి
అలా యాగాల వలనోయి
అన్ని   పుట్టునోయి (౩:14) 

నా లోక చక్రము నోయి
అనుసరించని వారోయి
ఇంద్రియలోలు లౌదురోయి
పాపాలజీవు లౌదురోయి
వృధా  జీవు లౌదురోయి
జ్ఞానీ కాని వారైన నోయి
కర్మలు చేయవలె నోయి (౩:16)

ఉత్తములు ఏది చేసేదరోయి 
దానినే ఇతరులు చేసేదరోయి
ఉత్తములు దేనిని
అనుసరించుదురోయి 
జనులు దానినే ఆచరింతురోయి (౩:21)

 పార్ధా అన్ని కర్మలూ నాకు
 అర్పించుము  జ్ఞానముతో
 కోరికలు అహం శోకం వీడి
 నీవు యుద్దము  చేయుము (౩:౩౦)

చక్కగా అగుపించు
 వేరే దర్మము కన్నను
గుణం కొంత తగ్గినను
నీధర్మ ఆచరణే మేలు
అందు చావైన  మేలు
పరధర్మం భయంకరం
ఆచరించ  తగనిదోయి (౩:35)

ఎలా పొగ వలన నిప్పు
మురికి వలన అద్దము
మాయ వలన శిశువు
కప్పబడి వుండునోయి 
అలా కామంచే జ్ఞానము
 కప్పబడి వుండునోయి
 (౩:38)

ఏ కాలాన ధర్మ హానియో
అధర్మ వృద్ది చెందునోయి
అపుడు మంచి రక్షణకు
మరి దుష్ట శిక్షణ కొరకు 
నేను అవతరింతునోయి  (4:7,8)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[08/09, 17:37] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 3
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

రాగ భయ కోపాలు వీడి
 నాపై మనసుంచి చేరిన 
 ఉత్తములు జ్ఞానయోగాన
 పవిత్రులై  నన్ను పొందిరి(4:10)

 ఎవరు యేయే విధాల
 దైవానుగ్రహం కోరెదరో
 వారిని ఆయా  విధాల
 నేనే అనుగ్రహింతును
 నాకు ఎవరియందును
 రాగద్వేషాలు ఉండవు (4:11)

ఎవరు చేసే కర్మలు పనులు
కోరికలతో  మొదలు కానివో
ఎవరుచేసే కర్మలు జ్ఞానాలో
అట్టివారినే పండితు లందురు

యాగ  పాత్రలు  బ్రహ్మము
యాగ వస్తువు    బ్రహ్మము
యాగ కర్తా ,అగ్నీ బ్రహ్మము
 బ్రహ్మ కర్మఫలం బ్రహ్మము (4:24)

శ్రద్ధయు  ఇంద్రియ నిగ్రహులే
 జ్ఞానం పొందుటకు సమర్థులు
అట్టి వారే ముక్తిని పొందె దరు (4:39)

కర్మ , సన్యాస యోగ మార్గాలు
 రెండూ ముక్తి నీయు
మార్గాలు
 అయినా కర్మలు వీడుట కన్ననూ
వారు కర్మలు చేయుటే ఉత్తమం(5:2)

ఎవరు ప్రతిఫలం కోరక చేసెదరో
దైవార్పణం గా కర్మలు చేసెదరో
తామరాకుకు నీటిబొట్లు అంటనట్లు
వారిని పాపాలు దోషాలు అంటవు  (5:10)

ఎవని అజ్ఞానం జ్ఞానంచే పోవునో 
వాని జ్ఞానం సూర్య ప్రకాశమౌను
వారికి పరమార్ధ గుణాలు చూపును (5:16)

విద్యావినయు నందును
బ్రాహ్మణుని  యందును
మాంసాహారి యందును
పండితులు సమభావులు  (5:18)

చనిపొక ముందే యెవరు
 కామకోప మధ లోభాదులు
జయింతురో వారే యోగులు  (5:23)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[08/09, 17:45] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 4
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
పద్మ శ్రీ ఘంటశాల
పాడిన భగవద్గీత

ఎవరు తన ఇంద్రియాలు గెలిచి
చూపు కనుబొమల మధ్య నిలిపి
గాలి పీల్చుట  వదులుట నిలిపి
మనోబుద్దులు అదుపులో నిలిపి
ముక్తి కోరువారు ముక్తి పొందెదరు  (5:28)

 యాగాల తపస్సుల స్వీకారినని
 లోకాల జీవుల   పాలకునని
 తెలిసిన వారు ముక్తిపొందేరు
  (5:29)

ఏది సన్యాసమో అదే కర్మ యోగం 
ఏది కర్మయోగమోఅదే సన్యాసం
కోరికలు వీడనివారు యోగులు కాలేరు (6:2)

నియమాలలో ఆహారం
నియమాలలో  విహారం
నియమాలలో కర్మాచరణం
ఆత్మ సంయమం సాధ్యం (6:17)

గాలి కదపని దీపం నిశ్చలం
అభ్యాసంతో మది నిశ్చలం (6:19)

 సమభావంతో  సకలజీవులను
 సకల జీవులలో తనను 
తనలో సకల జీవులను
 యోగి చూచు చుండును  (6:29)

 ఎవరికైన మది నిశ్చలం  చాలకష్టం
అయినా ప్రయత్నాన అది సాధ్యం
 (6:35)
ఎవరు ఉత్తమ యోగులో వారు
పూర్తి విశ్వాసము తో నను సేవింతురు
నాకోసం పూజలు భజనలు చేసెదరు   (6:47)

వేలాది జనులలో ఒక్కడే
 జ్ఞానంకై  ప్రయత్నించును
వేలాది అట్టివారిలో ఒక్కడే
 నన్ను నిజంగా తిలియును  (7:౩)

నిప్పు నీరు నేల నింగి
గాలి  మనసు   బుద్ధి
 అహంకార రూపాల
నామాయ వుందోయి (7:4)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[08/09, 23:36] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 5
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

నా కన్నా ఉన్నతమైనది
ఈ లోకాన మరేదీ లేదు
హారములో పూసల వలే
జగమంతా నాలోనుంది
 (7:7)

నేల     లోని సుగంధము
నిప్పు  లోని   ప్రకాశము
జీవి     లోని   ఆయువు
ముని  లోని      తపస్సు 
అవి  నేనే   తెలియుము
 (7:9)

ఈ మూడు  గుణాలది
నా మాయ దాటలేనిది
నా శరణం కోరిన వారె
సులువుగా దాటగలది 
(7:14)

కోరికల కోసం ప్రార్థించేవారు
తెలియుటకు ప్రార్థించేవారు
డబ్బు కోసం  ప్రార్థించేవారు
జ్ఞానం కోసం  ప్రార్థించేవారు
అలా నాలుగు రకాల వారు 
నాకోసం ప్రార్థించుచున్నారు 
(7:16)

జ్ఞాన గుణ సంపదల వారు
తదుపరి జన్మలందు వారు
విజ్ఞానులై నన్నే కోరుచున్నారు
 (7:19)

ఎవరుఆఖరి క్షణాన నన్ను
తలంచుచు  మరణింతురో
 వారు నన్నే చేరుచున్నారు
 (8:5)

 అభ్యాసంతో ఏకాగ్రతగా
 దివ్యరూపం తలచువారు
ఆ పరమాత్మను చేరెదరు

అతడే  మహాపురుషుడు
వేద పురాణ పురుషుడు
సర్వ జ్ఞాని లోక రక్షకుడు
అణువుకన్నా చిన్నవాడు
అజ్ఞాన చీకటి కానివాడు
సూర్య కాంతి ప్రకాశుడు
 (8:8,9)

 ఇంద్రియాలు చూడలేనిది 
 పరబ్రహ్మం అది శాశ్వతం
 ఉత్తమలోకం పరమపదం
 మరు జన్మలుంచని లోకం
 (8:21)

లోకాన చీకటి వెలుగులవి
రెండు  మార్గాలు  వున్నవి
వెలుగుది పునర్జన్మ లేనిది 
చీకటిది   పునర్జన్మ కలది
( 8:26)

యోగులకు వేదాల పఠనం
  యజ్ఞ తపో దానాల ఫలం
  అందించును బ్రహ్మ పదం
 (8:28)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[11/09, 20:45] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 6
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల  భగవద్గీత

 ప్రళయాన జీవులన్ని నాలోనికే  చేరును
 కల్పాదిలో జీవులన్ని నానుంచే పుట్టును (9:7)

 సర్వకాలాలందు సర్వ స్తితులందు
 నన్నే తలచు వారి యోగక్షేమాలు
 నేనే స్వయంగా పట్టించు కొందును (9:22)

పూవైన  ఫలమైన ఆకైన నీరైన
భక్తితో ప్రతిఫలం కోరక ఇచ్చేవి
నేను ప్రియంగా స్వీకరింతును(9:26)

నాపై  మదిలో భక్తి శ్రద్ద  నిలిపి
మరిమారని మది బుద్ది నిలిపి
సేవించువారు నన్నే పొందెదరు(9:34)

 సప్త ఋషలు సనక సనందులు
 మనువులు నా వలననే  పుట్టిరి
 వారిచే లోకాలు జీవులు పుట్టిరి(10:6)

 పండితులు నాపై మనసు నిలిపి
నా మహిమ అనుభవాలు తెలిసి
బోధించి బ్రహ్మానందం పొందెదరు(10:6)

నేనే జీవులలో నుండు పరమాత్మను
నేనే జీవులను పుట్టించి పోషింతును
నేనే జీవులను లయం  చేయుదును (10:9)

నేనే వేదాలలో సామవేదమును
నేనే దేవతలలో   దేవేంద్రుడను
నేనే ఇంద్రియాలలో మనసును
నేనే సకల జీవులో  బుద్ధిని(10:22)

నేనే రాక్షసులలో   ప్రహ్లాదుడును
నేనే కొలమానలలో  కాలమును 
నేనే జంతువులలో సింహమును
నేనే పక్షులలో గరుత్మంతుడును(10:30)

లోకాల సకల ఐశ్వర్య ప్రకాశాలు
అన్ని తేజ ప్రకాశాల భాగాలు
అన్నీ నా వలనే  సంభవాలు (10:41)

🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:syamalaraossss
Cell: +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[12/09, 17:41] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 7
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల  భగవద్గీత

 పార్దా! అనేక దివ్యవిధాల
 అనేక రూపాల రంగుల
అనేక విశేషాల విశ్వరూపం
 దివ్య నేత్రాల చూడుము (11:5)


సకల దేవతలు ప్రాణులు
సకల బ్రహ్మలు ఋషులు 

అనేక  రూపాలు  శరీరాలు
అనేక  చేతులు  ముఖాలు
అనేక భయంకర కోరలు
అనేక  మంటల నోరులు
నీ రూపం లో వున్నాయి
తెలియుట లేదు దిశలు
ఆది మధ్యలు అంతాలు
నీ విశ్వరూపం అనంతము
నా కోసం దయ చూపుము
మాపైన  ఇష్ఠం చూపుము (11:15,16,20)

నేనే ప్రపంచ సంహారం
చేయు కాల స్వరూపం
నీవు మానినా సంహారం
యుద్ధాన ఎవరూ  మిగలరు (11:32)

భీష్మ ద్రోణ కర్ణ వీరులను
 ముందే నేను చంపాను
మిగిలిన శత్రు వీరులను
పార్ధా పోరున చంపుము (11:34)

 వీడుము   నీ   విశ్వ రూపం
 చూపుము నీ సహజ రూపం
నీచేతుల శంఖ చక్రాల రూపం  (11:46)

పార్థ నీకు కనిపించిన
ఈ నా విశ్వరూపము
ఎవ్వరూ చూడ లేరు
ఈ విశ్వరూప దర్శనం
 దేవతలు కోరుదురు     (11:52)

 నాపై మనసుంచు  వారు
 భక్తితో ధ్యానించు  వారు
 నాకు ప్రియభక్తులు వారు
 (12:2)

అభ్యాసం  కన్న జ్ఞానము
జ్ఞానము కన్న ధ్యానము
దానికన్న కర్మఫల త్యాగం
ఆచరణే  ముక్తి మార్గము (12:12)

దోషాలు వీడి  కోరికలు వీడి
పక్షపాతాలు భయాలు వీడి
ప్రతిఫలం కోరని భక్తుడు
నాకు మిక్కిలి ప్రియభక్తుడు (12:16)

శత్రు మిత్రుల సుఖదుఃఖాల
గౌరవ నిందల చలివేడిలలో
 సమ బుద్ధిని చూపువాడు
 నిత్యం సంతృప్తి కలవాడు
 చలించని మది  కలవాడు
 నాపై భక్తిశ్రద్ధలు కలవాడు
 నాకు అత్యంత ప్రియుడు (12:18,19)

🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:syamalaraossss
Cell: +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణా ర్పణం

గణేశా స్తకం భావ గానం

*గణేశ అష్టకం*

*ఏకదంతం మహాకాయం*
ఒకే దంతం మహా శరీరం
 *తప్తకాంచనసన్నిభమ్*|
?(తడి బంగారం సన్నిభం)
*లంబోదరం విశాలాక్షం*
బొజ్జ భారం విశాలనయనం
*వందేహం గణనాయకమ్1*
మావందనం గణనాయకం

*మౌంజీ కృష్ణాజినధరం*
వేసుకున్నావు కృష్ణాజినం
 *నాగయజ్ఞోపవీతినమ్*|
నాగసర్పం నీ జంధ్యం
*బాలేందుశకలం మౌళౌ*
బాలచంద్రం నీ కిరీటం
 *వందేహం గణనాయకమ్*2
మావందనం గణనాయకం

*చిత్రరత్న విచిత్రాంగం*
చిత్ర విచిత్రం రత్నాంగం
 *చిత్రమాలావిభూషితమ్*
చిత్ర మాలల అలంకారం
*కామరూపధరం దేవం*
కోరినరూపం ధరించు దైవం
*వందేహం గణనాయకమ్*౩
మావందనం గణనాయకం

*గజవక్త్రం సురశ్రేష్ఠం*
ఏనుగుతొండం ఉత్తమదైవం
*కర్ణచామరభూషితమ్*
చాట చెవులు అంకారం
*పాశాంకుశధరం దేవం*
పాశం అంకుశం పట్టిన దైవం
*వందేహం గణనాయకమ్*4
మావందనం గణనాయకం

*మూషకోత్తమమారుహ్య*
ఎలుక ఉత్తమం నీ వాహనం
*దేవాసురమహాహవే*
దేవాసురులలో మహానీయుడవు
*యోద్ధుకామం మహావీర్యం*
మహావీర్యం  మహాబలం
*వందేహం గణనాయకమ్*5
మావందనం గణనాయకం

 *యక్షకిన్నెరగంధర్వ*
యక్ష కిన్నెర గంధర్వులు
*సిద్ధవిద్యాధరైస్సదా*
సిద్ద విద్యాదారులు సదా
*స్తూయమానం మహాబాహుం*

మీసేవనం మహా భుజం
 *వందేహం గణనాయకమ్*6
మావందనం గణనాయకం

*అంబికాహృదయానందం*
పార్వతీ హృదయానందం
 *మాతృభిఃపరివేష్టితమ్*
అమ్మచెంత నుండుదైవం
*భక్తిప్రియం మదోన్మత్తం*
భక్త ప్రియం  అణిచేవు గర్వం
 *వందేహం గణనాయకమ్*7
మావందనం గణనాయకం

*సర్వవిఘ్నహరం దేవం*
అన్నీ అడ్డాలు తప్పించు దైవం
 *సర్వవిఘ్నవివర్జితమ్*
అన్ని అడ్డాలు వీగిపోవును
*సర్వసిద్ధిప్రదాతారం*
అన్ని సిద్ధులు ఇచ్చేరూపం
 *వందేహం గణనాయకమ్*8
మావందనం గణనాయకం

*గణాష్టకమిదం పుణ్యంయః*
ఇది గనేశాష్టకం పుణ్యం
*పఠేత్సతతం నరః సిద్ధ్యంతి*
ఎల్లపుడు చదివేవారికి
*సర్వకార్యాణివిద్యావాన్*
అన్ని పనులు  సిద్దించును
 *ధనవాన్ భవేత్*9
చదువు ధనము లభించును