13, సెప్టెంబర్ 2018, గురువారం

సూర్యోపనిషత్* భావ గానం

🙏🙏🙏🙏🙏🙏🙏
🌞 *సూర్యోపనిషత్*
🙏🙏🙏🙏🙏🙏🙏
 భావ గానం

*ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం*
 *వ్యాఖ్యాస్యామ:*

ఓం! ఇది అథర్వణవేదం
 అంగిరస ఋషి వాక్యం
 సూర్యోపనిషత్ వివరం

*బ్రహ్మా ఋషి: !*
*గాయత్రీ ఛన్ద: !*
*ఆదిత్యో దేవతా !*

ఈ ఉపనిషత్ కు
బ్రహ్మ యే ఋషి
గాయత్రి యే వేద చందస్సు
ఆదిత్యుడే దైవము

*హంస: సోఁహమగ్ని*
*నారాయణయుక్తం బీజమ్ !*
*హృల్లేఖా శక్తి: !*

అగ్ని,నారాయణం బీజం 
హృదయ రచనం బలం

*వియదాదిసర్గ*
 *సంయుక్తం కీలకమ్ !*
*చతుర్విధపురుషార్థ* 
*సిద్ధ్యర్థే వినియోగ: !*

  మొత్తం సృష్టికి  మూలం
 నాలుగు పురుషార్థాల
 సాధనకు  ఉపయోగం

*షట్ స్వరారూఢేన బీజేన*
 *షడఙ్గం రక్తామ్బుజ*
 *సంస్థితం*
*సప్తాశ్వరథినం*

ఆరు స్వరాల విత్తనం
ఆరు అంశాల కారణం
ఎర్ర కమలాన నివాసం
ఏడుగుఱ్ఱాల రథదైవం

 *హిరణ్యవర్ణం చతుర్భుజం* *పద్మద్వయాఁభయవరదహస్తం*
*కాలచక్రప్రణేతారం* 
*శ్రీసూర్యనారాయణ*
 *య ఏవం వేద స వై బ్రాహ్మణ:*!!

 బంగారు రంగు దేహం
 నాలుగు చేతుల దైవం
 రెండుచేతుల పద్మాలు
ఒక చేయి వరదానం
ఒక  చేయి అభయం
కాలచక్రమే అవతారం
శ్రీ సూర్య నారాయణం 
నిన్నిలా తెలిసినవారే
వేదాలు తెలిసినవారు

*ఓ భూర్భువ సువ: !*
*తత్సవితుర్వరేణ్యం*
 *భర్గో దేవస్య ధీమహి* !
*ధి యో యో న: ప్రచోదయాత్ !*

ఓంకారం  నిరాకారం
భూ వాయు  సూర్యం
లోకాలు పుట్టించె దైవం
 నీ కాంతి శక్తి  ధ్యానం
 చేయును బుద్ది ఉత్తేజం

*సూర్య ఆత్మా*
 *జగతస్తస్థుషశ్చ* !
*సూర్యాద్వై ఖల్విమాని*
*భూతాని జాయస్తే !*
*సూర్యాద్యజ్ఞ:*
*పర్జన్యోఁన్నమాత్మా !*

మారేను  ఈ ప్రపంచము
 మారదు  సూర్యఆత్మ
 యాగం మేఘం అన్నము 
 అన్నిటా సూర్యఆత్మ

*నమస్తే ఆదిత్య !*
*త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి !*
*త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి !*
*త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి !*
*త్వమేవ ప్రత్యక్షం రుద్రోఁసి !*
*త్వమేవ ప్రత్యక్షం ఋగసి !*
*త్వమేవ ప్రత్యక్షం యజురసి !*
*త్వమేవ ప్రత్యక్షం సామాసి !*
*త్వమేవ ప్రత్యక్షమథర్వాసి !*
*త్వమేవ సర్వం ఛన్దోఁసి !*
సూర్యునకు వందనం
నీవే ప్రత్యక్ష  కర్తవు
నీవే ప్రత్యక్ష  కర్మవు
నీవే ప్రత్యక్ష క్రియవు
నీవే ప్రత్యక్ష బ్రహ్మవు
నీవే ప్రత్యక్ష విష్ణువు
నీవే ప్రత్యక్ష రుద్రు డవు
నీవే ప్రత్యక్ష ఋగ్వేదం
నీవే ప్రత్యక్ష యజుర్వేదం
నీవే ప్రత్యక్ష అధర్వవేదం
నీవే ప్రత్యక్ష సామ వేదం
 నీవే సకల వేదాల రూపం
*ఆదిత్యాద్వాయుర్జాయతే* !
*ఆదిత్యాద్భూమిర్జాయతే !*
*ఆదిత్యాదాపోజాయస్తే* !
*ఆదిత్యాజ్జ్యోతిర్జాయతే !*
*ఆదిత్యాద్యోమ దిశో జాయస్తే !*
*ఆదిత్యాద్దేవాః జాయస్తే !*
*ఆదిత్యాద్వేదాః జాయస్తే !*

సూర్యుని నుండే గాలి
సూర్యుని నుండే భూమి
 సూర్యుని నుండే నీరు
సూర్యుని నుండే కాంతి
సూర్యుని నుండే దిశలు
సూర్యుని నుండే ఆకాశం
సూర్యుని నుండే అంతరిక్షం
సూర్యుని నుండే దేవతలు
సూర్యుని నుండే వేదాలు
అన్ని నీ నుండే పుట్టాయి

*ఆదిత్యో వా ఏష*
 *ఏతన్మణ్డలం తపతి*!
*అసావాదిత్యో బ్రహ్మా!*

నీవే ఆదిత్య రూపం
నీదే సూర్యమండలం
నీదే తపస్సు ప్రకాశం
నీవే ఆదిత్య బ్రహ్మం

*ఆదిత్యోంత:కరణ*
 *మనోబుద్ధి  చిత్తాహంకారా:*!
*ఆదిత్యో వై వ్యాన*
*స్సమానోదానోఁపాన: ప్రాణ:*!
*ఆదిత్యో వై శ్రోత్ర*
*త్వక్ చశౄరసనధ్రాణా:*!
*ఆదిత్యో వై వాక్పాణి*
*పాద పాయుపస్థా:*!
*ఆదిత్యోవై శబ్ద స్పర్శ*
 *రూప రసగన్ధా:*!
*ఆదిత్యో వై వచనా*
 *దానాగమన విసర్గానన్దా:* !
*ఆనన్దమయో విజ్ఞానమయో*
*విజ్ఞానఘన ఆదిత్య:* !

సూర్యుడే మనసు బుద్దులు
 అహంకార అంతఃకరణాలు
 సూర్యుడే ప్రాణ అపానాలు
ఉదాన వ్యాన సమానాలు
సూర్యుడే పలుకులు
 చేతులు, పాదాలు
సూర్యుడే ద్వనులు స్పర్శలు
రూపాలు రసాలు వాసనలు
 సూర్యుడే మాటలు దానాలు
 రాకలు పోకలు ఆనందాలు

సూర్యుడే సకల
ఆనంద మయుడు 
విజ్ఞాన  మయుడు
విజ్ఞాన స్వరూపుడు

*నమో మిత్రాయ*
 *భానవే మృత్యోర్మా పాహి !*
*భ్రాజిష్ణవే విశ్వహేతవే నమ:* !

 మిత్రునకు   నమస్కారం
 ప్రకాశునకు నమస్కారం
చావు నుండి రక్షించుము
తేజోవంతునకు వందనం
విశ్వకారణునకు వందనం

*సూర్యాద్భవన్తి భూతాని*
 *సూర్యేణ పాలితాని తు* !
*సూర్యే లయం ప్రాప్నువన్తి*
 *య: సూర్య: సోఁహమేవ చ !*

 సూర్యుని వలన ప్రాణులు పుట్టును
 సూర్యుని వలన పాలింప బడును
సూర్యుని  వలన లయం అ వును
ఎవరు సూర్యుడో అతడే నేను

*చక్షుర్నో దేవ: సవితా*
*చక్షుర్న ఉత పర్వత:*
*చక్షు-ర్ధాతా దధాతు న:*

దివ్య నేత్రాల దైవం సృష్టి  నేత్రం
 కనుచూపులు మాకు నిండుతనం
దైవం మాకు దివ్య నేత్రాల  నీయు గాక

*ఆదిత్యాయ విద్మహే*
 *సహస్రకిరణాయ*
*ధీమహి !తన్న:*
*సూర్య: ప్రచోదయాత్* !

వేలాది ప్రకాశ కిరాణాల
సూర్యుని ధ్యానిస్తాము
మా మదిలో వుండు గాక
మాకు స్ఫూర్తినీయు గాక!

*సవితా పశ్చాత్తాత్*
*సవితా పురస్తాత్*
 *సవితోత్తరాత్తాత్*
*సవితా ధరాత్తాత్*
*సవితా న: సువతు*
 *సర్వతాతిఁ సవితా నో*
 *రాసతాం దీర్ఘమాయు:*

సృష్టే ముందూ సృష్టే వెనకా
సృష్టే  పైనా      సృష్టే క్రిందా
సృష్టే అంతా  ఆ సూర్యుడే
మాకు పూర్ణత నీయుగాక!
మాకు దీర్ఘాయుషు నీయుగాక

*ఓమిత్యేకాక్షరం బ్రహ్మా*
*ఘృణిరితి ద్వే అక్షరే*
*సూర్య ఇత్యక్షరద్వయమ్*
*ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి*
*ఏతస్వైవ సూర్యస్యాష్టాక్షరో మను:*

*ఓం* ఒక అక్షర  బ్రహ్మము
*ఘృణి*  రెండు  అక్షరాలు
*సూర్య* రెండు  అక్షరాలు
*ఆదిత్య* మూడు అక్షరాలు
*ఓం ఘృణిః సూర్యః* *ఆదిత్యః*
ఇది *సూర్యఅష్టాక్షరీ మంత్రం*

*యస్సదాహ రహ ర్జపతి*
*స వై బ్రాహ్మణో భవతి*

 ఎవరు నిత్యము జపిస్తారో
వారు  బ్రాహ్మణులవుతారు

*సూర్యాభిముఖో జప్త్వా*
 *మహావ్యాధి భయాత్* *ప్రముచ్యతే* !
*అలక్ష్మీర్నశ్యతి* !
*అభక్ష్య భక్షణాత్*   *పూతో భవతి*!
*అగమ్యాగమనాత్* *పూతో భవతి* !
*పతిత సంభాషణాత్ పూతో భవతి*
*అసత్ సంభాషనాత్ పూతో భవతి* !

సూర్యుని ముందు చదివిన
రోగాలు భయాలు పోవును
వారి బీదతనం నశించును
చెడుప్రాంత దోషం పోవును
చెడుఆహార దోషం పోవును
నీచులతొ మాటల దోషం పోవును
అసత్య మాటల  దోషం పోవును

*మధ్యాహ్నే సూర్యాభిముఖ: పఠేత్ !*
*సద్యోత్పన్నఞ్చ మహాపాతకాత్ ప్రముచ్యతే !*

మధ్యాన్నం సూర్య జపం
పంచ మహాపాపనాశనం

*సైషా సావిత్రీం విద్యాం*
 *న కించిదపి న కస్మై*
*చిత్ప్రశంసయేత్ !*

ఇది ప్రశంసా కాదు
ఇది తక్కువా కాదు
ఇదే సృష్టించు సావిత్రీవిద్య


*య ఏతాం మహాభాగ:*
 *ప్రాత: పఠతి, స భాగ్యవాన్*
*జాయతే పశూన్విన్దతి*!
*వేదర్థం జాయతే*


సూర్యోదయాన జపించిన
ధన  సంపదలు పొందెదరు
పశు సంపదలు పొందెదరు
వేద  సంపదలు పొందెదరు

*త్రికాలమేతజ్జప్త్వా*
*క్రతుశతఫలమవాప్నోతి*!

మూడు సంద్యలలో జపం
వంద యాగాల శుభఫలం 

*హస్తాదిత్యే జపతి*
*స మహామృత్యుం తరతి*

 హస్తానక్షత్ర రోజున సూర్యజపం
తొలగించును మహా మృత్యుగండం

*ఏవం వేద ! ఇత్యుపనిషత్ !!*

ఇది తెలియుదగు విషయం
ఇది సూర్యోపనిషత్ వివరం

*ఓం శాంతి: శాంతి: శాంతి:!!*

🌞🌞🌞

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి