13, సెప్టెంబర్ 2018, గురువారం

*శ్రీమహాలక్ష్మి స్త్రోత్రమ్* భావగానాం

🙏🙏🙏🙏🙏🙏🙏
*శ్రీమహాలక్ష్మి స్త్రోత్రమ్*
🙏🙏🙏🙏🙏🙏🙏

*సందర్భం*:
లక్ష్మీ దేవి పాల సముద్రం నుండి ఉద్భవించినపుడు
దేవేంద్రుడు  స్తుతించినది

*వారం తిది*
శుక్రవారం పంచమి

*మూలం*
దేవీభాగవతం-9 స్కందము

1)
*నమః కమల వాసిన్యై*
నమస్తే కమల వాసిని
*నారాయణ్యై నమోనమః*
నారాయణి నమస్తే నమస్తే
*కృష్ణ ప్రియాయై సతత౦*
ఎల్లవేళలా కృష్ణ ప్రియవు
 *మహాలక్ష్మ్యై నమోనమః!!*
మహాలక్ష్మి నమస్తే నమస్తే

2)
 *పద్మ పత్రేక్షణాయై చ*
పద్మ పత్రాల కనుల దేవి *పద్మాస్యాయైనమోనమః*
పద్మ రూపా నమస్తే నమస్తే
*పద్మాసనాయై పద్మిన్యై*
పద్మ ఆసనము  పద్మిని
*వైష్ణవ్యై చ నమోనమః!!*
వైష్ణవి దేవి నమస్తే నమస్తే

3)
 *సర్వస౦పత్స్వరూపిణ్యై*
సకల సంపదల రూపుణి
*సర్వారాధ్యాయై నమోనమః*
అందరు ఆరాదించుదేవి
నమస్తే నమస్తే
*హరిభక్తి ప్రదాత్ర్యై చ*
హరి భక్తి  కలిగించు దేవి
 *హర్షదాత్ర్యై చనమోనమః*
ఆనందం కలిగించుదేవి
నమస్తే నమస్తే
*కృష్ణ వక్షఃస్థితాయై చ*
కృష్ణ హృదయ వాసిని
 *కృష్ణేశాయై నమోనమః*
కృష్ణ హృదయేశ దేవి నమస్తే నమస్తే
*చ౦ద్రశోభా స్వరూపాయై*
చంద్ర శోభల స్వరూపిణి
 *రత్నపద్మే చ శోభనే!!*
రత్న పద్మాల శోభిని

4)
*స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై*
సంపదల అధికారిణి దేవి
 *మహాదేవ్యై నమోనమః*
మహాలక్ష్మి నమస్తే నమస్తే
*నమో బుద్ధిస్వరూపాయై*
బుద్ధి రూప దేవి
*బుద్ధిదాయ్యై నమోనమః!!*
బుద్ధినీయు దేవి నమస్తే నమస్తే
*యథామాతా స్తనా౦ధానా౦*
అమ్మలా పాలిచ్చి పెంచేవు
*శిశూనా౦ శైశవే సదా*
పసిబిడ్డలా సదా పోషించేవు
*తథా త్వ౦ సర్వదా మాతా*
అలా నీవే అన్ని వేళలా అమ్మా
*సర్వేషా౦ సర్వరూపతః!!*
అన్ని విధాల అన్ని రూపాల మాతవు
శ్రీమహాలక్ష్మి నమస్తే  నమస్తే

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ మహాలక్ష్మికి సమర్పణం
భావగాన రచన
శ్యామలరావుssss
🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి