13, సెప్టెంబర్ 2018, గురువారం

భగవద్గీతా భావగానం* పార్ట్ 1-7 *సరళంగా సులభం గా*

[05/09, 22:21] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 1
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

 యుద్ధాన పార్ధుడు కోరెను
  శ్రీకృష్ణుడు రథమును
  సేనల మధ్యన నిలిపెను

అర్జునుడు రెండువైపులా
యుద్ధమునకు  సిద్ధమైన
 తండ్రులను గురువులను
మామలను  సోదరులను
మనుమలను మిత్రులను
చూచి  బాధతో  పలికెను

బంధువులును జనులను
విజయం కోసం చంపలేను
రాజ్య సుఖం వలదు కృష్ణా

బాధ తో విల్లు బాణాలను
అర్జునుడు విడిచి పెట్టెను
 (1:32)

కృష్ణుడు పలికెను

దుఃఖింప తగని వారికోసం
దుఃఖించుట తగదు పార్థా

ఆత్మలు  ఆత్మలుకానివి
ఉండునని తెలిసినవారు 
అశాశ్వత శరీరముల కైన
శాశ్వతాలైన  ఆత్మల కైన 
వివేకులు  దుఃఖింపడరు (2:11)

ఎలా బాల్యం యవ్వనము
 వృద్ధాప్యల దేహం మారునో
అలా ఆత్మ దేహంమారును
కనుక ధీరులు మోహపడరు (2:13)

ఎలా మనిషి  పాత బట్టలు 
వీడి కొత్తబట్టలు ధరించునో
 అలా ఆత్మ పాత దేహము
వీడి కొత్తదేహం ధరించును  (2:22)

ఆత్మ నాశనం  లేనిది
ఆయుధం నరక లేదు
అగ్ని మండింప  లేదు
నీరు  తడుప     లేదు
గాలి ఆర్పివేయ లేదు
ఆత్మకు నాశనం లేదు  (2:23)

పుట్టినవానికి చచ్చుట తప్పదు
చచ్చిన వానికి పుట్టక తప్పదు
తప్పని వాటికై  శోకింప తగదు (2:27)

యుద్ధాన మరణించిన
వీరస్వర్గం  పొందెదవు
యుద్ధాన  జయించిన
రాజ్యము  పొందెదవు
గట్టిమదితో పోరాడుము (2:37)

పనులను  ఆచరించుటకే 
నీకు అధికారము కలదు
 కానీ  పనుల ఫలితాలపై
నీకు అధికారము   లేదు
కర్మఫల కారణం కారాదు
అట్లని కర్మలు మానరాదు (2:47)

దుఃఖాన కుంగనివాడు
సుఖాన  పొంగనివాడు
రాగ కోపాలుండనివాడు
 అతడే  స్థితప్రజ్ఞుడన బడును(2:56)
[08/09, 17:36] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 2
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

ఇంద్రియాల కోరికలు
విషయ  భోగాలను
సదా కోరువారికోయి
రాగము పెరుగును
 కామం  కలుగును
 కోపం    కలుగును
వివేకం  తరుగును
జ్ఞాపకం తరుగును
బుద్ధి    నశించును
పతనం కలుగును
(2:62)

ఆత్మజ్ఞానం కర్మపాలనం
బ్రహ్మను కోరు ప్రయత్నం 
దాటించును  సంసారం
వారికి కలుగును సుఖం 
పొందెదరు ఆత్మదర్శనం (2:72)

 ఏది ఆత్మ ఏది కానిదోయి
అనే వివేకం కలుగునోయి
సన్యాసి జ్ఞాన యోగానోయి
యోగికి  కర్మ  యోగానోయి
జన్మలముక్తి కలుగుననోయి
 సృష్టి ముందే తెలిపానోయి    (౩:౩)

అన్నం వలన  జీవమోయి
వర్షం   వలన అన్నమోయి 
యజ్ఞం వలన  వర్షమోయి
అలా యాగాల వలనోయి
అన్ని   పుట్టునోయి (౩:14) 

నా లోక చక్రము నోయి
అనుసరించని వారోయి
ఇంద్రియలోలు లౌదురోయి
పాపాలజీవు లౌదురోయి
వృధా  జీవు లౌదురోయి
జ్ఞానీ కాని వారైన నోయి
కర్మలు చేయవలె నోయి (౩:16)

ఉత్తములు ఏది చేసేదరోయి 
దానినే ఇతరులు చేసేదరోయి
ఉత్తములు దేనిని
అనుసరించుదురోయి 
జనులు దానినే ఆచరింతురోయి (౩:21)

 పార్ధా అన్ని కర్మలూ నాకు
 అర్పించుము  జ్ఞానముతో
 కోరికలు అహం శోకం వీడి
 నీవు యుద్దము  చేయుము (౩:౩౦)

చక్కగా అగుపించు
 వేరే దర్మము కన్నను
గుణం కొంత తగ్గినను
నీధర్మ ఆచరణే మేలు
అందు చావైన  మేలు
పరధర్మం భయంకరం
ఆచరించ  తగనిదోయి (౩:35)

ఎలా పొగ వలన నిప్పు
మురికి వలన అద్దము
మాయ వలన శిశువు
కప్పబడి వుండునోయి 
అలా కామంచే జ్ఞానము
 కప్పబడి వుండునోయి
 (౩:38)

ఏ కాలాన ధర్మ హానియో
అధర్మ వృద్ది చెందునోయి
అపుడు మంచి రక్షణకు
మరి దుష్ట శిక్షణ కొరకు 
నేను అవతరింతునోయి  (4:7,8)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[08/09, 17:37] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 3
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

రాగ భయ కోపాలు వీడి
 నాపై మనసుంచి చేరిన 
 ఉత్తములు జ్ఞానయోగాన
 పవిత్రులై  నన్ను పొందిరి(4:10)

 ఎవరు యేయే విధాల
 దైవానుగ్రహం కోరెదరో
 వారిని ఆయా  విధాల
 నేనే అనుగ్రహింతును
 నాకు ఎవరియందును
 రాగద్వేషాలు ఉండవు (4:11)

ఎవరు చేసే కర్మలు పనులు
కోరికలతో  మొదలు కానివో
ఎవరుచేసే కర్మలు జ్ఞానాలో
అట్టివారినే పండితు లందురు

యాగ  పాత్రలు  బ్రహ్మము
యాగ వస్తువు    బ్రహ్మము
యాగ కర్తా ,అగ్నీ బ్రహ్మము
 బ్రహ్మ కర్మఫలం బ్రహ్మము (4:24)

శ్రద్ధయు  ఇంద్రియ నిగ్రహులే
 జ్ఞానం పొందుటకు సమర్థులు
అట్టి వారే ముక్తిని పొందె దరు (4:39)

కర్మ , సన్యాస యోగ మార్గాలు
 రెండూ ముక్తి నీయు
మార్గాలు
 అయినా కర్మలు వీడుట కన్ననూ
వారు కర్మలు చేయుటే ఉత్తమం(5:2)

ఎవరు ప్రతిఫలం కోరక చేసెదరో
దైవార్పణం గా కర్మలు చేసెదరో
తామరాకుకు నీటిబొట్లు అంటనట్లు
వారిని పాపాలు దోషాలు అంటవు  (5:10)

ఎవని అజ్ఞానం జ్ఞానంచే పోవునో 
వాని జ్ఞానం సూర్య ప్రకాశమౌను
వారికి పరమార్ధ గుణాలు చూపును (5:16)

విద్యావినయు నందును
బ్రాహ్మణుని  యందును
మాంసాహారి యందును
పండితులు సమభావులు  (5:18)

చనిపొక ముందే యెవరు
 కామకోప మధ లోభాదులు
జయింతురో వారే యోగులు  (5:23)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[08/09, 17:45] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 4
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
పద్మ శ్రీ ఘంటశాల
పాడిన భగవద్గీత

ఎవరు తన ఇంద్రియాలు గెలిచి
చూపు కనుబొమల మధ్య నిలిపి
గాలి పీల్చుట  వదులుట నిలిపి
మనోబుద్దులు అదుపులో నిలిపి
ముక్తి కోరువారు ముక్తి పొందెదరు  (5:28)

 యాగాల తపస్సుల స్వీకారినని
 లోకాల జీవుల   పాలకునని
 తెలిసిన వారు ముక్తిపొందేరు
  (5:29)

ఏది సన్యాసమో అదే కర్మ యోగం 
ఏది కర్మయోగమోఅదే సన్యాసం
కోరికలు వీడనివారు యోగులు కాలేరు (6:2)

నియమాలలో ఆహారం
నియమాలలో  విహారం
నియమాలలో కర్మాచరణం
ఆత్మ సంయమం సాధ్యం (6:17)

గాలి కదపని దీపం నిశ్చలం
అభ్యాసంతో మది నిశ్చలం (6:19)

 సమభావంతో  సకలజీవులను
 సకల జీవులలో తనను 
తనలో సకల జీవులను
 యోగి చూచు చుండును  (6:29)

 ఎవరికైన మది నిశ్చలం  చాలకష్టం
అయినా ప్రయత్నాన అది సాధ్యం
 (6:35)
ఎవరు ఉత్తమ యోగులో వారు
పూర్తి విశ్వాసము తో నను సేవింతురు
నాకోసం పూజలు భజనలు చేసెదరు   (6:47)

వేలాది జనులలో ఒక్కడే
 జ్ఞానంకై  ప్రయత్నించును
వేలాది అట్టివారిలో ఒక్కడే
 నన్ను నిజంగా తిలియును  (7:౩)

నిప్పు నీరు నేల నింగి
గాలి  మనసు   బుద్ధి
 అహంకార రూపాల
నామాయ వుందోయి (7:4)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[08/09, 23:36] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 5
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల భగవద్గీత

నా కన్నా ఉన్నతమైనది
ఈ లోకాన మరేదీ లేదు
హారములో పూసల వలే
జగమంతా నాలోనుంది
 (7:7)

నేల     లోని సుగంధము
నిప్పు  లోని   ప్రకాశము
జీవి     లోని   ఆయువు
ముని  లోని      తపస్సు 
అవి  నేనే   తెలియుము
 (7:9)

ఈ మూడు  గుణాలది
నా మాయ దాటలేనిది
నా శరణం కోరిన వారె
సులువుగా దాటగలది 
(7:14)

కోరికల కోసం ప్రార్థించేవారు
తెలియుటకు ప్రార్థించేవారు
డబ్బు కోసం  ప్రార్థించేవారు
జ్ఞానం కోసం  ప్రార్థించేవారు
అలా నాలుగు రకాల వారు 
నాకోసం ప్రార్థించుచున్నారు 
(7:16)

జ్ఞాన గుణ సంపదల వారు
తదుపరి జన్మలందు వారు
విజ్ఞానులై నన్నే కోరుచున్నారు
 (7:19)

ఎవరుఆఖరి క్షణాన నన్ను
తలంచుచు  మరణింతురో
 వారు నన్నే చేరుచున్నారు
 (8:5)

 అభ్యాసంతో ఏకాగ్రతగా
 దివ్యరూపం తలచువారు
ఆ పరమాత్మను చేరెదరు

అతడే  మహాపురుషుడు
వేద పురాణ పురుషుడు
సర్వ జ్ఞాని లోక రక్షకుడు
అణువుకన్నా చిన్నవాడు
అజ్ఞాన చీకటి కానివాడు
సూర్య కాంతి ప్రకాశుడు
 (8:8,9)

 ఇంద్రియాలు చూడలేనిది 
 పరబ్రహ్మం అది శాశ్వతం
 ఉత్తమలోకం పరమపదం
 మరు జన్మలుంచని లోకం
 (8:21)

లోకాన చీకటి వెలుగులవి
రెండు  మార్గాలు  వున్నవి
వెలుగుది పునర్జన్మ లేనిది 
చీకటిది   పునర్జన్మ కలది
( 8:26)

యోగులకు వేదాల పఠనం
  యజ్ఞ తపో దానాల ఫలం
  అందించును బ్రహ్మ పదం
 (8:28)

🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[11/09, 20:45] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 6
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల  భగవద్గీత

 ప్రళయాన జీవులన్ని నాలోనికే  చేరును
 కల్పాదిలో జీవులన్ని నానుంచే పుట్టును (9:7)

 సర్వకాలాలందు సర్వ స్తితులందు
 నన్నే తలచు వారి యోగక్షేమాలు
 నేనే స్వయంగా పట్టించు కొందును (9:22)

పూవైన  ఫలమైన ఆకైన నీరైన
భక్తితో ప్రతిఫలం కోరక ఇచ్చేవి
నేను ప్రియంగా స్వీకరింతును(9:26)

నాపై  మదిలో భక్తి శ్రద్ద  నిలిపి
మరిమారని మది బుద్ది నిలిపి
సేవించువారు నన్నే పొందెదరు(9:34)

 సప్త ఋషలు సనక సనందులు
 మనువులు నా వలననే  పుట్టిరి
 వారిచే లోకాలు జీవులు పుట్టిరి(10:6)

 పండితులు నాపై మనసు నిలిపి
నా మహిమ అనుభవాలు తెలిసి
బోధించి బ్రహ్మానందం పొందెదరు(10:6)

నేనే జీవులలో నుండు పరమాత్మను
నేనే జీవులను పుట్టించి పోషింతును
నేనే జీవులను లయం  చేయుదును (10:9)

నేనే వేదాలలో సామవేదమును
నేనే దేవతలలో   దేవేంద్రుడను
నేనే ఇంద్రియాలలో మనసును
నేనే సకల జీవులో  బుద్ధిని(10:22)

నేనే రాక్షసులలో   ప్రహ్లాదుడును
నేనే కొలమానలలో  కాలమును 
నేనే జంతువులలో సింహమును
నేనే పక్షులలో గరుత్మంతుడును(10:30)

లోకాల సకల ఐశ్వర్య ప్రకాశాలు
అన్ని తేజ ప్రకాశాల భాగాలు
అన్నీ నా వలనే  సంభవాలు (10:41)

🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:syamalaraossss
Cell: +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణా ర్పణం
[12/09, 17:41] Syamala Rao SSSS: 🙏🙏🙏🙏🙏🙏🙏
*భగవద్గీతా  భావగానం*
 *సరళంగా సులభం గా*
              part 7
🙏🙏🙏🙏🙏🙏🙏
మూలం: 
ఘంటశాల  భగవద్గీత

 పార్దా! అనేక దివ్యవిధాల
 అనేక రూపాల రంగుల
అనేక విశేషాల విశ్వరూపం
 దివ్య నేత్రాల చూడుము (11:5)


సకల దేవతలు ప్రాణులు
సకల బ్రహ్మలు ఋషులు 

అనేక  రూపాలు  శరీరాలు
అనేక  చేతులు  ముఖాలు
అనేక భయంకర కోరలు
అనేక  మంటల నోరులు
నీ రూపం లో వున్నాయి
తెలియుట లేదు దిశలు
ఆది మధ్యలు అంతాలు
నీ విశ్వరూపం అనంతము
నా కోసం దయ చూపుము
మాపైన  ఇష్ఠం చూపుము (11:15,16,20)

నేనే ప్రపంచ సంహారం
చేయు కాల స్వరూపం
నీవు మానినా సంహారం
యుద్ధాన ఎవరూ  మిగలరు (11:32)

భీష్మ ద్రోణ కర్ణ వీరులను
 ముందే నేను చంపాను
మిగిలిన శత్రు వీరులను
పార్ధా పోరున చంపుము (11:34)

 వీడుము   నీ   విశ్వ రూపం
 చూపుము నీ సహజ రూపం
నీచేతుల శంఖ చక్రాల రూపం  (11:46)

పార్థ నీకు కనిపించిన
ఈ నా విశ్వరూపము
ఎవ్వరూ చూడ లేరు
ఈ విశ్వరూప దర్శనం
 దేవతలు కోరుదురు     (11:52)

 నాపై మనసుంచు  వారు
 భక్తితో ధ్యానించు  వారు
 నాకు ప్రియభక్తులు వారు
 (12:2)

అభ్యాసం  కన్న జ్ఞానము
జ్ఞానము కన్న ధ్యానము
దానికన్న కర్మఫల త్యాగం
ఆచరణే  ముక్తి మార్గము (12:12)

దోషాలు వీడి  కోరికలు వీడి
పక్షపాతాలు భయాలు వీడి
ప్రతిఫలం కోరని భక్తుడు
నాకు మిక్కిలి ప్రియభక్తుడు (12:16)

శత్రు మిత్రుల సుఖదుఃఖాల
గౌరవ నిందల చలివేడిలలో
 సమ బుద్ధిని చూపువాడు
 నిత్యం సంతృప్తి కలవాడు
 చలించని మది  కలవాడు
 నాపై భక్తిశ్రద్ధలు కలవాడు
 నాకు అత్యంత ప్రియుడు (12:18,19)

🙏🙏🙏🙏🙏🙏🙏
రచన:syamalaraossss
Cell: +91 99891 25191
సర్వం శ్రీ కృష్ణా ర్పణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి