27, జూన్ 2021, ఆదివారం

గీత. అ.2. శ్లో.47

 సరళంగా సులభంగా

గీత. అ.2. శ్లో.47

సాంఖ్యయోగము


కర్మలు చేయు అధికారం కలదు

కర్మ ఫలం కోరు అధికారం లేదు

కర్మ ఫలాలకు కారణం కారాదు

కర్మలు చేయకుండ మానరాదు


*కర్మణ్యేవాధికారస్తే*

*మా ఫలేషు కదాచన*

*మా కర్మఫలహేతుర్భూః*

*మా తే సంగోఽస్త్వకర్మణి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss. blogspot

12, జూన్ 2021, శనివారం

సాంఖ్యయోగము *గీత. అ.2. శ్లో.32*

 సరళంగా సులభంగా

సాంఖ్యయోగము

*గీత. అ.2. శ్లో.32*


అనుకోకుండా వచ్చిన అవకాశం

స్వర్గ ద్వారం తెరిచిన అవకాశం

క్షత్రియులు సుఖించు అవకాశం  

పార్థా పోరాడి  పొందే అవకాశం


*యదృచ్ఛయా చోపపన్నం*

*స్వర్గద్వారమపావృతమ్*

*సుఖినః క్షత్రియాః   పార్థ*

*లభంతే యుద్ధమీదృశమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

భక్తి స్తోత్రం భావగానం ఫేస్బుక్

7, జూన్ 2021, సోమవారం

సాంఖ్యం అర్దం భావం ఉద్దేశం

 *సాంఖ్యం*  

అర్దం భావం ఉద్దేశం

మూలం : వికి పీడియా

భావగానం:శ్యామలరావు

 

*అర్దం*:  

సాంఖ్య:  ఒక అంకె

సాంఖ్యం: లెక్కించే అంకెలు


*భావం*: 

దాటిన నిజ తత్వాల సంఖ్య


*ఉద్దేశం*:

మొత్తం 25 తత్వాలు దాటాలి

నీ గమ్యం మోక్షం ముక్తి చేరాలి


*వివరణ*

ఇది వేద ఉపనిషత్తుల పదం

ఇది ఋషి జ్ఞాన   అనుభవం

ఇది వారి అవగాహన సారం

ఇది జ్ఞాన  విచారణ వివరం 

 

*తత్వాల లక్ష్యం*

జంతు భావాల నుంచి  విముక్తి  

రాక్షస  భావాల నుంచి  విముక్తి

నిజమైన భావాలను తెలపటం

పురుషులలోని ఆత్మ తెలపటం

ఆత్మ పరమాత్మలను తెలపటం

పరమ పురుష లోకం తెలపటం

పరమాత్మ  లోకం చేరాలనటం

ముక్తి వైపు ప్రభావితం చేయటం

6, జూన్ 2021, ఆదివారం

గీత. అ.2. శ్లో.27

 *గీత. అ.2. శ్లో.27*


పుట్టిన  వారు మరణించక తప్పదు

మరణించిన వారు పుట్టుక తప్పదు

కనుక పరిహారం లేని వాటి కోసము

ఆ విషయాలకై నీవు శోకింపతగదు


*జాతస్య హి ధ్రువో మృత్యుః*

*ధ్రువం జన్మ మృతస్యచ*

*తస్మాదపరిహార్యేఽర్థే*

*న త్వం శోచితుమర్హసి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం ఫేస్బుక్

2, జూన్ 2021, బుధవారం

గీత. అ.2. శ్లో.23

 సరళంగా  సులభంగా 

భగవద్గీత భావ గానం

సాంఖ్యయోగము

*గీత. అ.2. శ్లో.23*


ఆత్మను అస్రం చంప లేదు

ఆత్మను అగ్ని  కాల్చ లేదు

ఆత్మను నీరు తడప లేదు 

ఆత్మను గాలి  ఆర్ప  లేదు


*నైనం ఛిందంతి శస్త్రాణి*

*నైనం   దహతి   పావకః*

*న చైనం   క్లేదయంత్యాపో*

*న   శోషయతి  మారుతః*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

 భక్తి స్తోత్రం భావ గానం ఫేస్బుక్ పేజ్

అ.2. శ్లో.22

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

అ.2. శ్లో.22


జనులు పాత బట్టలు వీడి

కొత్త  బట్టలు  ధరించినట్లు

జీవాత్మ  పాత దేహం వీడి

వేరే కొత్త దేహం ధరించును


*వాసాంసి జీర్ణాని యథా విహాయ*

*నవాని గృహ్ణాతి నరోఽపరాణి*

*తథా శరీరాణి విహాయ జీర్ణా*

*న్యన్యాని సంయాతి నవాని దేహీ*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం ఫేస్ బుక్