30, మార్చి 2021, మంగళవారం

భగవద్గీత + భావగానం* *అర్జున విషాద యోగం* *గీత.అ.1.శ్లో.5*

 సరళంగా సులభంగా

*భగవద్గీత + భావగానం*

*అర్జున విషాద యోగం* 

 *గీత.అ.1.శ్లో.5*



*ధృష్టకేతుడు చేకితానుడు*

 *కాశీరాజు  మహా వీరులు*

 *పురుజిత్ కుంతిభోజుడు*

*శైబ్యుడు ఉత్తమ వీరులు*


*ధృష్టకేతుశ్చే కితానః*

*కాశిరాజశ్చ   వీర్యవాన్*

*పురుజిత్  కుంతిభోజశ్చ*

*శైబ్యశ్చ   నరపుంగవః*




26, మార్చి 2021, శుక్రవారం

గీతాప్రార్థన

 సరళంగా సులభంగా గా 

💐   *గీతాప్రార్థన*💐

💐 + *భావ గానం*💐


*ఓం దైవం  శ్రీమన్నారాయణం*

*స్వయంగా పార్థునికి బోధనం*

*పురాణముని వ్యాస  రచనం*

*మహాభారతం మధ్య రచనం*

*కురిపించు దైవ జ్ఞానామృతం*

*18 అధ్యాయాల గీతామృతం*

*కలిగించుము  దైవానుబంధం*

*తొలగించుము సంసారబంధం*


*సంస్కృతం*

*ఓం పార్థాయ ప్రతి బోధితాం*

*భగవతా నారాయణేన స్వయం*

*వ్యాసేన గ్రథితాం పురాణమునినా*

 *మధ్యే మహాభారతం*

*అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం*

*అంబ త్వామనుసందధామి*

 *భగవద్గీతే భవద్వేషిణీం*

syamalaraossss.blogspot.com

గీతాప్రాశస్త్యము 4

 💐 *గీతాప్రాశస్త్యము 4*💐


*ఇది గీతాశాస్త్రము పుణ్యము*

*ఎవరు ప్రయత్నించి పఠింతురో*

*వారు విష్టు లోకం  పొందెదరు*

*వారు భయం శోకం   వీడెదరు*


*గీతాశాస్త్ర మిదం  పుణ్యం*

*యః పఠేత్ ప్రయతః పుమాన్*

*విష్టో   పదమవాప్నోతి*

*భయశోకాదివర్జితః*

భగవద్గీత.1.1+ భావగానం

 .


సరళంగా సులభంగా

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*భగవద్గీత.1.1+ భావగానం*


*ధృతరాష్ట్రుడు పలికెను.*

*ధర్మక్షేత్రం కురుక్షేత్రం చేరినవారు*

*యుద్ధ  ఉత్సాహం కూడినవారు*

*పాండుపుత్రులు ఇంకా నా వారు*  

*సంజయా ఏం చేస్తున్నారు వారు*

 

*దృతరాష్ట్ర ఉవాచ.*

*ధర్మక్షేత్రే కురుక్షేత్రే*

*సమవేతా యుయుత్సవః*

*మామకాః పాండవాశ్చైవ*

*కిమకుర్వత  సంజయ*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

syamalaraossss.blogspot.com

 .


సరళంగా సులభంగా

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*భగవద్గీత.1.1+ భావగానం*


*ధృతరాష్ట్రుడు పలికెను.*

*ధర్మక్షేత్రం కురుక్షేత్రం చేరినవారు*

*యుద్ధ  ఉత్సాహం కూడినవారు*

*పాండుపుత్రులు ఇంకా నా వారు*  

*సంజయా ఏం చేస్తున్నారు వారు*

 

*దృతరాష్ట్ర ఉవాచ.*

*ధర్మక్షేత్రే కురుక్షేత్రే*

*సమవేతా యుయుత్సవః*

*మామకాః పాండవాశ్చైవ*

*కిమకుర్వత  సంజయ*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

syamalaraossss.blogspot.com

20, మార్చి 2021, శనివారం

గీతామహాత్యం-3

 💐 *గీతామహాత్యం* 💐

  💐 *+ భావ గానం* 💐


*గీతయే నా ఆసనం సింహాసనం* 

*గీతయే నా ఉత్తమం నా గృహం*

*జ్ఞానమే నా తోడు  నా ఆశ్రయం*

*నేనే మూడు లోకాలకు పాలకం*


*సంస్కృతం*

*గీతాశ్రయోఽహం తిష్ఠామి*

*గీతామే చోత్తమం గృహం*

*గీతా జ్ఞానం ఉపాశ్రిత్య*

*త్రిలోక పాలయామ్యహం*


🙏 *భక్తి స్తోత్రం భావగానం* 🙏

syamalaraossss.blogspot.com

14, మార్చి 2021, ఆదివారం

గీతా మహత్యం

 💐 *గీతామహాత్మ్యము*💐


*గీతయాః పుస్తకం యత్ర*

*యత్ర పాఠః   ప్రవర్తతే*

*తత్రసర్వాణి   తీర్థాని*

*ప్రయాగాదీని    తత్రవై*


ఎచట భగవద్గీత పుస్తకం ఉండునో 

ఎచట గీతా పారాయణం ఉండునో 

అచట ప్రయాగ తీర్థాలు  ఉండును

అచట సమస్త   తీర్థాలు  ఉండును


10, మార్చి 2021, బుధవారం

శివ పంచాక్షర స్తోత్రం + భావగానం

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*శివ పంచాక్షర స్తోత్రం*

  + *భావగానం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 సంస్కృత మూలం:

 శ్రీ ఆది శంకరాచార్యులు 

భావగానం రచన:

శ్యామలరావు ssss


*నాగేంద్ర హారాయ త్రిలోచనాయ*

*భస్మాంగరాగాయ  మహేశ్వరాయ* 

*నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ*

*తస్మై నకారాయ నమ శివాయ*

  || 1 ||

 నాగేంద్రుడు నీ కంఠహారమయ

 బూడిద శరీర అలంకారమయ

మూడు కనుల మహా దేవాయ

నిత్యమైన స్వచ్ఛమైన దేవాయ

దిక్కులే బట్టలు స్వతంత్రాయ

పంచాక్షరీ మంత్రనాధ దేవాయ

*న* కారాయ నమస్తే శివాయ

 

*మందాకినీ సలిల చందనచర్చితాయ*

*నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ*

*మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ*

*తస్మై మ కారాయ నమ శివాయ*

 || 2 ||


పవిత్ర గంగా చందన లేపితాయ 

నందీశ్వరాయ  మహేశ్వరాయ 

సకల భూత గణాల  పూజితాయ

మందార జిల్లేడుపూల అర్చితాయ

పలు రకాల పూలతో పూజితాయ  

*మ* కారాయ  నమస్తే   శివాయ


*శివాయ గౌరీ వదనాబ్జ బ్రుంగ*

*సూర్యాయ దక్షాధ్వర నాశకాయ*

*శ్రీనీలకంఠాయ వ్రుషభ ధ్వజయ*

*తస్మై శి కారాయ నమశివాయ*

|| 3 ||


గౌరీ ముఖకమల వికా‌స సూర్యాయ

శుభాయ  దక్షయజ్ఞ నాశనాయ 

శ్రీ నీల కంఠాయ నంది ద్వజాయ

*శి* కారాయ  నమస్తే   శివాయ 

 

 *వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది* 

*మునీంద్ర దేవార్చిత శేఖరాయ |*

*చంద్రార్క వైశ్వనర లోచనాయ*

*తస్మై వ_కారాయ నమశివయ*

 || 4 ||


వశిష్ఠ అగస్త్య గౌతమ మునులు

దేవతా పూజితా విశ్వ కిరీటాయ

అగ్ని సూర్య చంద్రుల కనులాయ

 *వ* కారాయ నమస్తే  శివాయ

 

 *యక్ష స్వరూపాయ  జఠాధరాయ*

 *పినాక హస్తాయ సనాతనాయ*

 *దివ్యాయ దేవాయ దిగంబరాయ*

*తస్మై య కారాయ నమ శివాయ*

 || 5 ||


 యక్ష రూపాయ జడల శిరోజాయ

 చేతి త్రిశూలాయ సనాతనాయ 

 దివ్యప్రకాశాయ దిశలె బట్టలయ

 *య* కారాయ నమస్తే శివాయ  


*పంచాక్షర మిదం పుణ్యం* 

*యః పఠేత్ శివ సన్నిధౌ*

 *శివ లోకమవాప్నోతి*

*శివేన సహమోదతే* || 6 ||


ఇది శివ పంచాక్షరీ మంత్రం

శివుని దగ్గర చదివిన పుణ్యం

వారు శివ లోకం  పొందెదరు 

 శివుని తో ఆనందించెదరు

1, మార్చి 2021, సోమవారం

*కఠోపనిషత్తు* భావగానం

 సరళంగా  సులభంగా 

*కఠోపనిషత్తు* భావగానం


*ఆదిశంకరాచార్య రచనం*   

*కఠినమైన సాధన సారం* 

*ఇది  ఆత్మ విద్యా సారం*  


*యముడు   తెలిపిన విద్య* 

*నచికేతునికి తెలిపిన విద్య* 


ఆత్మయే మెలుకువలో నిద్రలో

విశ్వంతో  సంబంధాల అంశం 

అదే ప్రాణం పరమాత్మ అంశం

వేరే దేహంలోకి మారు అంశం


*అతిధిలా దేహంలో వుంది*

*ప్రాణంలా దేహంలో వుంది*

*జీవంలా  జీవులలో వుంది*


గ్రహాలు తారలు తారలరాశులు 

పద్దతి చక్రం లో అవి తిరుగును

వాటిని తిప్పేశక్తే  పరమాత్మ శక్తి

విశ్వం అంతటా  పరమాత్మ శక్తి 


*అంతా జననమరణ చక్రం*

*వీడాలి జననమరణ చక్రం*


*మనసుతో తెలుసుకోవాలి*

*ఆత్మ ఉనికి తెలుసుకోవాలి* 

*నీలో దైవాంశం అతిసూక్ష్మం*


*నది యేరు మేఘం తటాకం*

*రూపాలు అనేకం నీరు ఏకం*

*జీవాలు అనేకం ఆత్మ ఏకం*

  

*పురం  నివాస ప్రాంతం* 

*పురం పురుష నివాసం* 

*దేహం ఆత్మ   నివాసం*

*ఆత్మ నిత్యం  సత్యం*  

*జీవులలోని దైవాంశం*


*దేహం వీడిన తరువాత*

*అది చేసిన మంచి ధర్మం*

*తెలిసిన విజ్ఞాన సారం*

*అవే దేహం అవకాశం*

*అలా దేహం పొందును*

*గుణం భావం పొందును*


*ఆత్మ  అలా వుంటుంది*

*ఆత్మ  ఇలా వుంటుంది*

*అని  తెలుపుట కష్టము*

*ఆత్మ  అంతాటా వుంది*

*ఆత్మను సాక్షిగా చూడాలి*

*ఆత్మ అనుభవం కలగాలి*

*ఆ బ్రహ్మానందం పొందాలి* 

*కఠినంగా సాధన చేయాలి*

*నీవుగా ఆత్మను చుాడాలి* 

*ఆ సాక్షాత్కారం పొందాలి*


*నీకు విజయము కలుగును* 

*అని నచికేతుని దీవించెను*


*యముని బోధన  వినెను*

*నచికేతుడు ఆచరించెను*

*జ్ఞానంతో సాధన చేసెను* 

*తనలోఆత్మను చూసెను*

*బ్రహ్మానందం  పొందెను*

  నా బ్లాగ్ స్పాట్ చూడండి

syamalaraossss.blogspot.com

*సర్వం శ్రీకృష్ణార్పణం*

🙏🙏🙏🙏🙏🙏🙏