29, మే 2021, శనివారం

సాంఖ్య యోగం *గీత.అ.2. శ్లో.18*

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

*సాంఖ్య యోగం*

*గీత.అ.2. శ్లో.18*


దేహాలకే అంతం ఉంది   

దేహాత్మ అంతం  లేనిది

అది   అనంతం నిత్యం

కనుక పోరాడు అర్జునా


*అంతవంత ఇమే  దేహా*

*నిత్యస్యోక్తాః శరీరిణః*

*అనాశినోఽప్రమేయస్య*

*తస్మాద్యుధ్యస్వ భారత*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

భక్తి స్తోత్రం  భావ గానం fb page

27, మే 2021, గురువారం

గీత. అ.2. శ్లో.17


 సరళంగా సులభంగా

 భగవద్గీత భావ గానం

*సాంఖ్యయోగము*

*గీత. అ.2. శ్లో.17*


మన లోనిది  నాశనం లేనిది

తెలుసుకో అంతటా వున్నది    

అది శాశ్వతము నశించనిది 

ఎవరూ నాశనం చేయలేనిది


*అవినాశి తు తద్విద్ధి*

*యేన సర్వమిదం తతమ్*

*వినాశమవ్యయస్యాస్య*

*న   కశ్చిత్   కర్తుమర్హతి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం Fb page

26, మే 2021, బుధవారం

గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.14

 సరళంగా సులభంగా 

భగవద్గీత భావ గానం

*గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.14*


సుఖ దుఃఖాలె ఇంద్రియ విషయాలు

చలి వేసవి కాలం వంటి విషయాలు

అవి నిత్యం వచ్చి పోవు విషయాలు

అర్జునా ఓపికపట్ట తగు విషయాలు


*మాత్రాస్పర్శాస్తు కౌంతేయ*

*శీతోష్ణసుఖదుఃఖదాః*

*ఆగమాపాయినోఽనిత్యాః*

*తాంస్తితిక్షస్వ   భారత*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

భక్తి స్తోత్రం భావ గానం FB page

25, మే 2021, మంగళవారం

 సరళంగా సులభంగా

 భగవద్గీత భావ గానం

గీత. అ.2. శ్లో.12


అర్జునా నేను లేని కాలము ఉండదు 

నీవు రాజులు లేని కాలము ఉండదు

మనంలేని భవిష్య కాలము ఉండదు

అందరం ఆ కాలంలో కూడ  ఉంటాం


*నత్వేవాహం జాతు నాసం*

*న త్వం   నేమే   జనాధిపాః*

*న చైవ న    భవిష్యామః*

*సర్వే వయమతః  పరమ్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం fb page

24, మే 2021, సోమవారం

గీత.సాంఖ్యయోగం అ.2.. శ్లో.13

 సరళంగా సులభంగా

భగవద్గీత+ భావ గానం

గీత.సాంఖ్యయోగం అ.2.. శ్లో.13


ఎలా దేహము  బాల్యం పొందునో

యవ్వనం ముసలితనం పొందునో 

అలా దేహి మరో దేహం పొందును

ధీరుడు దీనికి  మోహం  పొందడు


*దేహినోఽఅస్మిన్ యథా దేహే*

*కౌమారం యౌనవం  జరా*

*తథా   దేహాంతరప్రాప్తిః*

*ధీరస్తత్ర  న   ముహ్యతి*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot

18, మే 2021, మంగళవారం

సాంఖ్య యోగం గీత.అ.2. శ్లో.5

 సరళంగా  సులభంగా

భగవద్గీత భావ గానం

సాంఖ్య యోగం

గీత.అ.2. శ్లో.5


గురువులు మహనీయులను చంపి

రక్తము చిందిన భోగం తినుట కంటే

గురువులు మహనీయులను చంపక

బిక్షం అడుక్కుని తినుట మేలు కదా


*గురూనహత్వా హి మహానుభావాన్*

*శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే*

*హత్వార్థకామాంస్తు గురూనిహైవ*

*భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

భక్తి స్తోత్రం భావ గానం fb page

16, మే 2021, ఆదివారం

అ.1.శ్లో.37

 సరళంగా సులభంగా

భగవద్గీత  + భావ గానం

అర్జున విషాదయోగం

 అ.1.శ్లో.37


*మన బంధువులను మాధవా*

*మన వారిని చంపుట తగదు* 

*మన వారిని  మనం చంపుట*

*మనకు ఎలాసుఖం మాధవా*


*తస్మాన్నార్హా  వయం హంతుం*

*ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్*

*స్వజనం హి కథం హత్వా*

*సుఖినః స్యామ మాధవ*


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

syamalaraossss.blogspot