2, జూన్ 2017, శుక్రవారం

🙏🙏🙏🙏🙏🙏
*నవవిధ భక్తు లోయి*
*నీవు తరింతువోయి*
రచన: syamalaraossss

*1) శ్రవణం:*
*పొట్టలోనె వినెనోయి*
*ప్రహ్లాదుడు తరించెనోయి*

*2)కీర్తనం:*
*రాగాలు పాడెనోయి*
*త్యాగయ్య తరించెనోయి*

*3)స్మరణం:*
*రామ రామయనెనోయి*
*హనుమ తరించెనోయి*

*4)పాద సేవనం:*
*సాయి పాద  సేవనోయి*
*మహల్సా తరించెనోయి*

*5)అర్చనం:*
*తులసిమాల లేసెయి*
*గోదాదేవి తరించెనోయి*

*6)వందనం:*
*పాదుకల సేవనోయి*
*భరతుడు తరించెనోయి*

*7)దాస్యం:*
*అన్నీ  సేవలు చేసెనోయి*
*లక్ష్మణుడు తరించెనోయి*

*8)సఖ్యం:*
*మిత్రునిగా సేవించెనోయి*
*కుచేలుడు తరించెనోయి*

 *కామ క్రోధ లోభా లోయి*
*నిను తరించ నీయవోయి*

*9)ఆత్మ నివేదనం:*
*కోరికలు వీడిన భక్తోయి*
*ఆత్మ సమర్పణ మోయి*

*అదే నిన్ను తరించునోయి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి