25, జూన్ 2017, ఆదివారం

Nava graha prardhana

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*నవగ్రహ ప్రార్ధన మంత్రం*

*ఓం ఆదిత్యాయ సోమాయ*
*మంగళాయ బుధాయ*
*గురు శుక్ర శనీ భ్యశ్చ*
*రాఘవే  కేతవే నమః*

భావము:
సూర్యాయ చంద్రాయ
అంగారకాయ బుధాయ
గురు శుక్ర శని మరియు
రాహు కేతు లకు వందనం

*నవగ్రహ ప్రదక్షిణ ప్రార్ధన*
భావ గానం
*ఆది*
ఆదివారము నీపేరుదోయి
ఎర్రమందార రంగువోయి
కాశ్యపగోత్ర సూర్యునివోయి
నవగ్రహాల అధిపతివోయి
ఆదిత్యాయ వందనమోయి
*సోమ*
సోమవారము నీపేరుదోయి
తెల్ల శంఖాల రంగువోయి
ఆత్రేయగోత్ర చంద్రునివోయి
సోమ దేవ వందన మోయి
*మంగళ*
మంగళవారము నీపేరుదోయి
మెరుపుబంగారు రంగువోయి
భరద్వాజగోత్ర అంగారకాయ
మంగళ దేవ వందనమోయి
*బుధ*
బుధవారము  నీపేరుదోయి
నల్లరంగు బుధునివోయి
బుధ దేవ వందనమోయి
*గురు*
గురువారము నీ పేరుదోయి
అంగీరసగోత్ర  దేవగురువోయి
గురు దేవ  వందనమోయి
*శుక్ర*
శుక్రవారము నీ పేరుదోయి
భార్గవగోత్ర దానవగురువోయి
 శుక్ర దేవ వందనమోయి
*శని*
శనివారము నీపేరుదోయి
కశ్యప గోత్ర శని వోయి
శని దేవ  వందనమోయి
*రాహు*
 గ్రహనీడన పుట్టావోయి
 దక్షిణనక్షత్రాల వానివోయి
 రాహుదేవ వందనమోయి
*కేతు*
 గ్రహనీడన పుట్టావోయి
 జైమినిగోత్ర ఛాయవోయి
 మహాకోప రుద్రాత్మవోయి
 కేతుదేవ వందనమోయి
రచన :ssss syamalarao

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి