2, జూన్ 2017, శుక్రవారం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీ మహాలక్ష్మీ అష్టకం*
*భక్తి భావ గానం*

*నమస్తేస్తు మహామాయే*
*శ్రీపేఠే సురపూజితే*
*శంఖచక్రగదాహస్తే*
*మహాలక్ష్మీ నమోస్తుతే*

నమస్తే మహామాయా
శ్రీపీఠనివాసినీ
సకలదేవ పూజితా
చేత శంఖ చక్ర గధా
ఆయుధాల దేవీ
మహాలక్ష్మీ వందనం

*నమస్తే గరుఢారూఢేః*
*డోలాసురభయంకరి*
*సర్వపాపహరే దేవి*
*మహాలక్ష్మి నమోస్తుతే*

గరుడ విహారిని
డోలారాక్షస సంహారి
సకలపాప నాశనీ
మహాలక్ష్మి వందనం

*సర్వజ్ఞే  సర్వవరదే*
*సర్వదుష్ట భయంకరి*
*సర్వదుఃఖహరే దేవి*
*మహాలక్ష్మి నమోస్తుతే*

సకల మెరిగిన
సకల వర దాయిని
సకల దుష్ట సంహరిణి
సకల దుఃఖ నాశనీ
మహాలక్ష్మి  వందనం

*సిద్ధిబుద్ధిప్రదే దేవి*
*భుక్తిముక్తిప్రదాయిని*
*మంత్రమూర్తే సదాదేవె*
 *మహాలక్ష్మి నమోస్తుతే*

సిద్ధిని బుద్ధినీయు దేవి
భుక్తిని ముక్తినీయు దేవి
మాతా మంత్రరూపిణి
మహాలక్ష్మీ  వందనం

*ఆద్యంతరహితే  దేవి*
*ఆద్యశక్తి మహేశ్వరి*
*యోగజే యోగసంభూతే*
*మహాలక్ష్మి నమోస్తుతే*

ఆదిఅంతాలు లేనిదేవి
ఆదిశక్తీ  మహేశ్వరీ
యోగాన జనించేవు
ధ్యానాన కనిపించేవు
మహాలక్ష్మి వందనం

*స్థూలసూక్ష్మ మహారౌద్రే*
*మహాశక్తి  మహోదరే*
*మహాపాపహరే దేవి*
*మహాలక్ష్మి  నమోస్తుతే*

మహా పెద్ద రూపా
మహా చిన్న రూపా
మహారౌద్ర రూపా
మహా శక్తి రూపా
మహాగర్భ రూపా
మహాపాప నాశీ
మహాలక్ష్మీ వందనం

*పద్మాసన స్థితే దేవి*
*పరబ్రహ్మ స్వరూపిణి*
*పరమేశి  జగన్మాత*
*మహాలక్ష్మి నమోస్తుతే*

పద్మాసన దేవి
సృష్టి రూపిణి
పరమేశ్వరీ లోకమాత
మహాలక్ష్మీ వందనం

*శ్వేతాంబరధరే దేవి*
*నానాలంకారభూషితే*
*జగత్ స్థితే  జగన్మాత*
*మహాలక్ష్మి నమోస్తుతే*

తెలుపు వస్త్రాల దేవీ
సకల అలంకారాల దేవి
సకలలోకాలగతివి దేవి
విష్ణుపత్నీ లోకమాతా
మహాలక్ష్మి  వందనం  

*ఫలశ్రుతి*

*మహాలక్ష్మ్యష్టక స్తోత్రం*
*యః పఠేత్ భక్తిమాన్నరః*
*సర్వసిద్ధి మవాప్నోతి*
*రాజ్యం ప్రాప్నోతి సర్వదా*

మహాలక్ష్మి అష్టక మిదోయి
భక్తితో పాడిన వారి కోయి
సర్వము శుభమవునోయి
సకలము లభించు నోయి

*ఏకకాలే పఠేన్నిత్యం*
*మహాపాపవినాశనం*
రోజూ ఒక సారి చదివిన
పాపాలు నశించునోయి

*ద్వికాలం యః పఠేన్నిత్యం*
 *ధనధాన్యసమన్వితః*
రోజూ రెండు సార్లు చదివిన
ధనధాన్యాలు కలుగునోయి

*త్రికాలం యః పఠేన్నిత్యం*
 *మహాశత్రువినాశనం*
 రోజూ మూడుసార్లు చదివిన
  శత్రువులు నశింతురోయి

*మహాలక్ష్మీ ర్భవే నిత్యం*
 *ప్రసన్నా వరదా శుభా*
 రోజూ మహాలక్ష్మీ తోనోయి
ప్రసన్న వరాలు శుభాలోయి

*ఇదం ఇంద్రకృతం*
*శ్రీ మహాక్ష్మ్యస్టకం*
*సంపూర్ణం*
దివ్యశోభాశ్యామలుని లక్ష్మీ
చక్రపాణి చేయి పట్టిన లక్ష్మీ
అష్టకం స్తోత్ర పఠనం ధన్యం
ఇది దేవేంద్రుని రచనం పూర్ణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి