ప్రార్థనా శ్లోకాలు*
*భావ గానాలు*
🙏🙏🙏🙏🙏🙏
రచన: శ్యామలారావు ssss
+91 99891 25191
*1)*
*శుక్లాంబర ధరం విష్ణుం*
*శశివర్ణం చతుర్భుజం |*
తెల్లని వస్త్రాల దేవుడోయి
అంతటా ఉండు దేవుడోయి
తెల్లగా ఉండు దేవుడోయి
నాలుగు చేతుల దేవుడోయి
*ప్రసన్నవదనం వంగిన ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||*
ప్రసన్నమైన రూపమోయి
అన్ని అడ్డాలు ఆపునోయి.
*2)*
*వత్రుండ మహాకాయా*
వంగిన తొండమున్నదోయి
భారీ శరీరమతడోయి
*కోటిసూర్యసమ ప్రభా* |
కోటిసూర్యుల కాంతుడోయి
*నిర్విఘ్నం కురుమే దేవా*
విఘ్నాలు తొలగింతువయా
*సర్వకార్యేషు సర్వదా ||*
సకల శుభకార్యాలకయా
*3)*
*వందే శంభుం*
*ఉమాపతిం*
*సురగురుం వందే*
శంభునకు వందనం
పార్వతీ పతికి వందనం
దేవ గురువుకు వందనం
*జగత్కారణం వందే*
లోక కారకునికి వందనం
పన్నగ భూషణం*
*మృగధరం*
నాగ భూషణునికి వందనం
చర్మ ధారికి వందనం
*వందే పశూనాంపతిం |*
పశువుల పతికి వందనం
*వందే సూర్య శంశాంక*
*వహ్నినయనం*
సూర్య చంద్రాగ్ని కనులకు
వందనం
*వందే ముకుంద ప్రియం*
గోవింద ప్రియునికి వందనం
*వందే భక్త జనాశ్రయంచ*
*వరదం*
*వందే శివం శంకరమ్*
భక్త జన వరాల శివునికి
శంకరునికి వందనం
*4)*
*వ్యాసాయ విష్ణురూపాయ*
వ్యాసుడే విష్ణు రూపమోయి
*వ్యాసరూపాయ విష్ణవే*
వ్యాస రూపమే విష్ణువోయి
*నమోవై బ్రహ్మనిధయే*
బ్రహ్మ కర్మల నిధి వయా
*వాసిష్ఠాయ నమోనమః ||*
విధివిధానాల నిష్టవయా
మీకు వందనమయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి